ramakkapet
-
నిందితులపై కేసు నమోదుకు కేసీఆర్ ఆదేశం
మెదక్ : మెదక్ జిల్లా రామక్కపేట అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. నిందితులపై వెంటనే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆయన శనివారం ఆదేశించారు. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం కింద రూ.25వేలు అందించాలని కేసీఆర్ ఎమ్మెల్యే రామలింగారెడ్డికి సూచించారు. ఈ ఘటనపై కేసీఆర్...రామలింగారెడ్డితో ఫోన్లో మాట్లాడారు. రామక్కపేటలో నలుగురు దుండగులు తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. -
తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం
-
తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం
(సాక్షి టీవీ రిపోర్టర్ విష్ణు) మెదక్ : మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు తల్లీకూతురుపై అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే రామక్కపేటకు చెందిన ఇంటర్ విద్యార్థిని దసరా వేడుకల్లో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ముఖాలకు ముసుగులు ధరించి ఆమెను అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం దుండగులు...విద్యార్థిని ఇంటికి వెళ్లి మీ కూతురు అక్కడ పడిపోయిదని ఆమె తల్లికి సమాచారం అందించారు. దాంతో కంగారు పడిన ఆమె వారి వెంట వెళ్లగా...తల్లిపై కూడా దుండగులు అత్యాచారం చేశారు. అర్థరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని బాధితురాలు శనివారం ఉదయం గ్రామ సర్పంచ్‌కు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.