గుంటూరు: గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. కుమార్తెతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... తల్లీకూతురు మృతదేహాన్ని బావిలోని బయటకు తీసి... పోస్ట్మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.