విశాఖపట్నం: చీటీల పేరుతో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బాధితులు కూడా పెరిగిపోతున్నారు. ఓ పక్కన చీటీల పేరుతో కోట్ల రూపాయలకు కుచ్చు టోపీ పెడుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రజలు మాత్రం మళ్లీ మళ్లీ అదే విధంగా మోసపోతూనే ఉన్నారు. విశాఖలోని అంగడిదిబ్బలో ఈ సారి తల్లీకూతుళ్లు కలిసి ప్రజలకు టోకరావేశారు.
ఈ తల్లీ కూతుళ్లు చీటీల పేరుతో ప్రజల వద్ద నుంచి దాదాపు మూడు కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ మొత్తం సర్ధుకొని ఉడాయించారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు బాధితులు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ తల్లీకూతుళ్ల కోసం ఆరా తీస్తున్నారు.
తల్లీకూతుళ్లు కలిసి రూ.3కోట్లకు టోకరా!
Published Sat, Apr 26 2014 6:37 PM | Last Updated on Thu, Jul 11 2019 7:49 PM
Advertisement
Advertisement