chits
-
ఆర్థిక ఉగ్రవాది అరాచకాలు
సాక్షి, అమరావతి: పచ్చళ్ల వ్యాపారి... చిట్‌ఫండ్ సంస్థ యజమాని... పత్రికాధిపతి... ఫిల్మ్ సిటీ అధినేత... ఇవన్నీ చెరుకూరి రామోజీరావు ధరించిన లొసుగుల ముసుగులే! దశాబ్దాలుగా సాగించిన అక్రమ డిపాజిట్లే ఆయన దోపిడీకి రాచబాట. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీ సేకరించినవి అక్రమ డిపాజిట్లేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సుప్రీంకోర్టుకు నివేదించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. రామోజీరావు ఓ ఆర్థిక నేరస్తుడే అన్నది స్పష్టమైంది. చిట్‌ఫండ్స్ బోర్డు.. ఫైనాన్సియర్స్ పేరిట భారీగా అక్రమ డిపాజిట్లు 2006 వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే వరకు ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ అనే సంస్థ ఉన్నట్లు కూడా సామాన్యులకు తెలియదు. రాష్ట్రం అంతటా ‘మార్గదర్శి చిట్ ఫండ్స్’ కార్యాలయాలే కనిపించేవి. ఆ కార్యాలయాల్లోనే గుట్టు చప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట మరో కంపెనీ ఆర్థిక కార్యకలాపాలు సాగించిందనే విషయం బయటి ప్రపంచానికి తెలియదు. అలా 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ యథేచ్ఛగా అక్రమ కార్యకలాపాలు సాగించింది. ఆర్బీఐ చట్టం 45ఎస్ ప్రకారం కంపెనీల చట్టం కింద నమోదైన ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. రామోజీ తన గ్రూపు సంస్థలను ‘హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్) కింద నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు. హెచ్‌యూఎఫ్ కింద నమోదైన కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. 2006లో మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చే నాటికి ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లను సేకరించడం విభ్రాంతికర వాస్తవం. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగా మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు నివేదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లెంపలేసుకుని.. ‘మార్గదర్శి’ షట్టర్ క్లోజ్ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా బయటపడటంతో రామోజీరావు కంగుతిన్నారు. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు రంగాచారిని విచారణ అధికారిగా నియమించింది. సీఐడీ తరపున న్యాయ స్థానాల్లో కేసులు దాఖలు చేసేందుకు టి.కృష్ణంరాజును అధీకృత అధికారిగా నియమించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించినట్టు వీరు గుర్తించారు. సెక్షన్ 45 ఎస్ ప్రకారం హెచ్‌యూఎఫ్‌లు డిపాజిట్లు సేకరించకూడదని ఆర్బీఐ స్పష్టం చేయడంతో రామో జీ తాము తప్పు చేసినట్టు అంగీకరించారు. నగదు రూపంలో డిపాజిట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. డిపాజిట్ దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లించి మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసి వేస్తామని న్యాయస్థానానికి లిఖిత పూర్వకంగా తెలిపారు. అంతా నల్లధనం దందానే మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించిన ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ ముసుగులో రామోజీరావు భారీగా నల్లధనం దందాను సాగించారు. సీఐడీ సోదాల్లో, ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఆ విషయం వెలుగు చూసింది. అందుకనే డిపాజిట్‌దారుల వివరాలను వెల్లడించేందుకు రామోజీరావు మొండికేశారు. డిపాజిట్ల ముసుగులో టీడీపీ పెద్దలు భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చారు. ♦ కేంద్ర ఆదాయపన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించి రామోజీ నల్లధనం దందా నడిపారు. రూ.20 వేలకు మించిన లావాదేవీలు నగదు రూపంలో తీసుకోకూడదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 269 స్పష్టం చేస్తోంది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో దాదాపు అన్ని డిపాజిట్లు నగదు రూపంలోనే తీసుకోవడం గమనార్హం. నగదు రూపంలో డిపాజిట్లు స్వీకరించి తమ సిబ్బంది ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ), పే ఆర్డర్లు(పీఓ)ల రూపంలోకి మార్చినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీల్లో బయట పడింది. డిపాజిట్ చేసిన మొత్తాలను రూ.50 వేల కంటే తక్కువ మొత్తాలుగా విభజించి మరీ డీడీలు, పీఓలుగా మార్చారు. ♦ మార్గదర్శి ఫైనాన్సియర్స్ రశీదు రూపంలో సేకరించిన డిపాజిట్ల పత్రాలను పరిశీలిస్తే అదంతా నల్లధనం బాగోతమేనన్నది స్పష్టమవుతోంది. డిపాజిట్‌దారుల పాన్ నంబర్లు, పూర్తి చిరునామాలు కూడా లేకుండానే డిపాజిట్లు సేకరించడం గమనార్హం. ♦ రామోజీరావు 2008లో సమర్పించిన అఫిడవిట్లో రూ.1,864.10 కోట్లు డిపాజిట్‌దారులకు చెల్లించేశామని తెలిపారు. మరి మిగిలిన దాదాపు రూ.750 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ డబ్బంతా రామోజీకి అత్యంత సన్నిహితుడైన టీడీపీ పెద్దలు, ఆయన గ్యాంగ్‌వేనని తెలుస్తోంది. -
చిటీల పేరుతో టీడీపీ నేత అప్పలనాయుడు భారీ మోసం
-
విజయవాడలో టీడీపీ నేత ఘరానా మోసం.. రూ.6 కోట్లతో పరార్!
సాక్షి, విజయవాడ: నగరంలోని భానునగరంలో చిట్టీల పేరుతో టీడీపీ నేత ఘరానా మోసానికి పాల్పడ్డాడు. చిట్టీల పేరుతో టీడీపీ నేత పతివాడ అప్పలనాయుడు జనాన్ని నిండా ముంచారు. సుమారు 300 మంది నుంచి రూ.6 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. బాధితులు గుణదల పోలీసులను ఆశ్రయించారు. న్యాయం చేయాలంటూ అప్పలనాయుడి ఇంటి వద్ద బాధితుల ధర్నా చేపట్టారు. ‘సాక్షి’తో బాధితులు మాట్లాడుతూ, చిటీల పేరుతో నమ్మించి మోసం చేశాడని, రోజువారీ కూలీకి వెళ్తూ చీటీ కట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.5 లక్షలు, రూ.10లక్షలు చిటీలు కట్టిన వాళ్లం వందల్లో ఉన్నాం. చిటీ పూర్తయిన తర్వాత కూడా ఇవ్వకుండా తన వద్దే ఉంచుకుని వడ్డీ ఇస్తానని మోసం చేశాడు. ఏడాదిగా డబ్బు ఇవ్వకుండా మోసం చేశాడు. ఐపీ పెట్టినట్టు నోటీసులు వచ్చాయి. మాకు న్యాయం చేయాలి’’ అని బాధితులు కోరుతున్నారు. చదవండి: మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య దారుణ హత్య కాగా, పతివాడ అప్పలనాయుడు.. గత పదేళ్లుగా చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తుండటంతో పాటు అధిక వడ్డీలు ఇవ్వటంతో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు అప్పలనాయుడు వద్ద వారు దాచుకున్న నగదును వడ్డీలకు ఇచ్చుకునేవారు. ఈ క్రమంలో అప్పల నాయుడు అందినంత వరకు వసూలు చేసుకుని గత పదిరోజులుగా అదృశ్యమయ్యాడు. తాజాగా సోమ, మంగళవారాల్లో అప్పలనాయుడు కొంతమందికి ఐపీ నోటీసులు పంపించటంతో బాధితులు తమకు జరిగిన మోసాన్ని గ్రహించి లబోదిబోమంటున్నారు. -
చందాదారుల భద్రతే లక్ష్యంగా ‘ఈ–చిట్స్’
సాక్షి, అమరావతి: చందాదారుల భద్రతే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో ‘ఈ–చిట్స్’ సేవలను అమల్లోకి తీసుకొస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేస్టేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ అప్లికేషన్‌ను వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. చిట్‌ఫండ్ కంపెనీల మోసాలకు సంబంధించి ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ఇటువంటి మోసాలకు గురికాకుండా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ–చిట్స్ సేవలను అమల్లోకి తెచ్చిందన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేస్టేషన్ల శాఖ రూపొందించిన ఈ నూతన ఎల్రక్టానిక్ విధానాన్ని ఇకపై రాష్ట్రంలోని చిట్‌ఫండ్ కంపెనీలన్నీ తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుందన్నారు. చిట్‌ఫండ్ లావాదేవీలను ఆన్లైన్ ద్వారానే నిర్వహించాల్సి ఉందని, రిజిస్ట్రేస్టేషన్ శాఖ అధికారులు కూడా ఆన్లైన్ విధానంలోనే సంబంధిత లావాదేవీలను పరిశీలించి ఆమోదిస్తారని తెలిపారు. ‘ఈ–చిట్స్’ విధానంవల్ల చిట్‌ఫండ్ కంపెనీల మోసాలను అరికట్టడమే కాక చందాదారులు నష్టపోకుండా సహకరిస్తుందని మంత్రి చెప్పారు. చిట్‌ఫండ్ కంపెనీల విషయంలో చందాదారులు కూడా ఎంతో అప్రమత్తంగా ఉంటూ తమ ప్రాంతాల్లో నడుస్తున్న చిట్‌ఫండ్ సంస్థలు రిజిస్టర్ అయ్యాయా? లేదా? అనే విషయాన్ని ముందుగా ఈ విధానంలో తెలుసుకోవచ్చన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఉండే అసిస్టెంట్ రిజిస్ట్రేస్టార్ ఆఫ్ చిట్స్ని కూడా ఈ విషయంలో సంప్రదించవచ్చన్నారు. అదే విధంగా చిట్‌ఫండ్ కంపెనీల నుండి ఎదుర్కొనే ఎటువంటి సమస్యలలైనా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందని, ఆ సమస్యలను సత్వరమే అధికారులు పరిష్కరించే అవకాశం ఈ నూతన విధానం ద్వారా అమల్లోకి వచ్చిందన్నారు. ఇంకా అదనపు వివరాలను https:// echits.rs. ap.gov.in నుండి తెలుసుకోవచ్చని మంత్రి ధర్మాన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాంపులు, రిజిస్ట్రేస్టేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ, అడిషనల్ ఐజీ ఉదయభాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జగజ్జనని చిట్స్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు
-
పరీక్షలో కొడుకు కోసం చిట్టీలు.. పోలీసులకు దొరికిన తండ్రి
సుద్ద మొద్దు అయిన కొడుకును ఎలాగైనా పరీక్ష గండం గట్టెక్కించాలని ఆ తండ్రి తాపత్రయపడ్డాడు. నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లి చిట్టీలు అందించేందుకు యత్నించాడు. కానీ, ఆ తండ్రికి చివరకు చేదు అనుభవం ఎదురైంది. సడన్ ఎంట్రీ ఇచ్చిన ఖాకీలు ఆ తండ్రిని పరిగెత్తించి మరీ చితకబాదారు. సోషల్ మీడియాలో ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. మహారాష్ట్రలో స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ తరుణంలో జలగావ్‌లోని ఓ పరీక్షా కేంద్రం వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొడుక్కి చిట్టీలు అందిస్తున్న సమయంలో.. ఎగ్జామ్ ఇన్విజిలేటర్ ఆ విషయాన్ని గమనించి బయట ఉన్న పోలీసులను అప్రమత్తం చేశారు. వాళ్లు పరీక్షా కేంద్రం వెనక నుంచి పరిగెడుతున్న ఆ తండ్రిని దొరకబుచ్చుకుని.. చితకబాదారు. కిందపడినా కూడా వదలకుండా లాఠీలతో బాదేశారు. శనివారం ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం పన్నెండవ తరగతి లెక్కల పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రాలు రెండూ లీక్ కావడం కలకలం సృష్టించిది. బుల్దానా జిల్లా సింధ్‌ఖేడ్ రాజా తాలుకాలో ఈ లీకేజీ వ్యవహారం వెలుగుచూసింది. ఈ ఘటనపై మహారాష్ట్ర స్టేట్ బోర్డు ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డు పోలీసులను ఆశ్రయించగా.. వాళ్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ లీక్ ప్రభావం పరీక్ష మీద పడలేదని బోర్డు ప్రకటించుకోవడం గమనార్హం. मुलाला कॉपी पुरवायला गेलेल्या बापाला पोलिसांकडून बेदम चोप, व्हिडिओ व्हायरल pic.twitter.com/RiF402O2X6 — Kiran Balasaheb Tajne (@kirantajne) March 4, 2023 -
అనూస్ పేరుతో బ్యూటీ పార్లర్.. స్థానికులతో పరిచయం పెంచుకుని.. చివరికి
అనంతపురం క్రైం: చిట్టీలు, అధిక వడ్డీల పేరిట ప్రజలను మోసగించిన జయలక్ష్మి కటకటాలపాలైంది. ఆమెను కర్నూలు జిల్లా అహోబిలం దేవాలయ సమీపంలో మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. కారు, రెండు సెల్ఫోన్లు, 20 చిట్టీల బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అనంతపురంలోని జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఓంకార్ ఎదుట హాజరుపర్చారు. రిమాండ్‌కు ఆదేశిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. నాల్గవ పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. చదవండి: ప్రేమపేరుతో ట్రాప్.. లాడ్జికి తీసుకెళ్లి.. మద్యం తాగించి కడప నగరంలోని బాలాజీనగర్‌కు చెందిన జయలక్ష్మి 15 ఏళ్లుగా అనంతపురంలో నివాసముంటోంది. అనూస్ పేరుతో బ్యూటీ పార్లర్ నిర్వహించేది. అక్కడికి వచ్చే వారితో పాటు స్థానికులతో పరిచయం పెంచుకుంది. చిట్టీలు, అధిక వడ్డీల వ్యాపారం మొదలుపెట్టింది. పలువురి నుంచి భారీ మొత్తాలు వసూలు చేసింది. తిరిగివ్వలేదు. కోవూర్‌నగర్‌కు చెందిన సరోజ రూ.19.50 లక్షలు, నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధికి చెందిన శాంతాదేవి రూ.15 లక్షలు, భువనసాయి రూ.3 లక్షలు, లక్ష్మి రూ.20 లక్షలు, కిషోర్ రూ.20 లక్షలు, పవన్‌కుమార్ నాయక్ రూ.9 లక్షలు, కృష్ణమ్మ రూ.15 లక్షలు, అనిత రూ.22 లక్షలు, రామ్మోహన్ రెడ్డి రూ.10 లక్షలు ఇచ్చి మోసపోయారు. వీరు జయలక్ష్మిపై నాల్గవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై సెక్షన్ 420, చిట్‌ఫండ్ యాక్ట్, ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్స్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆమెపై వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యాయి. అరెస్టు చేశారిలా.. జయలక్ష్మి, ఆమె భర్త శ్రీహరిబాబు అహోబిలంలో ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ప్రత్యేక పోలీసు బృందం మంగళవారం రాత్రి అక్కడికి వెళ్లి జయలక్ష్మిని అరెస్టు చేసి, అనంతపురంలోని దిశ పోలీసు స్టేషన్‌కు తరలించింది. స్టేషన్లో మహిళా పోలీసుల సమక్షంలో మూడు గంటల పాటు విచారించి.. స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. -
చిట్టీలుంటే.. రుణాలిస్తాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యక్తిగత అవసరం కావొచ్చు.. సంస్థ కోసం కావచ్చు.. ప్రతి నెలా చిట్టీలు వేయటం మనకు తెలిసిందే. అవసరానికి డబ్బులొస్తాయనో లేక పొదుపు చేస్తే వడ్డీ కలిసొస్తుందనో చిట్ఫండ్లలో సభ్యులుగా చేరతాం. మరి, నెలనెలా మీరు వేసే చిట్టీలే మీకు రుణాన్నిస్తే? చిట్టీ కాలం ముగిసే లోపు నెల వాయిదాతో పాటూ అసలూ తీరిపోతే? ఇదే వ్యాపారసూత్రంగా ఎంచుకుంది హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ క్రెడ్‌రైట్. దేశంలోని చిట్‌ఫండ్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని సభ్యులకు ఎలాంటి తనఖా లేకుండా రూ.35 లక్షల వరకూ రుణాన్నిస్తోంది. మరిన్ని వివరాలను క్రెడ్‌రైట్ కో–ఫౌండర్ నీరజ్ భన్సాల్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ చిట్‌ఫండ్స్ జనరల్ సెక్రటరీ టీఎస్ శివరామకృష్ణన్‌తో కలిసి 2014లో రూ.1.5 కోట్ల పెట్టుబడితో క్రెడ్‌రైట్‌ను ప్రారంభించాం. అమెరికాలోని రొటేటింగ్ సేవింగ్స్ అండ్ క్రెడిట్ అసోసియేషన్ (రోస్కా) తరహాలోనే చిట్‌ఫండ్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ), కిరాణా షాపులు, ఇతరత్రా వ్యాపారస్తులకు డేటా ఆధారిత రుణాన్నివ్వటమే మా ప్రత్యేకత. చిట్ విలువలో 80% రుణం.. ప్రస్తుతం ఢిల్లీకి చెందిన బలుస్సెరీ, చెన్నైకి చెందిన మాయావరం, బెంగళూరుకు చెందిన ఇందిరానగర్, హైదరాబాద్‌కు చెందిన సప్తవందన చిట్‌ఫండ్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. వీటికి ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రోల్లో వందల బ్రాంచీలున్నాయి. లక్ష నుంచి రూ.35 లక్షల వరకు రుణాలిస్తాం. చిట్ విలువలో 80 శాతం వరకూ రుణం వస్తుంది. ప్రతి నెలా కేవలం వడ్డీ మాత్రమే ఉంటుంది. చిట్ పాడుకున్నపుడు అసలును కట్టాల్సి ఉంటుంది. ఏడాదికి 18% వడ్డీ ఉంటుంది. రూ.10 కోట్ల రుణాల మంజూరు.. పేరు, చిరునామా, చిట్‌ఫండ్ వివరాలు, ఇతరత్రా డాక్యుమెంట్ల పరిశీలన పూర్తయ్యాక.. 24 గంటల్లో రుణం మంజూరు చేస్తాం. ఇప్పటివరకు 150 మంది చిట్‌ఫండ్ దారులకు రూ.10 కోట్ల రుణా లిచ్చాం. రూ.10 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్నవాళ్లు 35% ఉంటారు. ఈ ఏడాది ముగిసేలోగా రూ.100 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యించాం. రుణగ్రహీత నుంచి రుణంలో 1–2% ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. 2 నెలల్లో కేరళ, ఏపీలకు విస్తరణ.. ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ నగరాల్లో సేవలందిస్తున్నాం. మా మొత్తం ఆదాయంలో తెలంగాణ వాటా 15 శాతం. కర్ణాటక, మహారాష్ట్రల వాటా 35 శాతం. రెండు నెలల్లో కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సేవలను ప్రారంభిస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో 5 చిట్‌ఫండ్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నాం. మార్గదర్శి, కపిల్ చిట్ఫండ్లతో చర్చిస్తున్నాం. ఈ ఏడాది ముగింపులోగా ఒప్పందం పూర్తవుతుంది. రూ.9 కోట్ల నిధుల సమీకరణ..: 2017–18లో రూ. కోటి ఆదాయాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది రూ.10 కోట్లకు చేరాన్నది లక్ష్యం. ‘‘ప్రస్తుతం కంపెనీలో ఏడుగురు ఉద్యోగులున్నారు. త్వరలోనే దీన్ని 30కి చేర్చనున్నాం. ఇటీవలే యువర్నెస్ట్, ఆసియాన్ వెంచర్‌ల్యాబ్స్ ద్వారా రూ.9 కోట్లు సమీకరించాం’’ అని నీరజ్ వివరించారు. -
చిట్టీల పేరుతో రూ.30 లక్షలకు కుచ్చుటోపీ
గుత్తి (గుంతకల్లు) : గుత్తి ఆర్ఎస్లో చిట్టీలు (చీటీలు) నిర్వహిస్తున్న ఓ మహిళ రూ.30లక్షలకు కుచ్చుటోపీ పెట్టి ఉడాయించింది. బాధితులు తెలిపిన మేరకు... ఆర్ఎస్లోని రవూఫ్ కాంపౌండ్ కాలనీలో తాహేరా అనే మహిళ నివాసముంటోంది. ఈమె పదేళ్లగా చిట్టీలు వేసేది. ఈ క్రమంలో దాదాపు 30 మంది మహిళలు ఆమె వద్ద రూ. 30 లక్షల దాకా చిట్టీలు వేశారు. నెల రోజుల క్రితం తాహేరా చిట్టీ డబ్బులు తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయింది. నెల రోజులుగా ఆమె ఆచూకీ కోసం బాధిత మహిళలు గాలించినా లభ్యం కాలేదు. దీంతో బాధితులు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. బాధిత మహిళలు పద్మావతి, శకుంతల, విజయలక్ష్మి, రంగమ్మ, నారాయణమ్మ, కృష్ణవేణి తదితరులు పోలీసుస్టేషన్‌కు తరలివెళ్లి ఎస్ఐ చాంద్‌బాషాకు చిట్టీల నిర్వాహకురాలు తాహేరాపై ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని ఎస్ఐ చాంద్‌బాషా, ఏఎస్ఐ ప్రభుదాస్‌లను వేడుకున్నారు. ఎస్ఐ, ఏఎస్ఐలు మాట్లాడుతూ చిట్టీలు కట్టాలంటే నిర్వాహకులకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ రెండూ ఉండాలన్నారు. రిజిస్ట్రేషన్ లేనివారితో చిట్టీలు కడితే కేసు నమోదు చేయడం కుదరదన్నారు. అయితే మానవత్వంతో ఫిర్యాదు స్వీకరిస్తున్నామని, డబ్బుతో ఉడాయించిన తాహేరా ఆచూకీ కనుక్కుంటామని చెప్పారు. -
చిట్టీల వ్యాపారీ పరార్?
ఆదోని: పట్టణానికి చెందిన చిట్టీల వ్యాపారీ పరార్ కావడంతో బాధితులు లబోదిబో మంటున్నారు. ఎంఐజీలో నివాసమున్న వ్యాపారీ ఇంటికి మూడు రోజులుగా తాళం వేలాడుతోంది. ముందు కుటుంబంతో ఊరెళ్లి ఉండొచ్చని భావించారు. అయితే ఫోన్లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో కొందరు బాధితులు గురువారం అతని ఇంటికెళ్లి కిటికీలోంచి లోపల చూడగా విలువైన సామగ్రి కనిపించక పోవడంతో ఇరుగు పొరుగువారిని విచారించారు. రాత్రికి రాత్రే ఊడాయించినట్లు తెలుసుకొని బోరుమంటున్నారు. అతని బ్యాంక్ ఖాతాలు కూడా కొందరు పరిశీలించగా డబ్బు నిల్వ లేకపోవడంతో మోసపోయామని తెలుసుకొని గొల్లుమంటున్నారు. పిల్లల పెళ్లిళ్లు, చదువులకు, ఇళ్లు, స్థలాలు కొనుగోలు కోసం చాలా మంది ప్రతి నెలా చిట్టీల రూపంలో పొదుపు చేసుకుంటున్నారు. వ్యాపారీ చాలా ఏళ్లుగా చిట్టీలు నడుపుతూ అందరిని నమ్మించాడు. మొదట చిన్ని చిన్న చిట్టీల వేసి ఆతర్వాత రూ. లక్షల చీటీలు వేయించాడు. మొత్తం డబ్బును చేత పట్టుకొని కుటుంబంతో సహ పారిపోవడంతో ఎన్నో ఆశలతో చిట్టీలు వేసుకున్న వారికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. బాధితుల్లో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
చీటి డబ్బు చెల్లించలేదని..
కోలారు(బెంగళూరు): బకాయి పడ్డ చీటి డబ్బు చెల్లించలేదని కొందరు వ్యక్తులు అమానుషంగా వ్యవహరించారు. ఓ కుటుంబాన్ని నెల రోజులపాటు గృహ నిర్బంధం చేసి హింసించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి బాధితులకు విముక్తి కల్పించి నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. వివరాలు.. నగరంలోని రహమత్ నగర్‌కు చెందిన సయ్యద్ అన్వర్ చీటీలు నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఇష్రత్, ఆమె కుమారుడు తబ్రేజ్‌కు రూ.3లక్షలు బకాయి పడ్డాడు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు నిత్యం గొడవకు దిగేవారు. దీంతో సయ్యద్ అన్వర్ అదృశ్యమయ్యాడు. ఈనేపథ్యంలో ఇష్రత్, ఆమె కుమారుడు తబ్రేజ్‌లు నెల రోజులక్రితం సయ్యద్ అన్వర్ భార్య వహీదా బేగం, ఆమె కుమారుడిని ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించి హింసించినట్లు సమాచారం. దీంతో వహీదా బేగం అస్వస్తతకు గురైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో శనివారం గల్‌పేట పోలీసులు డీఎస్పీ అబ్దుల్ సత్తార్‌తో నేతృత్వంలో ఆ ఇంటిపై దాడులు నిర్వహించారు. నిర్బంధంలో ఉన్న వహీదాభేగం, ఆమె కుమారుడిని విడిపించారు. వహీదా బేగంను జిల్లా ఆస్పత్రికి తరలించి ఇష్రత్, తబ్రేజ్‌ను అరెస్టు చేశారు. -
చిట్టీ డబ్బులు కట్టడం లేదంటూ..
మహిళను అపహరించిన నిర్వాహకులు నిర్బంధించి.. వేధింపులకు గురిచేసిన వైనం పోలీసులు, మీడియా సాయంతో బయటపడిన మహిళ కొత్తగూడెం(ఖమ్మం): చిట్టీ డబ్బుల కోసం ఓ వివాహితను అపహరించి.. మానసిక, శారీరక వేధింపులకు గురిచేయగా.. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు, మీడియా సహకారంతో విముక్తి లభించింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఎస్కే.అక్బర్ అనే ఆటో డ్రైవర్.. భార్య రజియా, పిల్లలతో కలిసి 2013లో కొత్తగూడెం మండలం రామాంజనేయ కాలనీలో నివాసం ఉండేవాడు. కాగా.. ఆ సమయంలో ఆటో కొనుగోలు కోసం అక్బర్.. హుస్సేన్‌బీ వద్ద రూ.లక్ష విలువచేసే చిట్టీ వేశాడు. అవసరాల నిమిత్తం పాటపాడి ఎత్తుకున్నాడు. అనంతరం ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో అక్బర్ కుటుంబంతో సహా ఖమ్మం వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నాడు. అయితే చిట్టీ డబ్బులు ప్రతి నెలా చెల్లిస్తామని చెప్పినా వినిపించుకోకుండా వారిపై చిట్టీ నిర్వాహకురాలు హుస్సేన్‌బీ, పెద్ద హుస్సేన్‌బీ, చిన్న హుస్సేన్‌బీ, యాకూబీ, ఎస్డీ.నుజ్జు తదితరులు ఖమ్మం వెళ్లి చిట్టీ డబ్బుల నిమిత్తం తరచూ అక్బర్, భార్య రజియాతో ఘర్షణ పడుతుండేవారు. ఈనెల 6న అక్బర్ ఆటో నడిపేందుకు బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి భార్య కనిపించలేదు. ఆరా తీయగా.. హుస్సేన్‌బీతోపాటు పలువురు ఖమ్మం వచ్చి రజియాను అపహరించి కొత్తగూడెం తీసుకొచ్చారని.. గృహ నిర్బంధం చేశారని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి హుస్సేన్‌బీతోపాటు మిగతా వారంతా కలిసి రజియాను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ భర్త స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వివరాలు తెలుసుకుని హుస్సేన్‌బీ ఇంటికి వెళ్లగా.. రజియాను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం పోలీసుల సాయంతో రజియా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వివరాలు వెల్లడించింది. హుస్సేన్‌బీ, ఆమె కూతుళ్లతోపాటు నరసమ్మ, జగదీష్, మధు తనను వేధించారని పేర్కొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిట్టీల పేరుతో రూ.10 కోట్లకు టోపీ!
నేరేడ్మెట్ (హైదరాబాద్) : చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారం పేరుతో నగరంలోని నేరేడ్మెట్ డిఫెన్స్ కాలనీకి చెందిన ఓ మహిళ రూ.10కోట్ల మేర మోసం చేసి ఉడాయించింది. దీనికి సంబంధించి సుమారు 50 మంది బాధితులు ఆదివారం నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అరుణారెడ్డి అనే మహిళ, ఆమె భర్త రఘునాథరెడ్డి డిఫెన్స్ కాలనీలో ఉంటూ చిట్టీలు, వడ్డీ వ్యాపారం నిర్వహించేవారు. చిట్టీ పాడుకున్న వారికి నగదు ఇవ్వకుండా 3 రూపాయల వడ్డీ ఆశ చూపి వారి దగ్గరే ఉంచుకునేవారు. ఇలా సుమారు 100 మందికి రూ.10కోట్ల మేర వారు బకాయిపడ్డారు. వారికి నగదు చెల్లింపులు చేయకుండా గత సోమవారం అరుణారెడ్డి, ఆమె భర్త, కుమార్తె ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. బాధితులు వారితో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఫోన్‌నంబర్లు పనిచేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. -
చిట్టీల పేరుతో రూ.2 కోట్ల మోసం
చెరుకుపల్లి : గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండల కేంద్రంలో చిట్టీల పేరుతో ఓ వ్యక్తి సుమారు రూ.2 కోట్ల మేర స్థానికులకు టోపీ పెట్టాడు. దీనిపై సుమారు 80 మంది వరకు బాధితులు గురువారం సాయంత్రం చెరుకుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎం.రామదాసు అనే వ్యక్తి దగ్గర తాము చిట్టీలు వేశామని, కాగా గత రెండు నెలలుగా పాటలు పాడుకున్న వారికి డబ్బులు చెల్లించకుండా పరారీలో ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిట్టీల పేరుతో రూ.60 లక్షలు టోకరా
చాగల్లు (తూర్పుగోదావరి): ఒక మహిళ చిట్టీల పేరుతో జనాన్ని నమ్మించి సుమారు రూ.60 లక్షలకు టోకరా వేసింది. ఈ సంఘటన పశ్చిమ గొదావరి జిల్లా చాగల్లులో సోమవారం వెలుగుచూసింది. దీంతో సోమ్ములు పోయిన బాదితులు ఆ మహిళ ఇంటి వద్దకు చేరి ఆందోళన చేశారు.ఈ ఘటనకు సంబంధించి బాదితులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వడ్లమూడి పార్వతి సుమారు 15 ఏళ్ల నుంచి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. సుమారు 60 మందికి పైగా ఆమె వలలో మోసపోయిన బాధితులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం నుంచి పార్వతి ఇంటికి తాళాలు వేసి ఉండటంతో బాధితులు ఆమె కోసం బంధువుల ఇళ్ల వద్దకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. పార్వతి కుటుంబ సభ్యులు తమకు సంబంధం లేదని చెబుతున్నారని బాధితులు పేర్కొన్నారు. -
చిట్టీల పేరుతో చీటింగ్
బంజారాహిల్స్ (హైదరాబాద్) : చిట్స్ పేరుతో అమాయక ప్రజలను నిలువునా ముంచి తప్పించుకు తిరుగుతున్న వ్యాపారిపై జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ సమీపంలోని యాదగిరినగర్‌లో నివాసముండే నరసింహ గత 15 ఏళ్లుగా చిట్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. సుమారు100 మంది వరకూ ఆయన వద్ద చిట్స్‌లో సభ్యులుగా చేరారు. అయితే గడిచిన ఐదు నెలల నుంచి చందాదారులకు డిపాజిట్లు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. తమకు రూ. 15 లక్షల మేర బాకీ ఉన్నాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడిపై పోలీసులు ఐపీసీ 420, 406, చిట్‌ఫండ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక పోలీస్ బృందంతో గాలింపు చేపట్టారు. -
తల్లీకూతుళ్లు కలిసి రూ.3కోట్లకు టోకరా!
విశాఖపట్నం: చీటీల పేరుతో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బాధితులు కూడా పెరిగిపోతున్నారు. ఓ పక్కన చీటీల పేరుతో కోట్ల రూపాయలకు కుచ్చు టోపీ పెడుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రజలు మాత్రం మళ్లీ మళ్లీ అదే విధంగా మోసపోతూనే ఉన్నారు. విశాఖలోని అంగడిదిబ్బలో ఈ సారి తల్లీకూతుళ్లు కలిసి ప్రజలకు టోకరావేశారు. ఈ తల్లీ కూతుళ్లు చీటీల పేరుతో ప్రజల వద్ద నుంచి దాదాపు మూడు కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ మొత్తం సర్ధుకొని ఉడాయించారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు బాధితులు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ తల్లీకూతుళ్ల కోసం ఆరా తీస్తున్నారు.