కోలారు(బెంగళూరు): బకాయి పడ్డ చీటి డబ్బు చెల్లించలేదని కొందరు వ్యక్తులు అమానుషంగా వ్యవహరించారు. ఓ కుటుంబాన్ని నెల రోజులపాటు గృహ నిర్బంధం చేసి హింసించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి బాధితులకు విముక్తి కల్పించి నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
వివరాలు.. నగరంలోని రహమత్ నగర్‌కు చెందిన సయ్యద్ అన్వర్ చీటీలు నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఇష్రత్, ఆమె కుమారుడు తబ్రేజ్‌కు రూ.3లక్షలు బకాయి పడ్డాడు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు నిత్యం గొడవకు దిగేవారు. దీంతో సయ్యద్ అన్వర్ అదృశ్యమయ్యాడు.
ఈనేపథ్యంలో ఇష్రత్, ఆమె కుమారుడు తబ్రేజ్‌లు నెల రోజులక్రితం సయ్యద్ అన్వర్ భార్య వహీదా బేగం, ఆమె కుమారుడిని ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించి హింసించినట్లు సమాచారం. దీంతో వహీదా బేగం అస్వస్తతకు గురైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో శనివారం గల్‌పేట పోలీసులు డీఎస్పీ అబ్దుల్ సత్తార్‌తో నేతృత్వంలో ఆ ఇంటిపై దాడులు నిర్వహించారు. నిర్బంధంలో ఉన్న వహీదాభేగం, ఆమె కుమారుడిని విడిపించారు. వహీదా బేగంను జిల్లా ఆస్పత్రికి తరలించి ఇష్రత్, తబ్రేజ్‌ను అరెస్టు చేశారు.
చీటి డబ్బు చెల్లించలేదని..
Published Sun, Aug 14 2016 6:13 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM
Advertisement