సాక్షి, విజయవాడ: నగరంలోని భానునగరంలో చిట్టీల పేరుతో టీడీపీ నేత ఘరానా మోసానికి పాల్పడ్డాడు. చిట్టీల పేరుతో టీడీపీ నేత పతివాడ అప్పలనాయుడు జనాన్ని నిండా ముంచారు. సుమారు 300 మంది నుంచి రూ.6 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. బాధితులు గుణదల పోలీసులను ఆశ్రయించారు. న్యాయం చేయాలంటూ అప్పలనాయుడి ఇంటి వద్ద బాధితుల ధర్నా చేపట్టారు.
‘సాక్షి’తో బాధితులు మాట్లాడుతూ, చిటీల పేరుతో నమ్మించి మోసం చేశాడని, రోజువారీ కూలీకి వెళ్తూ చీటీ కట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.5 లక్షలు, రూ.10లక్షలు చిటీలు కట్టిన వాళ్లం వందల్లో ఉన్నాం. చిటీ పూర్తయిన తర్వాత కూడా ఇవ్వకుండా తన వద్దే ఉంచుకుని వడ్డీ ఇస్తానని మోసం చేశాడు. ఏడాదిగా డబ్బు ఇవ్వకుండా మోసం చేశాడు. ఐపీ పెట్టినట్టు నోటీసులు వచ్చాయి. మాకు న్యాయం చేయాలి’’ అని బాధితులు కోరుతున్నారు.
చదవండి: మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య దారుణ హత్య
కాగా, పతివాడ అప్పలనాయుడు.. గత పదేళ్లుగా చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తుండటంతో పాటు అధిక వడ్డీలు ఇవ్వటంతో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు అప్పలనాయుడు వద్ద వారు దాచుకున్న నగదును వడ్డీలకు ఇచ్చుకునేవారు. ఈ క్రమంలో అప్పల నాయుడు అందినంత వరకు వసూలు చేసుకుని గత పదిరోజులుగా అదృశ్యమయ్యాడు. తాజాగా సోమ, మంగళవారాల్లో అప్పలనాయుడు కొంతమందికి ఐపీ నోటీసులు పంపించటంతో బాధితులు తమకు జరిగిన మోసాన్ని గ్రహించి లబోదిబోమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment