చిట్టీల పేరుతో చీటింగ్ | Man cheats Public of Rs 15Lakhs | Sakshi

చిట్టీల పేరుతో చీటింగ్

Jul 6 2015 8:03 PM | Updated on Oct 9 2018 5:39 PM

చిట్స్ పేరుతో అమాయక ప్రజలను నిలువునా ముంచి తప్పించుకు తిరుగుతున్న వ్యాపారిపై జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం చీటింగ్ కేసు నమోదు చేశారు.

బంజారాహిల్స్ (హైదరాబాద్) : చిట్స్ పేరుతో అమాయక ప్రజలను నిలువునా ముంచి తప్పించుకు తిరుగుతున్న వ్యాపారిపై జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ సమీపంలోని యాదగిరినగర్‌లో నివాసముండే నరసింహ గత 15 ఏళ్లుగా చిట్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. సుమారు100 మంది వరకూ ఆయన వద్ద చిట్స్‌లో సభ్యులుగా చేరారు.

అయితే గడిచిన ఐదు నెలల నుంచి చందాదారులకు డిపాజిట్లు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. తమకు రూ. 15 లక్షల మేర బాకీ ఉన్నాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడిపై పోలీసులు ఐపీసీ 420, 406, చిట్‌ఫండ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక పోలీస్ బృందంతో గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement