సాక్షి, జవహర్‌నగర్: ‘మ్యాట్రిమనిలో నీ ప్రొఫైల్ చూశాను.. నువ్వు నాకు నచ్చావు పెళ్లి చేసుకుందామా.. నేను ఐపీఎస్ అధికారినని.. హోంమంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నాను’అంటూ పెళ్లి చూపులకు సంబంధించిన వివరాలు పోస్ట్ చేసిన మహిళతో పరిచయం చేసుకున్నాడు. సదరు యువతికి అనుమానం రావడంతో అసలు విషయం బయట పడింది. సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ తన కూతురికి పెళ్లి సంబంధాలు చూడాలని తెలుగు మ్యాట్రిమోనీలో తన కూతరుకు సంబంధించిన వివరాలు పొందుపరచింది.
చదవండి: 24 ఏళ్లుగా అన్న కోసం గాలింపు.. చివరికి అతడి చేతిలోనే
ఆమె వివరాలను చూసిన పుప్పాల హరిప్రసాద్ (29) స్పందించి తాను ఐపీఎస్ అధికారినంటూ మహిళతో పరిచయం చేసుకున్నాడు. కొన్ని రోజులు వీరి మధ్య మాటలు కొనసాగాయి. ఈ క్రమంలో సదరు యువతికి హరిప్రసాద్‌పై అనుమానం రావడంతో నిలదీసింది. దీంతో అతడు గత నెల 27న మహిళకు ఫోన్ చేసి బెదిరించాడు. ఈ మేరకు బాధితురాలు జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడు హరిప్రసాద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. పత్తి చేనులోకి తీసుకెళ్లి
Comments
Please login to add a commentAdd a comment