బంజారాహిల్స్: దాచి ఉంచుతారనే నమ్మకంతో ఇచ్చిన డబ్బుతో పరారైన దంపతులను బంజారాహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. ఇందుకోసం మంగళవారం న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ వేయాలని తలపెట్టారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్-2 గ్రీన్‌బావర్చి హోటల్ సమీపంలో ఓఅపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మహ్మద్ ఇలియాస్ అనే వ్యాపారి రూ.45 లక్షలు నగదు ఉన్న బ్యాగును పక్క ప్లాట్‌లో ఉంటున్న ఎం. వంశీకృష్ణ, ప్రవీణ దంపతులకు ఇచ్చాడు. అయితే ఈ సొమ్ములో రూ.17.50 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా సొమ్ముతో ప్రవీణతోపాటు ఆమె సోదరుడు రమేష్ బాబ్జీ ఎటో వెళ్లిపోయారు.
పోలీసులు వంశీకృష్ణను, ప్రవీణను అరెస్టు చేసి విచారించినా ఎత్తుకెళ్లిన డబ్బులో రూ.2లక్షలు మాత్రమే రికవరీ అయ్యాయి. మిగతా సొమ్ము ఎక్కడ దాచారో, రమేష్ ఎక్కడ ఉన్నాడో అన్న వివరాలు తెలుసుకునేందుకు ఇద్దరినీ కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. రెండు రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.
దాచమని ఇస్తే..డబ్బుతో ఉడాయించారు..
Published Mon, May 9 2016 6:11 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM
Advertisement
Advertisement