చాగల్లు (తూర్పుగోదావరి): ఒక మహిళ చిట్టీల పేరుతో జనాన్ని నమ్మించి సుమారు రూ.60 లక్షలకు టోకరా వేసింది. ఈ సంఘటన పశ్చిమ గొదావరి జిల్లా చాగల్లులో సోమవారం వెలుగుచూసింది. దీంతో సోమ్ములు పోయిన బాదితులు ఆ మహిళ ఇంటి వద్దకు చేరి ఆందోళన చేశారు.ఈ ఘటనకు సంబంధించి బాదితులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వడ్లమూడి పార్వతి సుమారు 15 ఏళ్ల నుంచి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది.
సుమారు 60 మందికి పైగా ఆమె వలలో మోసపోయిన బాధితులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం నుంచి పార్వతి ఇంటికి తాళాలు వేసి ఉండటంతో బాధితులు ఆమె కోసం బంధువుల ఇళ్ల వద్దకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. పార్వతి కుటుంబ సభ్యులు తమకు సంబంధం లేదని చెబుతున్నారని బాధితులు పేర్కొన్నారు.
చిట్టీల పేరుతో రూ.60 లక్షలు టోకరా
Published Mon, Aug 31 2015 9:33 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM
Advertisement