బెస్ట్‌ గిఫ్ట్‌ | Malavika Mohanan First look Release from Thangalaan Movie | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ గిఫ్ట్‌

Published Sat, Aug 5 2023 4:30 AM | Last Updated on Sat, Aug 5 2023 4:30 AM

Malavika Mohanan First look Release from Thangalaan Movie - Sakshi

‘తంగలాన్‌’ సినిమా కోసం పూర్తిగా మేకోవర్‌ అయ్యారు హీరోయిన్‌ మాళవికా మోహనన్‌. విక్రమ్‌ హీరోగా పా. రంజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ ఫిల్మ్‌ ‘తంగలాన్‌’. ఈ చిత్రంలో పార్వతి, మాళవికా మోహనన్‌ హీరోయిన్లు. కేజీ జ్ఞానవేల్‌ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శుక్రవారం (ఆగస్టు 4) మాళవికా మోహనన్‌ బర్త్‌ డే.

ఈ సందర్భంగా ‘తంగలాన్‌’లోని ఆమె ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ‘బెస్ట్‌ బర్త్‌ డే గిఫ్ట్‌’ అని ఈ పోస్టర్‌ని ఉద్దేశించి మాళవిక ట్వీట్‌ చేశారు. ఈ చిత్రంలో గిరిజన యువతిగా ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో 19వ శతాబ్దంలో బ్రిటిష్‌ పాలన కొనసాగుతున్నప్పుడు కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ వద్ద ఆక్రమణలకు ఎదురు నిలిచిన ఓ గిరిజన తెగ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement