
పిల్లలు పెద్దవాళ్లను ఆదర్శంగా తీసుకుని వాళ్లలా ఉన్నతోద్యోగం సంపాదించాలనుకుంటారు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్‌ల పిల్లలు వాళ్లాలాగే సేమ్ ప్రోఫెషిన్‌ని ఎంచుకోవడం అత్యంత అరుదు. కానీ ఇక్కడొక కూతురు తన తల్లి చేసే వృత్తిని ఎంచుకోవడమే ఇద్దరు ఒకేచోట తమ వృత్తిని కొనసాగించడం కూడా అరుదే.
వివరాల్లోకెళ్తే...ఇక్కడొక కూతురు తన తల్లిలా పైలెట్ అయ్యింది. పైగా తల్లికూతుళ్లు ఇద్దరు కో పైలెట్లుగా విమానాన్ని నడిపారు. ఇలా జరగడం అత్యంత అరుదు. ఈ మేరకు సౌత్‌వెస్ట ఎయిర్‌లైన్స్ తన ఇన్‌స్టాగ్రాం పేజీలో ఈ వీడియోని పోస్ట్ చేస్తూ తొలిసారిగా తల్లి కూతుళ్ల ద్వయం పైలెట్లుగా విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించారని పేర్కొంది.
అంతేకాదు నీవు నీ సొంత కాళ్లపై నిలబడటమే కాకుండా తల్లితో కలిసి విమానాన్ని ప్రయాణాన్ని పూర్తి చేసినందుకు అబినందనలు అని సదరు మహిళకి తెలిపింది. ఈ మేరకు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.
(చదవండి: నడిరోడ్డు పై అనూహ్య ఘటన....ఒక్కసారిగా ఆగిపోయిన వాహనాలు: వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment