నదిలో దూకి తల్లి, కూతురు ఆత్మహత్య | Mother and Daughter suicide at pen ganga river | Sakshi
Sakshi News home page

నదిలో దూకి తల్లి, కూతురు ఆత్మహత్య

Published Sun, Aug 27 2017 7:56 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

Mother and Daughter suicide at pen ganga river

ఆదిలాబాద్ : పెన్ గంగ‌ నదిలో దూకి కుమార్తెతో పాటు తల్లి ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్ల కూతురు స‌హా త‌ల్లి ఆత్మహత్య చేసుకున్న ఘ‌ట‌న జిల్లాలో జరిగింది. మృతులు ఆదిలాబాద్ ప‌ట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. మృతుల పేర్లు, వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఓ తల్లి తన కూతురితో పాటు నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదం ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. ఓ వివాహిత తన రెండేళ్ల కూతురిని వెంట పెట్టుకుని పెన్ గంగ నది వద్దకు వెళ్లింది. కుమార్తెతో పాటు తాను నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీరు ఆదిలాబాద్ పట్టణానికి చెందినవారుగా గుర్తించారు. అయితే మృతుల పేర్లు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement