Pen Ganga River
-
బ్రిడ్జిని ఆనుకుని ప్రవహిస్తున్న పెన్‌గంగ.. 20కిమీ మేర ట్రాఫిక్ జామ్
సాక్షి, ఆదిలాబాద్: తెలంగాణలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వరదల కారణంగా నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి ఉప నదులు ప్రాణహిత, పెన్‌గంగ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా పరిధిలో పెన్‌గంగ మహోగ్రరూపం దాల్చింది. దీంతో, పలు గ్రామాలు నీట మునిగాయి. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వివరాల ప్రకారం.. జిల్లాలోని డోలాలా వద్ద గోదావరి ఉప నది పెన్‌గంగ ఉప్పొంగి ప్రవహిస్తోంది. పెన్ గంగ వరద నీరు 50 అడుగులు ఎత్తున ఉన్న వంతెనను తాకాయి. దీంతో 44వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో, అప్రమత్తమైన అధికారులు బ్రిడ్జిపైకి రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో దాదాపు 20కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పెన్‌గంగ ఉధృతికి భీంపూర్, జైనథ్, బేల మండలాల్లోని 10 జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 20 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఈ సందర్బంగా నేషనల్ హైవే అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పెన్‌గంగా ప్రవాహం పెరిగింది. ఎగువన ప్రాజెక్ట్‌ల గేట్లు మూసివేస్తేనే వరద ప్రవాహం తగ్గుతుందన్నారు. నేటి మధ్యాహ్నం వరకు నీటి ప్రవాహం కొంత మేరకు తగ్గే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేశారు. ఆ తర్వాతే బ్రిడ్జిపై నుంచి వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇది కూడా చదవండి: ఇంట్లోనే ఉండండి.. అత్యవసరమైతేనే బయటకు రండి -
విషాదం: లిఫ్ట్ వైర్ తెగి ఇద్దరి కార్మికుల మృతి
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని జైనథ్ మండలం చనాక కొరాట బ్యారేజ్ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. పెన్ గంగా నదిపై నిర్మిస్తున్న బ్యారేజ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో భాగంగా బ్యారేజ్ గేట్లు బిగిస్తుండగా లిఫ్ట్ వైర్ తెగిపడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ బ్యారేజీకి సంబంధించి ఇంకా మూడు గేట్లు బిగించాల్సి ఉండగా ఇప్పటికే పనులు నత్తనడకన సాగుతూ ఉన్నారు. బుధవారం 16వ నంబర్ గేట్ బిగిస్తుండగా ప్రమాదవశాత్తు లిఫ్ట్‌వైర్ తెగింది. దీంతో 200 అడుగుల ఎత్తులో నుంచి వారు ఒక్కసారిగా కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు కూలీలను చికిత్స నిమిత్తం తరలించారు. అయితే సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానిక కూలీలు పేర్కొంటున్నారు. -
నదిలో దూకి తల్లి, కూతురు ఆత్మహత్య
ఆదిలాబాద్ : పెన్ గంగ నదిలో దూకి కుమార్తెతో పాటు తల్లి ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్ల కూతురు సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో జరిగింది. మృతులు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల పేర్లు, వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఓ తల్లి తన కూతురితో పాటు నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదం ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. ఓ వివాహిత తన రెండేళ్ల కూతురిని వెంట పెట్టుకుని పెన్ గంగ నది వద్దకు వెళ్లింది. కుమార్తెతో పాటు తాను నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీరు ఆదిలాబాద్ పట్టణానికి చెందినవారుగా గుర్తించారు. అయితే మృతుల పేర్లు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.