
భాగ్యశ్రీ, ప్రిష (ఫైల్)
చాంద్రాయణగుట్ట: భర్తతో గొడవపడి ఓ మహిళ కుమార్తెతో సహా అదృశ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హనుమాన్‌నగర్ ప్రాంతంలో భాగ్యశ్రీ(26), అశ్విన్ కుమార్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇంటి మరమ్మతుల విషయంలో ఈ నెల 4న ఇద్దరి నడుమ గొడవ జరగడంతో మనస్తాపానికిలోనైన భాగ్యశ్రీ అదే రోజు సాయంత్రం ఇంట్లో ఎవరికి చెప్పకుండా తన కుమార్తె ప్రిష(1)తో కలిసి బయటికి వెళ్లిపోయింది. రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ప్రయోజనం కనిపించలేదు. భార్యశ్రీ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.