
మేఘన (ఫైల్)
చిలకలగూడ: నవవధువు అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ వరుణ్‌కాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆలుగడ్డబావికి చెందిన మేఘన (19)కు మల్కాజిగిరికి చెందిన ఓ వ్యక్తితో గత నెల 30న వివాహమైంది. మేఘన తల్లితండ్రుల మ్యారేజీ యానివర్సరీ సందర్భంగా ఈ నెల 15న నూతన దంపతులు ఆలుగడ్డ బావికి వచ్చారు. శివరాత్రి తర్వాత వస్తానని చెప్పడంతో భార్యను తల్లిగారి ఇంట్లోనే వదిలివెళ్లాడు. ఈ క్రమంలో ఈ నెల 22న ఆలుగడ్డ బావి బస్టాప్‌లో తల్లి అరుణ కుమార్తె మేఘనను అత్తవారింటికి మల్కాజిగిరి వెళ్లే బస్సు ఎక్కించింది. ఇంతవరకు మేఘన అత్తవారింటికి చేరలేదు, కన్నవారింటికీ రాలేదు. సన్నిహితులు, బంధుమిత్రులను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వరుణ్‌కాంత్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment