
ఐశ్వర్య(ఫైల్)
కాచిగూడ: నవ వధువు అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. నింబోలిఅడ్డా ఖాంగార్‌నగర్ ఎంసీహెచ్ క్వార్టర్స్‌కు చెందిన సత్యనారాయణ భార్య ఐశ్వర్య(20) ఈనెల 25వ తేదీన ఇంట్లో నుంచి కిరాణం షాపుకు వెళ్తునానని చెప్పి వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వివిధ ప్రాంతాల్లో, బంధు మిత్రుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె భర్త సత్యనారాయణ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యనారాయణ, ఐశ్వర్యల వివాహం ఈనెల 20వ తేదీన జరిగింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment