S I Candidates
-
పోలీసు ఎంపికల్లో తల్లీ కూతుళ్ల తడాఖా
నేలకొండపల్లి : పోలీసు ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న దేహ దారుఢ్య పరీక్షల్లో తల్లీకుమార్తెలిద్దరూ సత్తా చాటి ఎస్ఐ మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారానికి చెందిన తోళ్ల వెంకన్న భార్య నాగమణి, కుమార్తె త్రిలోకిని ఖమ్మంలో జరుగుతున్న పోలీసు ఈవెంట్స్‌కు బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా పరుగు పందెం, ఎత్తు కొలత, లాంగ్ జంప్, షాట్‌పుట్ ఇలా అన్ని ఈవెంట్లలో విజయం సాధించి తుది పరీక్షకు అర్హత సాధించారు. తోళ్ల వెంకన్న కుటుంబం చెన్నారం నుంచి జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితమే ఖమ్మం జిల్లా కేంద్రానికి వెళ్లింది. తొలుత నాగమణి అంగన్వాడీ టీచర్‌గా ఖమ్మం బురహాన్‌పురంలో కొంతకాలం పనిచేశాక.. పదేళ్ల క్రితం జిల్లా కేంద్రంలో హోంగార్డుగా విధులు నిర్వర్తించారు. రెండేళ్ల క్రితం కానిస్టేబుల్‌గా ఎంపికైన ఆమె ప్రస్తుతం ములుగు జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నారు. ఎస్ఐ కావాలన్న లక్ష్యంతో సాధన చేస్తుండగా, డిగ్రీ పూర్తి చేసిన నాగమణి కుమార్తె త్రిలోకిని కూడా పరీక్షలకు సిద్ధమయ్యారు. ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించి దేహ దారుఢ్య పరీక్షలకు హాజరైన వీరిద్దరు.. ఇందులోనూ సత్తా చాటి మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఇదీ చదవండి: షికారుకెళ్లి నరకయాతన.. బండరాళ్ల మధ్య చిక్కుకున్న యువకుడు -
చిప్ సిస్టమ్ తొలగించాలి : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్ : పోలీస్ డిపార్ట్మెంట్ సెలక్షన్స్‌లో సెన్సార్ చిప్ సిస్టమ్‌ను తొలగించాలని ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గురువారమిక్కడ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో ఆందోళన నిర్వహించారు. రేడియో ఫ్రిక్వేన్సీ ఐడెంటిఫై(ఆర్ఎఫ్ఐ) సిస్టం ద్వారా ఈవెంట్స్ నిర్వహించడం వలన ఇబ్బందులు తలేత్తాయని వారు ఆరోపించారు. ఈవెంట్స్‌లో సెలక్ట్ కాని వారిని కూడా తుది పరీక్షకు అనుమతిచ్చారని తెలిపారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే క్రిమినల్ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని వాపోయారు. -
నేటినుంచి ఎస్ఐ అభ్యర్థులకు ఉచితశిక్షణ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించే పరీక్ష కు దరఖాస్తు చేసుకున్న గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గిరి జన సంక్షేమాధికారి సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో ఈనెల 15 నుంచి 30వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు, వివరాలకు స్థానిక గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం పోలీస్ కానిస్టేబుల్(మెయిన్స్) పరీక్ష కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం రెండువారాల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ అభ్యర్థులు ఈనెల 17వరకు బీఈడీ కళాశాల మైదానంలో ఉన్న బీసీస్టడీ సర్కిల్లో దరఖాస్తులు చేసుకోవాలని, దేహదారుఢ్య పరీక్షల్లో ఉతీర్ణులైన వారు మాత్రమే అర్హులని తెలిపారు.