ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు ప్రారంభం | physical tests started in police constable recrutitment | Sakshi
Sakshi News home page

ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు ప్రారంభం

Published Fri, Dec 2 2016 3:40 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు ప్రారంభం - Sakshi

ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు ప్రారంభం

కానిస్టేబుల్ అభ్యర్థులకు రెండో దశ పరీక్షలు
ఒరిజినల్ సర్టిఫికెట్లు లేనివారు 6వ తేదీలోపు తీసుకొచ్చి హాజరు కావొచ్చు
ఛాతి కొలతలో అనర్హత అరుుతే తిరిగి అప్పీలు చేసుకోవచ్చు
దళారుల మాటలు విని మోసపోవద్దు
పరీక్షలన్నీ పారదర్శకమే
ఎస్పీ త్రివిక్రమ వర్మ

 
ఒంగోలు క్రైం : పోలీసు కానిస్టేబుళ్లు, జైలు వార్డర్ల రెండో దశ పరీక్షల్లో భాగంగా స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో గురువారం ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు ప్రారంభించారు. పరీక్షలు ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ పర్యవేక్షణలో జరిగాయి. పరీక్షలు ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగుతాయి. మొదటి రోజు పరీక్షల్లో భాగంగా మొత్తం 840 మంది హాజరు కావాల్సి ఉంది. 644 మంది హాజరయ్యారు. ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షల్లో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు క లగకుండా అన్ని వసతులు కల్పించింది. క్యాంటిన్ సౌకర్యంతో పాటు మంచినీటి వసతి, వైద్యం కోసం పత్యేకంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చే సింది. ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షల ప్రారంభం సందర్భంగా ఎత్తు కొలతలు, ఛాతి కొలతల నమోదును ఎస్పీ దగ్గరుండి పర్యవేక్షించారు.

ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్పనిసరి
ఎస్పీ త్రివిక్రమవర్మ మాట్లాడుతూ అభ్యర్థులు కొంతమంది ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకుండా ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షకు హజరయ్యారని, తప్పకుండా ఒరిజనల్ సర్టిఫికెట్లు తీసుకొస్తేనే పరీక్షలకు అనుమతిస్తామన్నారు. అలాంటి వారికి కొంత వెసులుబాటు కల్పించామని, ఫిట్‌నెస్ పరీక్షల చివరి రోజు అంటే ఈ నెల 6వ తేదీ లోపు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని హాజరు కావచ్చన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒరిజనల్ సర్టిఫికెట్లు తీసుకురాకుంటే ఎలాంటి పరిస్థితుల్లో అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అన్ని పరీక్షలు సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్నామన్నారు. ఒక్క లాంగ్ జంప్ మాత్రం మాన్యువల్‌గా నమోదు చేస్తున్నామని చెప్పారు. అక్కడ కూడా అభ్యర్థులకు వచ్చిన పాయింట్లు వెంటనే ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేస్తామన్నారు.

ఎత్తు కొలత, ఛాతి కొలత కూడా ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారానే చూస్తున్నామని వివరించారు. పరుగు పందేలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సెన్సార్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. మానవ తప్పిదాలకు ఆస్కారం లేకుండా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. ఎత్తు కొలతల్లో అర్హత కోల్పోతే అలాంటి వారిని నచ్చజెప్పి పంపిస్తున్నామన్నారు. ఛాతి కొలతల్లో ఊపిరి పీల్చినప్పుడు తగ్గి అనర్హత పొందితే అలాంటి అభ్యర్థులు తిరిగి అప్పీలు చేసుకోవచ్చని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రెండో దశ పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రతిభే ఆధారం
దళారులు రంగంలోకి దిగి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎస్పీ త్రివిక్రమ వర్మ సమాధానం ఇస్తూ అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రతిభే ఆధారంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దళారులపై తనకు ఫిర్యాదు చేయాలన్నారు. ిఫిట్‌నెస్ పరీక్షలను ఇన్‌చార్జి అదనపు ఎస్పీ ఏ.దేవదానం, ఏఆర్ ఏఎస్పీ టి.శివారెడ్డిల పర్యవేక్షణలో జరుగుతున్నాయి.

మొదటి దశలో 189 మంది అర్హత...
రెండో దశ అభ్యర్థుల ఎంపిక ఫిట్‌నెస్ పరీక్షలో మొదటి రోజు 189 మంది అర్హత సాధించారు. ఫిజికల్ మెడికల్ టెస్ట్‌లో 157 మంది అనర్హత పొందారు. వారిలో ఎత్తు తక్కువ ఉన్న వారు, ఛాతి పీల్చినప్పుడు, సాధారణంగా ఉన్నప్పుడు నిబంధనల ప్రకారం కొలతలు చాలని వారు ఉన్నారు. 1,600 మీటర్ల పరుగు పందెంలో 21 మంది అనర్హత పొందారు. సర్వర్ సమస్యతో 277 మందికి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించలేదు. వారికి ఈ నెల 7వ తేదీన నిర్వహించాలని ఎస్పీ నిర్ణరుుంచారు.

 
ఫిజికల్ ఫిట్‌నెస్‌లో పది చోట్ల పరిశీలన

కానిస్టేబుళ్ల ఎంపిక కోసం రెండో దశ పరీక్షల్లో భాగంగా ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టుల నిర్వహణ కోసం వచ్చే అభ్యర్థులు పది చోట్లకు హాజరు కావాల్సి ఉంది. ఆ ప్రాంతాల్లో సర్టిఫికేట్ల పరిశీలన, ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పోలీసు సిబ్బందిని ఎక్కడికక్కడ నియమించారు. ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ సారథ్యంలో ఇద్దరు ఏఎస్పీలు, దాదాపు ఏడుగురికిపైగా డీఎస్పీల పర్యవేక్షణలో పరిశీలనలు జరుగుతున్నారుు.  

 మొదటి దశలో ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షకు వచ్చిన అభ్యర్థులను నగరంలోని కర్నూల్ రోడ్డు బైపాస్ ఫ్లరుు ఓవర్‌కు ఆనుకొని ఉన్న  జిల్లా పోలీసు కార్యాలయం ప్రధాన గేటు వద్ద రిసెప్షన్ ఏర్పాటు చేశారు.  

 అభ్యర్థులకు ముందుగా హాల్ టెక్కెట్లలో ఇచ్చిన సమయం ప్రకారం అందరినీ సరిచూసి ఆ సమయంలో ఎంతమంది ఉంటే అంత మందినీ లోపలికి పంపిస్తారు.  

లోనికి వెళ్లిన తర్వాత బ్యాచీలుగా విడగొట్టి పదుల సంఖ్యలో చేసి రెండో దశ పరిశీలనకు పంపుతారు

 రెండో దశలో మాన్‌డేటరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారు. అక్కడ సర్టిఫికేట్లన్నింటినీ పరిశీలించి హాల్‌టిక్కెట్ ఆధారంగా, ఒరిజనల్ సర్టిఫికెట్లు సరి చూస్తారు.

ఆ తర్వాత బయో మెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. హాల్ టిక్కెట్‌లోని బార్ కోడ్ ఆధారంగా వేలిముద్రలు సరి చూస్తారు. అంటే అభ్యర్తి కచ్చితంగా అతనేనని తేల్చేస్తారు. ఒకరి స్థానంలో మరొకరు రాకుండా ఇక్కడ ఫిల్టర్ చేస్తారు.

ఇక్కడి నుంచి  అంతా ఆన్‌లైన్‌లోనే...
4 అక్కడ నుంచి ఫిజికల్ మెజర్‌మెంట్ కౌంటర్‌కు చేరుకోవాలి. అక్కడ ఎస్పీ స్వయంగా కూర్చొని ఎత్తు, ఛాతి కొలతలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరీక్షిస్తారు.  
4 అక్కడి నుంచి 1,600 మీటర్ల (ఒక కిలో మీటర్) పరుగు పందేనికి సన్నద్ధం కావాలి. పరుగు పందెంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సెన్సార్ సిస్టంను అభ్యర్థులకు కేటారుుంచిన నంబరు వెనుక, ఛాతీకి ఆనుకునే విధంగా అమరుస్తారు. సమయం, స్పీడు అన్నీ ఆన్‌లైన్ ద్వారానే రికార్డు అవుతారుు.  
4 అనంతరం సర్టిఫికెట్ల స్కానింగ్, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు.  
4 ఆ తర్వాత 100 మీటర్ల పరుగు పందెం నిర్వహిస్తారు.
4 ఆ తర్వాత లాంగ్ జంప్ ఉంటుంది. ఇందుకోసం మూడు ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. ఇక్కడ దూకిన దూరాన్ని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)ల ద్వారా కొలతలు తీరుుంచి ఆన్‌లైన్‌లో వెంటనే అప్‌లోడ్ చేస్తారు.
4 ఇక్కడ డాటా ఎడిటింగ్ ఉంటుంది. ఆన్‌లైన్ ఏమైనా పొరపాట్లు దొర్లినా, అభ్యర్థుల పేర్లు, మరేమైనా జరిగితే వెంటనే సరిచేస్తారు. సవరణలు చేపడతారు.
4 అన్ని పరీక్షల్లో వచ్చిన పారుుంట్లు, మార్కులు సరి చూసి రిజల్ట్ ఇక్కడ ఫైనల్ చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement