Trivikrama Verma
-
కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు అరెస్టు
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసును పోలీసులు ఛేదించారు. ఇందులో దళారులుగా వ్యవహరించిన ఆరుగురిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అసలు సూత్రధారితో పాటు సర్జరీ చేసిన ఇద్దరు వైద్యుల కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నట్లు విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. విశాఖ పోలీస్ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. 2019లో మహారాణిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో కిడ్నీ రాకెట్ నడిపి ఏ4గా అరెస్టై.. 40 రోజుల పాటు విశాఖ జైలులో ఉన్న నార్ల వెంకటేష్ తాజా వ్యవహారంలోనూ అసలు సూత్రధారి అని వివరించారు. ఇతడే మొత్తం రాకెట్‌ను నడిపించాడని పేర్కొన్నారు. డబ్బు ఆశ చూపి.. మధురవాడ వాంబే కాలనీకి చెందిన జి.వినయ్ కుమార్ ఒక సప్లయిస్ షాప్‌లో వెహికల్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ శ్రీను అనే వ్యక్తికి ప్రమాదం జరిగితే వినయ్ కుమార్ పరామర్శించడానికి వెళ్లాడు. అక్కడ అతడికి కామరాజు, ఎలీనా అనే వ్యక్తులను శ్రీను, అతడి భార్య కొండమ్మ పరిచయం చేశారు. మాటల సందర్భంలో కిడ్నీ ఇస్తే రూ.8.5 లక్షలు ఇస్తామని వారు వినయ్‌కుమార్‌కు చెప్పారు. డబ్బుకు ఆశపడి వినయ్‌కుమార్ కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించాడు. దీంతో అతడిని ఒక ల్యాబ్‌కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఈ విషయం వినయ్‌కుమార్ తల్లిదండ్రులకు తెలియడంతో వారు వారించడంతో అతడు భయపడి హైదరాబాద్‌లో ఉంటున్న తన మేనత్త ఇంటికి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో కామరాజు ఫోన్ చేసి కిడ్నీ ఇవ్వకపోతే వైద్య పరీక్షలకు అయిన ఖర్చు రూ.50 వేలు ఇవ్వాలని, లేనిపక్షంలో ఇంట్లో సామానులు బయట పడేస్తానని వినయ్ కుమార్‌ను బెదిరించాడు. దీంతో అతడు కిడ్నీ ఇవ్వడానికి అంగీకరించాడు. హైదరాబాద్ నుంచి వినయ్ విశాఖ రాగానే పెందుర్తిలో ఉన్న తిరుమల ఆస్పత్రికి తీసుకువెళ్లి అతడి కిడ్నీ తొలగించారు. అనంతరం ఒప్పందం ప్రకారం రూ.8.5 లక్షలు ఇవ్వకపోగా.. రూ.5 లక్షలు ఇస్తున్నట్లు వీడియో రికార్డింగ్ చేసి అందులో రూ.2.5 లక్షలు నిందితులు తీసుకున్నారు. మూడు నెలలుగా వారి మధ్య డబ్బుల కోసం వివాదం నడిచింది. కామరాజు గ్యాంగ్ డబ్బులు ఇవ్వకపోవడంతో వినయ్‌కుమార్ పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చక్రం తిప్పిన వెంకటేష్ 2019లో కిడ్నీ రాకెట్ వ్యవహారం నడిపిన నార్ల వెంకటేష్‌ది కడప. ఈ వ్యవహారంలో అతడు అప్పట్లో జైలు పాలయ్యాడు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యాక కూడా ఇదే దందా నడుపుతున్నాడు. వెంకటేష్‌కు ఎలీనా, కామరాజు గ్యాంగ్‌తో పరిచయం ఉండడంతో వారి ద్వారా వినయ్‌కుమార్‌కు డబ్బు ఎరవేశాడు. అతడి కిడ్నీ తొలగించేందుకు ఆస్పత్రిని గుర్తించే బాధ్యతను తన స్నేహితులు రమేష్, పవన్‌లకు అప్పగించాడు. దీంతో వీరిద్దరూ పెందుర్తిలో ఉన్న తిరుమల ఆస్పత్రి డాక్టర్ పరమేశ్వరరావును సంప్రదించారు. సర్జరీ ఆపరేషన్ థియేటర్, వార్డు ఇస్తే రూ.60 వేలు ఇస్తామని చెప్పారు. ఆ ఆస్పత్రి ఆధునికీకరణకు అప్పటికే ఆ డాక్టర్ రూ.2.5 కోట్లు ఖర్చు చేసి కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక రోజుకు రూ.60 వేలు వస్తుందని భావించి సర్జరీ చేసుకునేందుకు అంగీకరించారు. అన్నీ సమకూరాక వెంకటేష్ సర్జరీ చేసేందుకు వైద్యుల కోసం ప్రయత్నించాడు. ముందు కేర్ ఆస్పత్రి వారితో మాట్లాడినప్పటికీ వారు అంగీకరించలేదు. అయితే అందులో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న సాయితో వెంకటేష్‌కు పరిచయముంది. దీంతో సాయికి ఈ విషయం చెప్పడంతో తనకు తెలిసిన వైద్యులు ఉన్నారని.. వెంకటేష్‌కు ఇద్దరు డాక్టర్లను పరిచయం చేశాడు. ఆ వైద్యులిద్దరూ సర్జరీ చేయడానికి అంగీకరించారు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్లో వినయ్‌కుమార్‌కు, ఈ ఏడాది ఫిబ్రవరిలో వాసుపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తికి తిరుమల ఆస్పత్రిలోనే కిడ్నీ తొలగించినట్లు పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నారు. వినయ్‌కుమార్ కిడ్నీని మరో రాష్ట్రానికి చెందిన చౌహాన్ అనే వ్యక్తికి ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్లు గుర్తించారు. వెంకటేష్‌తో పాటు సర్జరీ చేసిన వైద్యుల కోసం కూడా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఈ కేసులో ఎలీనా, కామరాజు, మర్రి శ్రీను, అతడి భార్య కొండమ్మతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ శేఖర్, తిరుమల ఆస్పత్రి డాక్టర్ పరమేశ్వరరావును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిపై 307, 326, 420, 120బీ సెక్షన్లతో పాటు అవయవాల మార్పిడి చట్టం ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు. ఇంకెవరైనా బాధితులు ఉంటే వారి నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విశాఖ కేంద్రంగా కిడ్నీ రాకెట్ నడుస్తోందన్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ తేల్చిచెప్పారు. -
అనుమతి లేని చోట సభ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/కందుకూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో 8 మంది మృతికి కారణమైన చంద్రబాబు నాయుడు రోడ్ షోలో నిబంధనలు ఉల్లంఘించారని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. గురువారం ఆయన నెల్లూరు ఎస్పీ విజయారావుతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్షించిన అనంతరం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో విలేకరులతో మాట్లాడారు. పోలీస్ శాఖ ఎన్టీఆర్ సర్కిల్లో చంద్రబాబు వాహనం నిలిపి మాట్లాడేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. కానీ వాహనం మాత్రం సర్కిల్ నుంచి దాదాపు 50 మీటర్లు ముందుకు వెళ్లడంతో వెనుక వైపు ఉన్న జనం ఒక్కసారిగా ముందుకు కదిలారని తెలిపారు. వై ఆకారంలో ఉన్న ఆ ప్రాంతంలో రెండు వైపులా జనం ముందుకు చొచ్చుకు రావడంతో ఆ చిన్న ప్రదేశంలో అప్పటికే అక్కడ ఉన్న వారు ఎటూ వెళ్లలేక ప్రమాదంబారిన పడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ అనుమతి లేకుండానే శింగరాయకొండ హైవే నుంచి చంద్రబాబు వాహనం ముందు 1,000 – 1,500 బైకులతో ర్యాలీ నిర్వహించారన్నారు. ఒకవైపు పట్టణ సీఐ బైకు ర్యాలీ వద్దని వారిస్తున్నా లెక్క చేయలేదని తెలిపారు. అనుమతి ఇవ్వకపోయినా క్రాకర్స్ కాల్చారన్నారు. 7.30 గంటలలోపు సభ ముగించాలని ముందుగా స్థానిక డీఎస్పీ సృష్టం చేసినప్పటికీ, పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇలా పలు నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు. డీఎస్పీ స్థాయి అధికారి ఈ కేసు దర్యాప్తు చేస్తారని డీఐజీ తెలిపారు. ఘటనపై కేసు నమోదు కందుకూరు ఘటనలో గాయపడిన స్థానికుడు పిచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఆర్పీసీ 174 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి ఎవరినీ నిందితులుగా చేర్చలేదు. పూర్తి విచారణ తర్వాత అన్ని అంశాలు చేరుస్తామని పట్టణ ఎస్ఐ కిశోర్ తెలిపారు. ఇదిలా ఉండగా, 8 మంది మృతదేహాలకు గురువారం ఉదయం రిమ్స్ నుంచి వచ్చిన వైద్యులు వేణుగోపాల్‌రెడ్డి, సురేష్‌ల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఊపిరి ఆడక పోవడం వల్లే వారంతా మృతి చెందారని నిర్ధారించినట్లు సమాచారం. పంచనామా అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. -
మాచర్లలో టీడీపీ ‘ఇదేం ఖర్మ’పై... పోలీసులకు సమాచారం లేదు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): పల్నాడు జిల్లా మాచర్లలోని 16వ వార్డులో ఈ నెల 16వ తేదీన టీడీపీ చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అనే కార్యక్రమం గురించి పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ చెప్పారు. గుంటూరులోని డీఐజీ కార్యాలయంలో ఆదివారం పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మాచర్ల 16వ వార్డు అత్యంత సున్నితమైన ఏరియా. అక్కడ పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉంది. సభలు, సమావేశాలు, కార్యక్రమాలు నిర్వర్తించే క్రమంలో పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వాలి. అలా ఇస్తే విధిగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. 16వ తేదీ సాయంత్రం 5.30 సమయంలో రెండు గ్రూప్‌ల మధ్య చోటు చేసుకున్న గొడవను విజిబుల్ ఎస్ఐ గుర్తించి, ఆందోళనకారులను చెదరగొట్టారు. పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈలోగా రాళ్ల దాడి జరిగింది. ఒక వర్గం నుంచి చల్లా మోహన్, మరోవర్గం నుంచి అంకమ్మ ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేశాం. రెండు వీడియోలలో దాడి దృశ్యాలను ఆధారంగా చేసుకుని సెక్షన్ 307 కింద కేసులు నమోదు చేశాం. చట్టాన్ని ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవు. ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా మరింత లోతుగా విచారణ చేస్తాం’ అని డీఐజీ తెలిపారు. -
కరకట్ట గొడవ.. వాస్తవాలు తెలుసుకోవాలి: డీఐజీ
-
కరకట్ట గొడవ.. వాస్తవాలు తెలుసుకోవాలి: డీఐజీ
సాక్షి, గుంటూరు: కరకట్ట గొడవపై కొన్ని మీడియా సంస్థలు అసత్య కథనాలు రాశాయని డీఐజీ త్రివిక్రమ వర్మ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరకట్టపై గొడవ జరిగితే, మాజీ సీఎం ఇంటిపై దాడి జరిగిందని తప్పుడు కథనాలు రాయడం ఎంత వరకు సమంజసం అని డీఐజీ ప్రశ్నించారు. మీడియాలో కథనాలు రాసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలని డీఐజీ హితవు పలికారు. అబద్ధాలు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కరకట్టపై ఎవరు దాడి చేశారో... ఎక్కడ దాడి చేశారో వీడియోలను మీడియాకు డీఐజీ చూపించారు. చదవండి: ‘వైఎస్సార్సీపీ విజయాన్ని ఎల్లో మీడియా వక్రీకరించింది’ ఆన్లైన్ టికెట్ విధానం మేమే అడిగాం: నిర్మాత కళ్యాణ్ -
అమరావతి సభను ప్రశాంతంగా జరపండి
గుంటూరు: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం సభ నిర్వహణకు అనుమతులు ఇచ్చామని గుంటూరు రేంజ్ డీఐజీ సీఎం త్రివిక్రమ వర్మ చెప్పారు. సభను అల్లర్లకు దూరంగా.. ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సిన పూర్తి బాధ్యతను నిర్వాహకులే వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం గుంటూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డీఐజీ మాట్లాడారు. శాంతియుతంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను రాజ్యంగం భారత పౌరులకు ఇచ్చిందని.. ఇతరులకు అసౌకర్యం, ఇబ్బందులు కలుగకుండా ఈ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సభకు పోలీస్ శాఖ నుంచి అన్ని సహకారాలు ఉంటాయన్నారు. అయితే, ఉద్దేశపూర్వకంగా కొందరు అల్లర్లు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్నట్టుగా తమకు ముందస్తు సమాచారం అందిందన్నారు. ఈ దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు అదనపు బలగాలను సిద్ధంగా ఉంచామన్నారు. అల్లర్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విధిగా ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సభలో పాల్గొనాలని సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే సభ, ర్యాలీ కార్యక్రమాలను అనుమతిస్తామన్నారు. ఎస్పీ విశాల్‌గున్నీ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. కరకట్టపై ముఖ్య అధికారులు, జడ్జిలు, అత్యవసర సేవలకు వినియోగించే వాహనాలకు అనుమతి ఉంటుదన్నారు. ఇతర జిల్లాల నుంచి ఎక్కువ మందిని సమీకరించకుండా జాగ్రత్తలు పాటించేలా నిర్వహకులకు అనుమతులు ఇచ్చామన్నారు. -
ఎస్పీ త్రివిక్రమ వర్మ బదిలీ
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మకు బదిలీ అయింది. ఈయనకు ఇటీవల డీఐజీగా పదోన్నతి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈయన్ని ఏలూరు రేంజ్ డీఐజీగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈయన స్థానంలో ఇదివరకూ జిల్లాలో ఏఎస్పీగా పనిచేసిన సెంథిల్‌కుమార్ జిల్లా ఎస్పీగా రానున్నట్లు సమాచారం. బదిలీపై వెళ్తున్న సీఎం త్రివిక్రమవర్మ 2017 జూన్ 26న శ్రీకాకుళం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన హయాంలో వంశధార నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించే విషయంలో చురుగ్గా వ్యవహరించారు. అలాగే కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ (సీపీవో) వ్యవస్థను జిల్లాకు పరిచయం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై శ్రద్ధ కనబర్చారు. దొంగతనాలు అరికట్టడంలో, దొంగల భరతం పట్టేందుకు వీలుగా ఎల్‌హెచ్‌ఎంఎస్ ప్రత్యేక యాప్‌ను రూపొందించడంలో, జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఈయన హయాంలోనే జరిగింది. రాత్రి వేళళ్లో ముమ్మర గస్తీ నిర్వహించడం, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారికి చలానాలు నమోదు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదుతో పాటు పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు కూడా త్రివిక్రమవర్మ హయాంలోనే జరిగాయి. -
ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు ప్రారంభం
► కానిస్టేబుల్ అభ్యర్థులకు రెండో దశ పరీక్షలు ►ఒరిజినల్ సర్టిఫికెట్లు లేనివారు 6వ తేదీలోపు తీసుకొచ్చి హాజరు కావొచ్చు ►ఛాతి కొలతలో అనర్హత అరుుతే తిరిగి అప్పీలు చేసుకోవచ్చు ►దళారుల మాటలు విని మోసపోవద్దు ►పరీక్షలన్నీ పారదర్శకమే ►ఎస్పీ త్రివిక్రమ వర్మ ఒంగోలు క్రైం : పోలీసు కానిస్టేబుళ్లు, జైలు వార్డర్ల రెండో దశ పరీక్షల్లో భాగంగా స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్లో గురువారం ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు ప్రారంభించారు. పరీక్షలు ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ పర్యవేక్షణలో జరిగాయి. పరీక్షలు ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగుతాయి. మొదటి రోజు పరీక్షల్లో భాగంగా మొత్తం 840 మంది హాజరు కావాల్సి ఉంది. 644 మంది హాజరయ్యారు. ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు క లగకుండా అన్ని వసతులు కల్పించింది. క్యాంటిన్ సౌకర్యంతో పాటు మంచినీటి వసతి, వైద్యం కోసం పత్యేకంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చే సింది. ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల ప్రారంభం సందర్భంగా ఎత్తు కొలతలు, ఛాతి కొలతల నమోదును ఎస్పీ దగ్గరుండి పర్యవేక్షించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్పనిసరి ఎస్పీ త్రివిక్రమవర్మ మాట్లాడుతూ అభ్యర్థులు కొంతమంది ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకుండా ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షకు హజరయ్యారని, తప్పకుండా ఒరిజనల్ సర్టిఫికెట్లు తీసుకొస్తేనే పరీక్షలకు అనుమతిస్తామన్నారు. అలాంటి వారికి కొంత వెసులుబాటు కల్పించామని, ఫిట్నెస్ పరీక్షల చివరి రోజు అంటే ఈ నెల 6వ తేదీ లోపు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని హాజరు కావచ్చన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒరిజనల్ సర్టిఫికెట్లు తీసుకురాకుంటే ఎలాంటి పరిస్థితుల్లో అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అన్ని పరీక్షలు సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్నామన్నారు. ఒక్క లాంగ్ జంప్ మాత్రం మాన్యువల్‌గా నమోదు చేస్తున్నామని చెప్పారు. అక్కడ కూడా అభ్యర్థులకు వచ్చిన పాయింట్లు వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేస్తామన్నారు. ఎత్తు కొలత, ఛాతి కొలత కూడా ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారానే చూస్తున్నామని వివరించారు. పరుగు పందేలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సెన్సార్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. మానవ తప్పిదాలకు ఆస్కారం లేకుండా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. ఎత్తు కొలతల్లో అర్హత కోల్పోతే అలాంటి వారిని నచ్చజెప్పి పంపిస్తున్నామన్నారు. ఛాతి కొలతల్లో ఊపిరి పీల్చినప్పుడు తగ్గి అనర్హత పొందితే అలాంటి అభ్యర్థులు తిరిగి అప్పీలు చేసుకోవచ్చని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రెండో దశ పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిభే ఆధారం దళారులు రంగంలోకి దిగి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎస్పీ త్రివిక్రమ వర్మ సమాధానం ఇస్తూ అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రతిభే ఆధారంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దళారులపై తనకు ఫిర్యాదు చేయాలన్నారు. ిఫిట్‌నెస్ పరీక్షలను ఇన్చార్జి అదనపు ఎస్పీ ఏ.దేవదానం, ఏఆర్ ఏఎస్పీ టి.శివారెడ్డిల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. మొదటి దశలో 189 మంది అర్హత... రెండో దశ అభ్యర్థుల ఎంపిక ఫిట్నెస్ పరీక్షలో మొదటి రోజు 189 మంది అర్హత సాధించారు. ఫిజికల్ మెడికల్ టెస్ట్‌లో 157 మంది అనర్హత పొందారు. వారిలో ఎత్తు తక్కువ ఉన్న వారు, ఛాతి పీల్చినప్పుడు, సాధారణంగా ఉన్నప్పుడు నిబంధనల ప్రకారం కొలతలు చాలని వారు ఉన్నారు. 1,600 మీటర్ల పరుగు పందెంలో 21 మంది అనర్హత పొందారు. సర్వర్ సమస్యతో 277 మందికి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించలేదు. వారికి ఈ నెల 7వ తేదీన నిర్వహించాలని ఎస్పీ నిర్ణరుుంచారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌లో పది చోట్ల పరిశీలన కానిస్టేబుళ్ల ఎంపిక కోసం రెండో దశ పరీక్షల్లో భాగంగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్టుల నిర్వహణ కోసం వచ్చే అభ్యర్థులు పది చోట్లకు హాజరు కావాల్సి ఉంది. ఆ ప్రాంతాల్లో సర్టిఫికేట్ల పరిశీలన, ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పోలీసు సిబ్బందిని ఎక్కడికక్కడ నియమించారు. ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ సారథ్యంలో ఇద్దరు ఏఎస్పీలు, దాదాపు ఏడుగురికిపైగా డీఎస్పీల పర్యవేక్షణలో పరిశీలనలు జరుగుతున్నారుు. మొదటి దశలో ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షకు వచ్చిన అభ్యర్థులను నగరంలోని కర్నూల్ రోడ్డు బైపాస్ ఫ్లరుు ఓవర్‌కు ఆనుకొని ఉన్న జిల్లా పోలీసు కార్యాలయం ప్రధాన గేటు వద్ద రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ముందుగా హాల్ టెక్కెట్లలో ఇచ్చిన సమయం ప్రకారం అందరినీ సరిచూసి ఆ సమయంలో ఎంతమంది ఉంటే అంత మందినీ లోపలికి పంపిస్తారు. లోనికి వెళ్లిన తర్వాత బ్యాచీలుగా విడగొట్టి పదుల సంఖ్యలో చేసి రెండో దశ పరిశీలనకు పంపుతారు రెండో దశలో మాన్‌డేటరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారు. అక్కడ సర్టిఫికేట్లన్నింటినీ పరిశీలించి హాల్‌టిక్కెట్ ఆధారంగా, ఒరిజనల్ సర్టిఫికెట్లు సరి చూస్తారు. ఆ తర్వాత బయో మెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. హాల్ టిక్కెట్లోని బార్ కోడ్ ఆధారంగా వేలిముద్రలు సరి చూస్తారు. అంటే అభ్యర్తి కచ్చితంగా అతనేనని తేల్చేస్తారు. ఒకరి స్థానంలో మరొకరు రాకుండా ఇక్కడ ఫిల్టర్ చేస్తారు. ఇక్కడి నుంచి అంతా ఆన్లైన్లోనే... 4 అక్కడ నుంచి ఫిజికల్ మెజర్మెంట్ కౌంటర్‌కు చేరుకోవాలి. అక్కడ ఎస్పీ స్వయంగా కూర్చొని ఎత్తు, ఛాతి కొలతలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరీక్షిస్తారు. 4 అక్కడి నుంచి 1,600 మీటర్ల (ఒక కిలో మీటర్) పరుగు పందేనికి సన్నద్ధం కావాలి. పరుగు పందెంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సెన్సార్ సిస్టంను అభ్యర్థులకు కేటారుుంచిన నంబరు వెనుక, ఛాతీకి ఆనుకునే విధంగా అమరుస్తారు. సమయం, స్పీడు అన్నీ ఆన్లైన్ ద్వారానే రికార్డు అవుతారుు. 4 అనంతరం సర్టిఫికెట్ల స్కానింగ్, ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. 4 ఆ తర్వాత 100 మీటర్ల పరుగు పందెం నిర్వహిస్తారు. 4 ఆ తర్వాత లాంగ్ జంప్ ఉంటుంది. ఇందుకోసం మూడు ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. ఇక్కడ దూకిన దూరాన్ని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)ల ద్వారా కొలతలు తీరుుంచి ఆన్లైన్లో వెంటనే అప్లోడ్ చేస్తారు. 4 ఇక్కడ డాటా ఎడిటింగ్ ఉంటుంది. ఆన్లైన్ ఏమైనా పొరపాట్లు దొర్లినా, అభ్యర్థుల పేర్లు, మరేమైనా జరిగితే వెంటనే సరిచేస్తారు. సవరణలు చేపడతారు. 4 అన్ని పరీక్షల్లో వచ్చిన పారుుంట్లు, మార్కులు సరి చూసి రిజల్ట్ ఇక్కడ ఫైనల్ చేస్తారు.