
బెంగళూరు: కృత్రిమ మేధ (ఏఐ) వంటి సాంకేతికతల వల్ల మనుషులకు ఉద్యోగాలు ఉండవన్నది నిజం కాదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి అన్నారు. వాస్తవానికి ఏఐ, మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి వాటి వల్ల మరిన్ని ఎక్కువ ఉద్యోగాలు వస్తాయన్నారు. వెట్టి చాకిరీని వదిలిపెట్టి సౌకర్యవంతంగా జీవించేందుకు, పనులను మరింత సులువుగా చేసుకునేందుకు సాంకేతికత అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు. బెంగళూరులో జరిగిన ‘ఇన్ఫోసిస్ ప్రైజ్’ అనే వార్షిక బహుమతుల ప్రదాన వేడుకలో ఆయన పాల్గొన్నారు. ‘కంప్యూటర్ సైన్స్‌లో కృత్రిమ మేధ కచ్చితంగా ముఖ్యమైన అంశం. ఏఐ, ఐంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) వంటి వాటి వల్ల మనుషులు జీవితాలు మరింత సౌకర్యవంతంగా మారుతాయి. ఉద్యోగాలు కూడా మరిన్ని పెరుగుతాయి. అలాగే ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యూఈఎఫ్) నివేదిక ప్రకారం పని ప్రదేశాల్లోని యంత్రాల్లో జరుగుతున్న మార్పులు 13.3 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించగలవు’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment