మూర్తి కామెంట్స్ :పతనమైన ఇన్ఫీ షేర్లు
మూర్తి కామెంట్స్ :పతనమైన ఇన్ఫీ షేర్లు
Published Mon, Apr 3 2017 1:05 PM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ లో బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు మరోసారి వివాదం రాజుకోవడంతో షేర్లు అతలాకుతలమవుతున్నాయి. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు వేతనాన్ని భారీగా పెంచుతూ బోర్డు నిర్ణయించడంపై కంపెనీ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి మండిపడుతూ ఓ లేఖ రాశారు. నారాయణమూర్తి మరోసారి కంపెనీ బోర్డు సభ్యులపై విరుచుకుపడటంతో ఇన్వెస్టర్లలో ఆందోళన ప్రారంభమైంది. దీంతో మార్నింగ్ ట్రేడింగ్ లో 1శాతం పడిపోయిన ఈ టెక్ దిగ్గజం షేర్లు మరింత నష్టాల్లోకి పయనిస్తున్నాయి. ఫిబ్రవరిలో బోర్డు సభ్యులు యూబీ ప్రవీణ్ రావుకు భారీగా పెంచిన వేతనం కంపెనీ ఉద్యోగుల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని హరిస్తుందని నారాయణమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు.
కంపెనీలో టాప్ -లెవల్ వ్యక్తులకు 60 శాతం నుంచి 70 శాతం పరిహారాలు పెంచుతున్న సమయంలో, ఇతర ఉద్యోగులకు కేవలం 6 శాతం నుంచి 8 శాతం మాత్రమే పరిహారాలు పెరుగుతున్నాయని, ఇది అనైతికమని నారాయణమూర్తి అన్నారు. ప్రవీణ్ రావు వేతనం పెంపుకు కేవలం 24 శాతం మంది ప్రమోటర్లే ఆమోదం తెలపుతూ ఓట్ వేశారు. మిగతావారందరూ ఓటింగ్ లో పాల్గొనలేదు. ఇది ఇన్ఫోసిస్ లోపాలన ప్రమాణాలు లోపించడాన్ని ఎత్తి చూపుతున్నాయని నారాయణమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు.
Advertisement