గత రెండేళ్ల నుంచి వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితమైన ఐటీ ఉద్యోగుల విషయంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాసకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.తమ ఉద్యోగులను కార్యాలయానికి వచ్చేలా ప్రోత్సహించాలని ఐటీ కంపెనీలకు హితవు పలికారు. కోవిడ్-19 తీవ్రత తగ్గిపోయిందని ఇకపై ఇంటి నుంచి పనిచేసే విధానాలకు స్వస్తి పలకాలన్నారు.
పెద్ద అభిమానిని కాదు..!
బెంగుళూరులో ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన ఐటీ సమ్మిట్‌లో వర్క్ ఫ్రం హోంపై ఎన్‌ఆర్ నారాయణమూర్తి తన అభిప్రాయాలను పంచుకున్నారు. వర్క్ ఫ్రం హోంకు అంత పెద్ద అభిమానిని కాదని అన్నారు. ఇంటి నుంచి పనిచేయడం తనకు అసలు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. ఇంటి నుంచి పనిచేస్తే సృజన శీలత సాధ్యం కాదన్నారు. పనిలోనూ నాణ్యత ఉండదన్నారు. ఐటీ ఉద్యోగులు ఇంటికే పరిమితమవ్వడంతో కంపెనీల సంస్థాగత వ్యవహరాలు నెమ్మదించిందని తెలిపారు. అంతేకాకుండా కంపెనీల ఉత్పాదకత కూడా తగ్గిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు పిలిచేందుకు సిద్దమయ్యాయి.
బంగ్లాదేశ్ కంటే తక్కువ..!
వర్క్ ఫ్రం హోంతో పాటుగా భారత తలసరి ఆదాయంపై కూడా నారాయణమూర్తి హైలైట్ చేశారు. 2020-21 గాను నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పడిన బంగ్లాదేశ్ కంటే భారత తలసరి ఆదాయం తక్కువగా నమోదైందని గుర్తు చేశారు. ఇక రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు జర్మనీ తీసుకున్న చర్యలను మూర్తి వివరించారు.
చదవండి: ఫ్లీజ్ మోదీజీ!! మమ్మల్ని ఆదుకోండి..భారత్‌కు రష్యా బంపరాఫర్!
Comments
Please login to add a commentAdd a comment