అరుదైన డెంగ్యూతో బ్యాంక్‌ ఎండీ మృతి | Bank of America MD dies of rare Dengue-linked syndrome | Sakshi
Sakshi News home page

అరుదైన డెంగ్యూతో బ్యాంక్‌ ఎండీ మృతి

Published Sat, Sep 9 2017 10:58 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

అరుదైన డెంగ్యూతో బ్యాంక్‌ ఎండీ మృతి - Sakshi

అరుదైన డెంగ్యూతో బ్యాంక్‌ ఎండీ మృతి

సాక్షి, ముంబై: డెంగ్యూ  జ్వరం  బ్యాంక్ ఆఫ్ అమెరికా  ఎండీని బలితీసుకుంది. అరుదైన డెంగ్యూ-లింక్డ్ సిండ్రోమ్‌తో బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఏ) ఎండీ   సంజీవ్‌ ఝా ముంబై లీలావతి ఆసుపత్రిలో కన్నుమూశారు.

బ్యాంక్ ఆఫ్ అమెరికా గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ ఎండీ  సంజీవ్ ఝా (34)  ముంబై లీలావతి ఆసుపత్రిలో అరుదైన రుగ్మతతో చికిత్స పొందుతూ అధిపతి మంగళవారం మరణించారు. కొన్ని రోజుల అనారోగ్యం తరువాత, ఝాను ఆగష్టు 29న బాంద్రా ఆసుపత్రిలో చేర్చారు. దాదాపు ఏడు రోజుల తరువాత అతనికి అరుదైన  హెచ్‌ఎల్‌హెచ్‌  సోకినట్టు గుర్తించారు. డెంగ్యూ జ్వరం మరింత ముదిరి, కాలేయంలో  తెల్లరక్త కణాలు అసాధారణంగా పెరగడంతో ఇతర రక్తకణాలను నాశనం చేశాయి. దీంతో శరీరంలోని వివిధ  అవయవాలు ప్రభావిత మయ్యాయి. ముఖ్యంగా  కిడ్నీలు, లివర్‌  బాగా పాడైపోవడంతో ఆయన చనిపోయారని  సీనియర్‌ వైద్యులు డా. సీసీ నయ్యర్‌ తెలిపారు.

అయితే ప్లేట్‌లెట్స్‌ , రక్తమార్పిడి కారణంగా   ఝా పరిస్థితి క్షీణించిందనీ కుటుంబ సభ్యులు, ఇతర స్నేహితులు చెప్పారు.


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement