SBI Funds Management appoints Shamsher Singh as MD and CEO - Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ ఫండ్స్‌ ఎండీగా షంషేర్‌ సింగ్‌ నియామకం

Published Fri, Dec 23 2022 10:41 AM | Last Updated on Fri, Dec 23 2022 10:54 AM

Sbi Funds Management Appoints Shamsher Singh As Md, Ceo - Sakshi

న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న షంషేర్‌ సింగ్‌ తాజాగా ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌కు కొత్త ఎండీ, సీఈవోగా ఎంపికయ్యారు. ప్రస్తుత ఎండీ, సీఈవో వినయ్‌ ఎం టాన్సే నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. వినయ్‌ ఎస్‌బీఐకు తిరిగి బదిలీకానున్నట్లు ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది.

ఎస్‌బీఐలోని వివిధ విభాగాలలో 32ఏళ్లకుపైగా పనిచేసిన అనుభవం సింగ్‌ సొంతంకాగా.. ఇన్వెస్ట్‌మెంట్, కార్పొరేట్, బ్రాంచ్‌ బ్యాంకింగ్‌లతోపాటు, ట్రెజరీ తదిరాలలో విధులు నిర్వర్తించారు. 1990 జూన్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా సింగ్‌ తొలుత ఎస్‌బీఐలో చేరారు.

తదుపరి వివిధ నాయకత్వ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తూ డిప్యూటీ ఎండీగా పదవోన్నతి పొందారు. ఈ క్రమంలో యూఎస్, బహ్రయిన్, యూఏఈలలోనూ విధులు నిర్వహించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement