Jet Airways CEO-designate Sanjiv Kapoor resigns - Sakshi
Sakshi News home page

కీలక పరిణామం.. జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో పదవికి సంజీవ్‌ కపూర్‌ రాజీనామా!

Published Fri, Apr 28 2023 7:34 PM | Last Updated on Fri, Apr 28 2023 8:26 PM

Jet Airways Ceo designate Sanjiv Kapoor Resigns - Sakshi

దేశీయ ఏవియేషన్‌ రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఏడాది జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన సంజీవ్‌ కపూర్‌ తన పదవికి రాజీనామా చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయన సీఈవోగా ఏప్రిల్‌ 30 వరకు కొనసాగనున్నారు. 

ఇక సంజీవ్‌ కపూర్‌ సీఈవో పదవికి ఎందుకు రాజీనామా చేశారన్న విషయంపై కారణాలు తెలియరావాల్సి ఉంది. రిజిగ్నేషన్‌పై అటు సంజవ్‌ కపూర్‌ గాని, ఇటు జలాన్- కర్లాక్‌ కన్సార్షియం గాని స్పందించలేదు. 

అప్పటి వరకు సంజీవ్‌ కపూర్‌ సీఈవోగా
ఆర్థికంగా కుదేలైన జెట్‌ ఎయిర్‌వేస్‌ 2019లో నిలిచిపోయింది. దీంతో ఈ వ్యవహారం నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు వెళ్లగా.. జలాన్- కర్లాక్‌ కన్సార్షియం బిడ్డింగ్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ను దక్కించుకుంది. అయితే, తాజాగా జెట్‌ ఎయిర్‌వేస్‌ సేవల్ని పునఃప్రారంభించే విషయంలో కన్సార్షియానికి, రుణదాతలకు మధ్య విభేదాలు నెలకొన్నట్లు సమాచారం. ఈ తరుణంలో సంజీవ్‌ కపూర్‌ రాజీనామా చేయడం దేశీయ ఏవియేషన్‌ రంగంలో కీలక పరిమాలు చోటు చేసుకోవడం చర్చాంశనీయంగా మారింది.

 సంజీవ్‌ కపూర్‌ రాజీనామాతో 
విమానయాన రంగంలో సంజీవ్‌ కపూర్‌కు దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఆసియా, ఐరోపా, అమెరికాలోని పలు కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఒబెరాయ్ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. స్పైస్‌జెట్‌, గోఎయిర్‌, విస్తారాలో వివిధ హోదాల్లో సంజీవ్‌ కపూర్ పనిచేశారు.

చదవండి👉 నేను మీ పని మనిషిని కాను సార్‌’.. ఇండిగో ఎయిర్‌ హోస్టెస్‌కు జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో సపోర్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement