Sanjeev Kapoor
-
వంటలతో షురూ చేసి రూ. 750 కోట్లకు అధిపతిగా, ఊహించని నెట్‌వర్త్
మిలియనీర్, బిలియనీర్ కావాలంటే అంతే స్థాయిలో పెట్టుబడులు కావాలి..బడా పారిశ్రామిక వేత్తో కావాలి అని అనుకుంటాం సాధారణంగా. కనీసం ఏ ఐఐటీ లేదా ఐఐఎం డిగ్రీ సాధించి పెద్ద కంపెనీలో కీలక ఎగ్జిక్యూటివ్‌గా ఉండాలి అనుకుంటాం. కానీ ఇవేమీ లేకుండానే రూ. 750 కోట్ల సంస్థకు అధిపతి అయ్యాడు. ఆయన మరెవ్వరో కాదు ఇండియన్ టాప్ రిచెస్ట్ చెఫ్ సంజీవ్ కపూర్. ఆయన సక్సెస్ స్టోరీ ఒకసారి చూద్దాం. ఇండియాలోనే కాదు ప్రపంచంలోని అత్యంత ధనిక చెఫ్‌లలో ఒకడిగా మరతానని బహుశా సంజీవ్ కపూర్ ఊహించి ఉండరు. పలు రకాల రెసిపీలతో మొదలు పెట్టి, టాప్ చెఫ్‌గా, హోస్ట్‌గా, రైటర్‌గా చివరికి వ్యాపారవేత్తగా గ్లోబల్‌గా పాపులర్ అయ్యాడు.1992లో ఒక టీవీ షో హోస్ట్ చేయడం ప్రారంభించి 18 సంవత్సరాలు నడిపించిన ఘనత ఆయకే సొంతం. సోషల్‌మీడియాలో మిలియన్ల కొద్దీ ఫోలోవర్లున్నారు. Bahut logon ne mujhe poocha ki millets ki quality kaise check karte hai, store kaise karte hai? Isiliye the next stop on our #MilletKhazana journey is easy tips and tricks to store millets. Do let me know how you store them at home?#MilletKhazana #MilletToMeals #India #Millets pic.twitter.com/rE7NhrCckE — Sanjeev Kapoor (@SanjeevKapoor) June 3, 2023 అంతేకాదు 120 దేశాలలో ప్రసారమై 2010లోనే 500 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం విశేషం. జనవరి 2011లో ఫుడ్ ఫుడ్ అనే 24 గంటల ఫుడ్ అండ్ లైఫ్ స్టయిల్ ఛానెల్‌ని ప్రారంభించిన ప్రపంచంలోనే తొలి చెఫ్. సంజీవ్ కపూర్ హోస్ట్ చేసిన ఖానాఖజానా ఇండియన్ టెలివిజన్ అకాడమీ (ITA) ఇండియన్ టెలీ అవార్డ్స్ నుండి బెస్ట్ కుకరీ షో బహుమతిని పలుమార్లు అందుకుంది. (ఆషాఢంలో శుభవార్త: తగ్గుతున్న బంగారం,వెండి ధరలు) పంజాబ్, అంబాలాలో 1964 ఏప్రిల్ 10, సంజీవ్ కపూర్ పుట్టారు. న్యూ ఢిల్లీలోని పూసాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ అండ్ న్యూట్రిషన్ నుండి హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా పూర్తి చేశాడు. అలియోనా కపూర్‌ను వివాహం చేసుకున్నాడు. 1984లో తన వృత్తిని ప్రారంభించి అద్భుతమైన రెసిపీలు, చక్కటి వాచకం, అంతకుమించిన యాంకరింగ్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. వండర్‌చెఫ్ అనే కంపెనీని స్థాపించాడు. ఈ సంస్థ ఆదాయం గత ఏడాది రూ. 700 కోట్లు. అంతకుముందు ఏడాది కంపెనీ రూ.560 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కంపెనీ విస్తరణ ప్లాన్‌లో భాగంగా మార్కెటింగ్‌ను పెంచడానికి కంపెనీ 100 కోట్ల రూపాయలపెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. 40 శాతం విదేశీ పెట్టుబడిదారులున్నారు. సంజీవ్ కపూర్ ఇండియాతోపాటు, ఇతర పలు దేశాల్లో రెస్టారెంట్స్ చెయిన్స్‌ను నిర్వహిస్తున్నారు. సోడెక్సో మాజీ సీఈవోతో కలిసి 1998లో దుబాయ్‌లో ప్రముఖ ఫుడ్ బ్రాండ్ ద్వారా వ్యాపారవేత్తగా అవతరించాడు. ఈ కంపెనీ విలువ రూ.750 కోట్లు. వంటగది ఉపకరణాలు, ఇతర వంటగది సామాగ్రిని 14 దేశాల్లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. (థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ) వార్షిక సంపాదన 2022లోనే సంజీవ్ కపూర్ నికర విలువ రూ. 1000 కోట్లుగా ఉంది. వార్షిక సంపాదన రూ. రూ. 25 కోట్లు. వండర్ చెఫ్‌లో అతని పెట్టుబడి, ఎల్లో చిల్లీ వంటి రెస్టారెంట్ చెయిన్ల నుండి, టీవీ షోలు బ్రాండ్ స్పాన్సర్షిప్లతోపాటు, స్వయంగా అతనురాసిన అతని పుస్తకాల అమ్మకం ద్వారా వచ్చిన రాయల్టీలు ఇవన్నీ ఇందులో భాగం. బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలోని బ్రాండ్లలో ఏరియల్, డెట్టాల్, దావత్ బాస్మతి రైస్, స్లీక్ కిచెన్ లాంటివి ఉన్నాయి. ప్రతి బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం రూ. 30 రూ. 40 లక్షలు చార్జ్ చేస్తాడు. దీనితోపాటు సంజీవ్ కపూర్ ముంబైలోని జుహు ప్రాంతంలో ఒక సంపన్నమైన ఇంటిలో నివసిస్తున్నారు. 1500 చదరపు అడుగులు డ్యూప్లెక్స్‌లో ఉంటారు. స్టాటిస్కా రిపోర్ట్ ప్రకారం 2019లో 24.8 కోట్ల ఆదాయంతో కపూర్ భారతదేశంలో అత్యంత ధనిక చెఫ్‌గా నిలిచారు. (వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో) ప్రేమ వివాహం 1992లో సంజీవ్ కపూర్ తన ప్రేయసి అలియోనాను వివాహమాడాడు. సంజీవ్, వందన కలిసి ఢిల్లీ ఐటీడీసీ హోటల్లో పనిచేసేవారు. కానీ ఎపుడూ కలుసుకోలేదు. అయితే అనుకోకుండా ఒకసారి రైలులో జరిగిన వీరి పరిచయం ప్రేమగా మారింది. నాలుగేళ్ల డేటింగ్ తరువాత పెళ్లి చేసుకున్న జంటకు ఇద్దరు కుమార్తెలు న్నారు. పెద్ద కూతురు రచిత. చిన్న కూతురు కృతి. (టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?) అవార్డులు 2017లో భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు న్యూ ఢిల్లీలోని వరల్డ్ ఫుడ్ ఇండియాలో 918 కిలోల ఖిచ్డీని వండి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (2017) హార్వర్డ్ అసోసియేషన్ ప్రచురించిన సంజీవ్ కపూర్‌పై కేస్ స్టడీ ఐటీఏ అవార్డు - పాపులర్ చెఫ్ & ఎంటర్ప్రెన్యూర్ (జైకా-ఇ-హింద్) (2015) ఐటీఏ అవార్డు ఉత్తమ వంట (ఖానా ఖజానా) (2010, 2004, 2002) భారత ప్రభుత్వ 'బెస్ట్ చెఫ్ ఆఫ్ ఇండియా' జాతీయ అవార్డు ఇండియా అత్యంత విశ్వసనీయ వ్యక్తులలో 100 మంది రీడర్స్ డైజెస్ట్ జాబితాలో 31వ స్థానం ఫోర్బ్స్ 'టాప్ 100 భారతీయ ప్రముఖుల జాబితాలో 34వ స్థానం -
కీలక పరిణామం.. జెట్ ఎయిర్వేస్ సీఈవో పదవికి సంజీవ్ కపూర్ రాజీనామా!
దేశీయ ఏవియేషన్ రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఏడాది జెట్ ఎయిర్వేస్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన సంజీవ్ కపూర్ తన పదవికి రాజీనామా చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయన సీఈవోగా ఏప్రిల్ 30 వరకు కొనసాగనున్నారు. ఇక సంజీవ్ కపూర్ సీఈవో పదవికి ఎందుకు రాజీనామా చేశారన్న విషయంపై కారణాలు తెలియరావాల్సి ఉంది. రిజిగ్నేషన్పై అటు సంజవ్ కపూర్ గాని, ఇటు జలాన్- కర్లాక్ కన్సార్షియం గాని స్పందించలేదు. అప్పటి వరకు సంజీవ్ కపూర్ సీఈవోగా ఆర్థికంగా కుదేలైన జెట్ ఎయిర్వేస్ 2019లో నిలిచిపోయింది. దీంతో ఈ వ్యవహారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు వెళ్లగా.. జలాన్- కర్లాక్ కన్సార్షియం బిడ్డింగ్‌లో జెట్ ఎయిర్వేస్ను దక్కించుకుంది. అయితే, తాజాగా జెట్ ఎయిర్వేస్ సేవల్ని పునఃప్రారంభించే విషయంలో కన్సార్షియానికి, రుణదాతలకు మధ్య విభేదాలు నెలకొన్నట్లు సమాచారం. ఈ తరుణంలో సంజీవ్ కపూర్ రాజీనామా చేయడం దేశీయ ఏవియేషన్ రంగంలో కీలక పరిమాలు చోటు చేసుకోవడం చర్చాంశనీయంగా మారింది. సంజీవ్ కపూర్ రాజీనామాతో విమానయాన రంగంలో సంజీవ్ కపూర్‌కు దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఆసియా, ఐరోపా, అమెరికాలోని పలు కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. స్పైస్‌జెట్, గోఎయిర్, విస్తారాలో వివిధ హోదాల్లో సంజీవ్ కపూర్ పనిచేశారు. చదవండి👉 ‘నేను మీ పని మనిషిని కాను సార్’.. ఇండిగో ఎయిర్ హోస్టెస్‌కు జెట్ ఎయిర్వేస్ సీఈవో సపోర్ట్ -
బాబోయ్ ఫ్యూయల్ రేట్లు మండిపోతున్నాయ్! విమానాల్లో మగవాళ్లు వద్దు?
కరోనా దెబ్బతో అతలాకుతలమైన ఏవియేషన్ సెక్టార్‌పై రష్యా - ఉక్రెయిన్ వార్ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టయ్యింది. అంతర్జాతీయ ఉద్రిక్తలతో గత మూడు నెలలుగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు ఏవియేషన్ ఫ్యూయల్ రేట్లు పెరిగాయి. చివరి సారిగా ఏకంగా 18 శాతం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో విమానాలు నడిపించడం కత్తిమీద సాములా మారింది. పెరిగిన ఏవియేషన్ ఫ్యూయల్ ధరలు సర్వీసు ప్రొవైడర్లకు ఇబ్బందికరంగా మారాయి. విమాన సర్వీసుల నిర్వాహాణలో 40 శాతం వ్యయం కేవలం ఫ్యూయల్‌కే వెళ్తుంది. దీంతో పెరుగుతున్న ధరలు ఫ్లైట్ సర్వీస్ ప్రొవైడర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంధన పొదుపుకు సంబంధించి ఏం చేయాలనేది వారికి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్‌కి ఆసక్తికరమైన సూచన చేశాడు విశాల్ శ్రీవాత్సవ అనే నెటిజన్. విమానం నడిపే క్యాబిన్ క్రూలో మీరు ఎందుకు ఎక్కువ మంది మగవాళ్లనే నియమిస్తున్నారు? పురుషులతో పోల్చితే మహిళలు తక్కువ బరువు ఉంటారు. దీంతో తక్కువ ఇంధనం ఖర్చవుతుంది. మీరు లేడీ కేబిన్ క్రూను తీసుకోవడం ద్వారా ప్రతీ ఫ్లైట్‌కి కనీసం వెయ్యి రూపాయలు ఆదా అవుతాయి అనుకున్నా.. రోజుకు వంద ఫ్లైట్లు నడిపిస్తారనుకున్నా.. ఏడాదికి కనీసం రూ. 3.5 కోట్ల వ్యయం తగ్గుతుంది కదా ? అంటూ ప్రశ్నించాడు. విశాల్ శ్రీవాత్సవ సంధించిన ప్రశ్నలకు జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్ స్పందిస్తూ.. మంచి ఐడియా ఇచ్చారు విశాల్. కేవలం కేబిన్ క్రూ విషయంలోనే ఈ నియమం ఎందుకు అమలు చేయాలి ? ప్రయాణికుల్లో కూడా మొత్తం మహిళలే ఉండేలా చూసుకోవడం లేదా కనీసం మగ ప్యాసింజర్లను తగ్గించినా కూడా ఫ్యూయల్ బాగానే ఆదా అవుతుంది కదా అంటూ బదులిచ్చారు. Extending that logic, imagine the savings if one were to carry only female passengers! Or charge male passengers more! 😉 https://t.co/3GP2YETBnV — Sanjiv Kapoor (@TheSanjivKapoor) March 22, 2022 మీరు చెప్పిన లాజిక్ బాగానే ఉన్నా అది దీర్ఘకాలంలో లింగ వివక్షకు దారి తీస్తుంది. అంతే కాదు చట్టపరమైన చిక్కులు కూడా వస్తాయి. ఫ్యూయల్ కాస్ట్ తగ్గించుకునేందుకు మహిళా క్రూ అనేది అంత సబబైన విధానం కాదంటూ వివరణ ఇచ్చారు సంజీవ్ కపూర్. మొత్తంగా పెరుగుతున్న ఫ్యూయల్ ఛార్జీలతో ఏవియేషన్ సెక్టార్ ఎంతగా ఇబ్బంది పడుతుంతో తెలిపేందుకు విశాల్, సంజీవ్ కపూర్ల మధ్య జరిగిన సంభాషణ ఉదాహారణగా నిలుస్తోందంటున్నారు నెటిజన్లు. చదవండి: నష్టాల ఊబిలో ఏవియేషన్ -
రైలు టికెట్‌పై పది పైసల సెస్!
కేంద్ర ప్రభుత్వ యోచన న్యూఢిల్లీ: రైల్వే టికెట్‌పై కొత్తగా పది పైసలు సెస్‌గా విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధంగా వచ్చిన ఆదాయంతో రైల్వే శాఖలో పనిచేసే సుమారు 20 వేల మంది కూలీలను సామాజిక రక్షణ పథకాల పరిధిలోకి తీసుకురావాలని భావిస్తోంది. రైల్వే శాఖ 58 శాతం రిజర్వ్డ్ టికెట్లతో సహా ప్రతిరోజూ 10 – 12 లక్షల టికెట్లను విక్రయిస్తుంది. పది పైసలు సెస్ ద్వారా ప్రతిరోజూ సుమారు రూ. 1.2 లక్షలు.. ఏడాదికి సుమారు 4.38 కోట్లు సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నిధులు కూలీలకు పీఎఫ్, పింఛన్, సామూహిక బీమా తదితర సదుపాయాల కల్పనకు సరిపోతాయని భావిస్తోంది. సెస్ ద్వారా కూలీలకు సామాజిక రక్షణ పథకాలు వర్తింప జేయాలని గత నెల 19న బెంగళూరులో జరిగిన సీబీటీ సమావేశంలో ప్రతి పాదించారు. రాబోయే బడ్జెట్లో సెస్ విధింపు ప్రకటన ఉండవచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ ఆశాభావంతో ఉంది. తేజస్ రైళ్లలో సంజీవ్ కపూర్ వంటకాలు ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న తేజస్ రైళ్లలో ప్రయాణికులకు పాకశాస్త్ర నిపుణుడు సంజీవ్ కపూర్ రూపొందించిన వంటకాలను వడ్డించనున్నారు. -
రూపాయికే స్పైస్‌జెట్ టికెట్!
హైదరాబాద్ : ఒక్క రూపాయి ఎయిర్ ఫేర్ ఆఫర్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చామని స్పైస్‌జెట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్లో భాగంగా లక్షకు పైగా వన్-వే టికెట్లను ఒక్క రూపాయికే(పన్నులు, ఫీజులు అదనం) ఆఫర్ చేస్తున్నామని స్పైస్‌జెట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ పేర్కొన్నారు. రౌండ్ ట్రిప్ విమాన టికెట్ల కొనుగోలుకు, ఒక వైపు రెగ్యులర్ చార్జీల కింద టికెట్లు కొనుగోలు చేసిన వారికి, ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. ఎంపిక చేసిన దేశీయ రూట్లలో నాన్ స్టాప్ విమాన సర్వీసులకే ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. తమ కొత్త మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేసే టికెట్లకే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు. నేటి (బుధవారం)నుంచి ప్రారంభమయ్యే ఈ ఆఫర్ శుక్రవారం అర్ధరాత్రి వరకూ అందుబాటులో ఉంటుందని, నేటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ప్రయాణాలకు వర్తిస్తుందని పేర్కొన్నారు. -
కేంద్రానికి స్పైస్‌జెట్ పునరుద్ధరణ ప్రణాళిక
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్..ప్రతిపాదిత 200 మిలియన్ డాలర్ల పెట్టుబడి ఆధారంగా పునరుద్ధరణ ప్రణాళికను కేంద్రానికి సమర్పించింది. స్పైస్‌జెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న మాజీ ప్రమోటరు అజయ్ సింగ్‌తో కలసి కంపెనీ సీఓఓ సంజీవ్ కపూర్ శుక్రవారం పౌర విమానయాన శాఖ కార్యదర్శి వి.సోమసుందరన్కి ప్రణాళికను అందజేశారు. సోమసుందరన్తో భేటీ నిర్మాణాత్మకంగా సాగిందని సమావేశం అనంతరం కపూర్ తెలిపారు. ప్రస్తుతం ఏ చమురు మార్కెటింగ్ కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలేమీ లేవని, మొత్తం 18 విమానాలతో రోజుకు 230 ఫ్లయిట్ సర్వీసులు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. పునరుద్ధరణ ప్రణాళిక వార్తలతో బీఎస్ఈలో స్పైస్‌జెట్ షేరు 9 శాతం పెరిగి రూ. 19.25 వద్ద ముగిసింది. అజయ్ సింగ్‌తో పాటు అమెరికా ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ చేజ్ సారథ్యంలోని ఫండ్ కూడా స్పైస్‌జెట్‌లో ఇన్వెస్ట్ చేస్తోంది. కంపెనీని గట్టెక్కించే దిశగా నెల రోజుల్లోగా 200 మిలియన్ డాలర్ల పెట్టుబడితో.. ప్రస్తుత ప్రమోటరు కళానిధి మారన్ నుంచి ఇన్వెస్టర్లు కొంత వాటా కొనుగోలు చేయనున్నారు. ఇందులో భాగంగా కంపెనీకి ఇప్పటికే రూ. 17 కోట్లు అందినట్లు.. చమురు కంపెనీలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వాటితోనే తీర్చినట్లు సమాచారం. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 మధ్యలో దేశీ, విదేశీ విక్రేతలు, ఎయిర్పోర్ట్ ఆపరే టర్లు, చమురు కంపెనీలకు స్పైస్‌జెట్ చెల్లించాల్సిన బకాయిలు రూ. 990 కోట్ల నుంచి రూ.1,230 కోట్లకు పెరిగాయి. విదేశీ వెండార్లకు కంపెనీ చెల్లించాల్సిన బకాయిలు రూ. 624 కోట్ల నుంచి రూ. 742 కోట్లకు పెరిగాయి. -
రుచుల సంజీవని
అన్ని దినుసులనూ ఎన్నుకొని, ఏరుకొని వండేవాడు కాదు... మిగిలిపోయిన దినుసులతో కూడా మరపురాని రుచులని అందించేవాడే వంటవాడంటే! ఆ నిర్వచనాన్నే రెసిపీగా మార్చి బ్రహ్మ వండిన వంట... సంజీవ్ కపూర్! 1-‘ఖానా ఖజానా’ ఎపిసోడ్ నంబర్ 255. పాలక్ కోఫ్తా... ఆరోజు వీక్షకుల కళ్లకు తినిపించబోయే వంటకం. పదహారు దినుసుల సమాహారం ఆ వంటకం. బాణలి తీసుకుని పని ప్రాంభించారు సంజీవ్. కావల్సిన దినుసులను కలుపుతుండగా ఒక ‘క్రియేటివ్ షాక్’ తగిలినట్టయి శరీరం అంతా అడ్రినలిన్ రష్! ఏమైందో కానీ, తనకు తెలియకుండానే టొమాటో గుజ్జుకి, లవంగాలు, కాజు, వెన్న, కాస్త చక్కెర వేసి, మఖ్నీ గ్రేవీ తయారు చేశాడు. అంతేకాదు, కాస్త తేనె, మెంతి ఆకులు వేసి పాలక్ కోఫ్తాను కొత్తగా మార్చేశాడు. ఆ తరువాత అదే అతని సిగ్నేచర్ డిష్‌గా పేరొందిన ‘షామ్ సవేరా’. మన మీద మనకు నమ్మకం ఉంటే చాలు. ఏం చేసినా గొప్ప కావ్యం అవుతుందని తెలుసుకున్నారు సంజీవ్! 2- కొలంబో విమానాశ్రయంలో తన బ్యాగేజ్ కోసం ఎదురు చూస్తున్నారు సంజీవ్. ఒక యువతి వచ్చి, తన కాళ్ల మీద పడింది. వెంటనే కంగారుగా పక్కకి జరిగి ఆ అమ్మాయిని పైకి లేపారు సంజీవ్. ‘‘నా జీవితాన్ని కాపాడారు మీరు’’ అంది ఆ అమ్మాయి. ఏమీ అర్థం కానట్టు చూస్తున్నారు సంజీవ్. ఆ అమ్మాయి ఏడుస్తూ ‘‘సార్! నాకు పెళ్లయి చాలా ఏళ్లయింది. నాకు వంట చేతకాదని మా అత్తగారింట్లో ప్రతిరోజూ తిట్లు, చీవాట్లే. మీకు చిన్న విషయంలా అనిపించొచ్చు కానీ కుమిలి కుమిలి ఏడ్చేదాన్ని. తరువాత టీవీలో మీ కార్యక్రమాలు, మీ పుస్తకాలు చూసి వంట నేర్చుకున్నాను. మీరు చెప్పినట్టుగా నేను చేసిన వంటలు మా ఇంట్లో వాళ్లకు ఎంతో నచ్చాయి. ఇప్పుడు నన్ను వారు చాలా బాగా చూసుకుంటున్నారు. అంతేకాదు... పెళ్లైన తరువాత మా ఆయన నన్ను మొదటిసారి హనీమూన్‌కు తీసుకెళ్తున్నారు’’ అని చెప్పింది. అంతే... ఇన్నాళ్ళ తన శ్రమకు ప్రతిఫలం దొరికినట్లయింది సంజీవ్‌కు. 3- ‘‘ఆహారంలో రుచికరమైన పదార్థాలే కాదు.. ఎంతో ప్రేమ, అంకితభావం కలగలిపి వండుతారు. అలా వండిన వంట మిగిలిపోయినా, ఎక్కువై పారేసినా అది కేవలం ఆహారాన్ని వృథా చేయడం కాదు, ప్రేమను వ్యర్థం చేయడం. ప్రేమను డస్ట్‌బిన్‌లో పారేయడమే!’’ అని నమ్ముతారు సంజీవ్. తన హోటల్లో కస్టమర్ అయినా, ఇంట్లో తన కూతురు రచిత గబగబ తిని వదిలేసిన చపాతీ ముక్కలైనా సరే... మిగులు చూస్తే దిగులు ఆయనకి! ఊరుకోకుండా ఉండలేక, ఆ ముక్కలను తీసుకుని, కాస్త అల్లం, వెల్లుల్లి దట్టించి, సాస్, మిరియాలు, చీజ్ వేసి చపాతీలు ఎన్నడూ చరిత్రలో చూడని ‘చపాతీ లసాన్యా’ను తయారుచేశారు. 4- ‘‘సార్! మీ వంటకాలన్నింటినీ ఒక పుస్తకంగా వెయ్యచ్చు కదా?’’ పార్టీలో కలిసిన ఒక ఆవిడ సంజీవ్‌తో అన్న మాటలివి. ‘‘ఎందుకమ్మా! అన్ని వంటలనీ నేనే ఫ్రీగా టీవీలో చేసి చూపిస్తున్నాను కదా! మళ్లీ కొత్తగా పుస్తకం ఎందుకు? మీకు డబ్బులు దండగ’’ అని నవ్వారు సంజీవ్. కానీ ఇలా ఎన్నో రిక్వెస్టులు వచ్చాయి. ఎప్పుడూ వంట చేయనివాడు మొదటిసారి గరిటె పడితే, అతనికి వచ్చే సందేహాలన్నీ ముందుగానే ఊహించి, వాటిని నివృత్తి చేస్తూ తన మొదటి పుస్తకం ‘ఎనీ టైమ్ టెంప్టేషన్స్’ని సంజీవ్ రాశారు. అది మొదలు పుస్తకాలు రాస్తూనే ఉన్నారు. ‘హౌ టు కుక్ ఇండియన్’ అనే ఆయన రచన ఏకంగా కోటికి పైగా కాపీలు అమ్ముడైంది. 5- లైఫ్ అనేది ఒక డిష్ లాంటిది. అందులో ముఖ్యమైనది... అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవటమే. మానవత్వం, స్వ చైతన్యం, ఆశయాలను... ఒడుదొడుకుల్లో ఉడకపెట్టి, కష్టాలతో మగ్గబెట్టి, సుఖాలను టాపింగ్స్‌గా చేసిన మిశ్రమ ఆశ్రమమే జీవితమనే వంట. అనుకున్నవన్నీ జరగవు. అందుకే ఎవరూ జరగదనుకున్నదాన్ని జరిపించి చూపించు. చేసే పని పాతదే అయినా, చెయ్యడం కొత్తగా చెయ్యి! జీవితంలో ఏం కోల్పోయినా ‘నిన్ను నువ్వు కోల్పోకు, కోల్పోనివ్వకు, అదే నిన్ను నడిపిస్తుంది’. వంట గదిలోనే మగ్గిపోతున్న చెఫ్‌లను బయటకు తీసుకొచ్చి, చెఫ్గిరీని మార్కెట్‌కి పరిచయం చేసి, భారతీయ వంటకానికి ప్రపంచ స్థాయిలో ముఖచిత్రంగా మారిన సంజీవ్ జీవిత నిర్మాణంలో తెలుసుకున్నవి, తెలియజేసినవి ఇవే. కొన్ని కోట్ల మంది ప్రేమను కడుపారా నింపుకుంటుండగా, అలసిపోయిన గరిటె తడి మెరుపులో నవ్వుతుంది సంజీవ్‌కపూర్ ప్రతిబింబం. - జాయ్ -
మైక్రోమ్యాక్స్.. విండోస్ మొబైల్ ఫోన్లు
న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ కంపెనీ విండోస్ 8.1 ఓఎస్‌పై పనిచేసే తొలి మొబైల్ ఫోన్లను సోమవారం ఆవిష్కరించింది. కాన్వాస్ విన్ డబ్ల్యూ121(ధర రూ.9,500), కాన్వాస్ విన్ డబ్ల్యూ092(ధర రూ.6,500)- ఈ రెండు ఫోన్లు డ్యుయల్-సిమ్ ఫోన్లని కంపెనీ చైర్మన్ సంజీవ్‌కపూర్ చెప్పారు. వచ్చే నెల నుంచి వీటి విక్రయాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ రెండు ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ సీపీయూ, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి ఫీచర్లున్నాయని వివరించారు. 5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే ఉన్న కాన్వాస్ డబ్ల్యూ121లో 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. ఇక కాన్వాస్ విన్ డబ్ల్యూ 092లో 4-అంగుళాల ఐపీఎస్ డిస్ప్లే, 1,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 0.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. తొలి దేశీయ కంపెనీ..: స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో భారత్‌లో రెండో స్థానంలో ఉన్న మైక్రోమ్యాక్స్ కంపెనీ ఇప్పటివరకూ గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌పై ఫోన్లను అందిస్తోంది. మొదటి స్థానంపై కన్నేసిన మైక్రోమ్యాక్స్ కంపెనీ విండోస్ ఓఎస్ ఆధారిత మొబైళ్లను అందుబాటులోకి తెస్తోంది. ఈ ఓఎస్‌పై పనిచేసే మొబైళ్లను తయారు చేసిన మొదటి దేశీయ కంపెనీగా మైక్రోమ్యాక్స్ అవతరించింది. ఇప్పటికే విండోస్ ఓఎస్ ఆధారిత ఫోన్లను నోకియా, హెచ్‌టీసీ, ఎల్జీ, డెల్‌లు తయారు చేస్తున్నాయి. -
చాక్లెట్ పుడ్డింగ్ కేక్
-
పీనట్ బటర్ చాక్లెట్ స్క్వేయర్
-
దహి మేథీ ముర్గ్
-
స్ట్రాబెర్రికి ఫిర్నీ
-
పోహా విత్ మిక్స్డ్ స్ప్రౌట్స్
-
లస్సీ
-
పటియాల చికెన్
-
పనీర్ మిర్చ్ దో ప్యాజా
-
చాక్లెట్ అండ్ ప్రూట్ కేక్
-
బ్రౌన్ రైస్ పులావు
-
బ్రేక్ ఫాస్ట్ రోల్స్
-
టెండర్ కోకోనట్ శికంజి
-
పిస్తేవాలా దలియా
-
మేథీ చమన్
-
మీఠో లోలో
-
సేయాల్ మానీ
-
సింధి కడి
-
ఫిష్ కొషమ్ము
-
అరటికాయ కూర
-
కోకోనట్ పరిప్పు పాయసం.
-
చైనీస్ పాప్‌కార్న్ ప్రాన్స్
-
లెమన్ కొరియాండర్ సూప్ విత్ స్వీట్ కార్న్
-
లెమన్ పెప్పర్ పాస్తా
-
క్విక్ చికెన్ టిక్కా
-
కుకీ ఐస్ క్రీమ్
-
మష్రూమ్ మెల్బా
-
కడాయి చికెన్
-
చింగ్రీ మలై కర్రీ
-
ఆలూ భాజ
-
గ్రిల్డ్ ప్రూట్స్
-
పీనట్ బటర్ నూడుల్స్
-
రోస్టెడ్ ప్రాన్ సలాడ్
-
స్వీట్ అండ్ సోర్ బీన్ కర్డ్
-
వార్మ్ బనానా కస్టర్డ్
-
పొటాటో ఆమ్లెట్
-
వెజిటెబుల్ ఉప్మా
-
గ్రీన్ కర్రీ
-
ఐస్డ్ మోకా కాఫీ
-
బేక్డ్ ఛీజ్ కేక్
-
చికెన్ స్టీవ్
-
త్రీ చిల్లీ పొటాటో సలాడ్
-
క్రిస్పీ ఫిష్ ఫింగర్స్
-
గాజర్ కా మురబ్బా
-
చొకొనట్ బనానాస్
-
టొమాటో ఎగ్ డ్రాప్ సూప్
-
చింగ్రీ మలై కర్రీ
-
కడాయి చికెన్
-
ఆలూ బాజా
-
లెజిజ్ హండి
-
లాహోరీ స్టైల్ ఆలూ
-
చావల్ కీ పరోటా
-
కార్న్ అండ్ బూందీ రైతా
-
స్వీట్ పొటాటో క్రిస్ట్స్
-
స్పైసీ కర్రీ లీఫ్ సూప్
-
పీచ్ బ్రులీ
-
డీప్ ప్యాస్ పిజా
-
టమాటో ఛట్నీ
-
కోకోనట్ ఎగ్ కర్రీ
-
ఎగ్ ప్లాంటే అండ్ పన్నీర్ కబాబ్స్
-
ప్లేవర్డ్ ఆలివ్స్
-
స్వీట్ కార్న్ బేక్డ్ వెజ్ టెబుల్స్
-
ఆలూ తుక్
-
ఎగ్ ప్లాంట్ చిల్లి గార్లిక్
-
స్పైసీ చికెన్ వింగ్స్
-
బేక్డ్ ఫిష్
-
ఛాక్లెట్ కోటెడ్ మ్యాంగో
-
ఇమ్లీ బుట్టా
-
మ్యాంగో చీస్ కేక్ విత్ ఓట్స్
-
స్రింప్ అండ్ ఎగ్ స్టిక్ ప్రై
-
డెవిల్డ్ ఎగ్స్
-
ఆల్మండ్ అండ్ విజిటెబుల్ సూప్
-
మేంగో పాపా దోయి