
రూపాయికే స్పైస్‌జెట్ టికెట్!
హైదరాబాద్ : ఒక్క రూపాయి ఎయిర్ ఫేర్ ఆఫర్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చామని స్పైస్‌జెట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్‌లో భాగంగా లక్షకు పైగా వన్-వే టికెట్లను ఒక్క రూపాయికే(పన్నులు, ఫీజులు అదనం) ఆఫర్ చేస్తున్నామని స్పైస్‌జెట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ పేర్కొన్నారు. రౌండ్ ట్రిప్ విమాన టికెట్ల కొనుగోలుకు, ఒక వైపు రెగ్యులర్ చార్జీల కింద టికెట్లు కొనుగోలు చేసిన వారికి, ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. ఎంపిక చేసిన దేశీయ రూట్లలో నాన్ స్టాప్ విమాన సర్వీసులకే ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు.
తమ కొత్త మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేసే టికెట్లకే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు. నేటి (బుధవారం)నుంచి ప్రారంభమయ్యే ఈ ఆఫర్ శుక్రవారం అర్ధరాత్రి వరకూ అందుబాటులో ఉంటుందని, నేటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ప్రయాణాలకు వర్తిస్తుందని పేర్కొన్నారు.