మిలియనీర్, బిలియనీర్ కావాలంటే అంతే స్థాయిలో పెట్టుబడులు కావాలి..బడా పారిశ్రామిక వేత్తో కావాలి అని అనుకుంటాం సాధారణంగా. కనీసం ఏ ఐఐటీ లేదా ఐఐఎం డిగ్రీ సాధించి పెద్ద కంపెనీలో కీలక ఎగ్జిక్యూటివ్‌గా ఉండాలి అనుకుంటాం. కానీ ఇవేమీ లేకుండానే రూ. 750 కోట్ల సంస్థకు అధిపతి అయ్యాడు. ఆయన మరెవ్వరో కాదు ఇండియన్ టాప్ రిచెస్ట్ చెఫ్ సంజీవ్ కపూర్. ఆయన సక్సెస్ స్టోరీ ఒకసారి చూద్దాం.
ఇండియాలోనే కాదు ప్రపంచంలోని అత్యంత ధనిక చెఫ్‌లలో ఒకడిగా మరతానని బహుశా సంజీవ్ కపూర్ ఊహించి ఉండరు. పలు రకాల రెసిపీలతో మొదలు పెట్టి, టాప్ చెఫ్‌గా, హోస్ట్‌గా, రైటర్‌గా చివరికి వ్యాపారవేత్తగా గ్లోబల్‌గా పాపులర్ అయ్యాడు.1992లో ఒక టీవీ షో హోస్ట్ చేయడం ప్రారంభించి 18 సంవత్సరాలు నడిపించిన ఘనత ఆయకే సొంతం. సోషల్‌మీడియాలో మిలియన్ల కొద్దీ ఫోలోవర్లున్నారు.
Bahut logon ne mujhe poocha ki millets ki quality kaise check karte hai, store kaise karte hai? Isiliye the next stop on our #MilletKhazana journey is easy tips and tricks to store millets. Do let me know how you store them at home?#MilletKhazana #MilletToMeals #India #Millets pic.twitter.com/rE7NhrCckE
— Sanjeev Kapoor (@SanjeevKapoor) June 3, 2023
అంతేకాదు 120 దేశాలలో ప్రసారమై 2010లోనే 500 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం విశేషం. జనవరి 2011లో ఫుడ్ ఫుడ్ అనే 24 గంటల ఫుడ్ అండ్ లైఫ్ స్టయిల్ ఛానెల్‌ని ప్రారంభించిన ప్రపంచంలోనే తొలి చెఫ్. సంజీవ్ కపూర్ హోస్ట్ చేసిన ఖానాఖజానా ఇండియన్ టెలివిజన్ అకాడమీ (ITA) ఇండియన్ టెలీ అవార్డ్స్ నుండి బెస్ట్ కుకరీ షో బహుమతిని పలుమార్లు అందుకుంది. (ఆషాఢంలో శుభవార్త: తగ్గుతున్న బంగారం,వెండి ధరలు)
పంజాబ్, అంబాలాలో 1964 ఏప్రిల్ 10, సంజీవ్ కపూర్ పుట్టారు. న్యూ ఢిల్లీలోని పూసాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాటరింగ్ అండ్ న్యూట్రిషన్ నుండి హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా పూర్తి చేశాడు. అలియోనా కపూర్‌ను వివాహం చేసుకున్నాడు. 1984లో తన వృత్తిని ప్రారంభించి అద్భుతమైన రెసిపీలు, చక్కటి వాచకం, అంతకుమించిన యాంకరింగ్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. వండర్‌చెఫ్ అనే కంపెనీని స్థాపించాడు. ఈ సంస్థ ఆదాయం గత ఏడాది రూ. 700 కోట్లు. అంతకుముందు ఏడాది కంపెనీ రూ.560 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కంపెనీ విస్తరణ ప్లాన్‌లో భాగంగా మార్కెటింగ్‌ను పెంచడానికి కంపెనీ 100 కోట్ల రూపాయలపెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. 40 శాతం విదేశీ పెట్టుబడిదారులున్నారు.
సంజీవ్ కపూర్ ఇండియాతోపాటు, ఇతర పలు దేశాల్లో రెస్టారెంట్స్ చెయిన్స్‌ను నిర్వహిస్తున్నారు. సోడెక్సో మాజీ సీఈవోతో కలిసి 1998లో దుబాయ్‌లో ప్రముఖ ఫుడ్ బ్రాండ్ ద్వారా వ్యాపారవేత్తగా అవతరించాడు. ఈ కంపెనీ విలువ రూ.750 కోట్లు. వంటగది ఉపకరణాలు, ఇతర వంటగది సామాగ్రిని 14 దేశాల్లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. (థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ)
వార్షిక సంపాదన
2022లోనే సంజీవ్ కపూర్ నికర విలువ రూ. 1000 కోట్లుగా ఉంది. వార్షిక సంపాదన రూ. రూ. 25 కోట్లు. వండర్ చెఫ్‌లో అతని పెట్టుబడి, ఎల్లో చిల్లీ వంటి రెస్టారెంట్ చెయిన్‌ల నుండి, టీవీ షోలు బ్రాండ్ స్పాన్సర్‌షిప్‌లతోపాటు, స్వయంగా అతనురాసిన అతని పుస్తకాల అమ్మకం ద్వారా వచ్చిన రాయల్టీలు ఇవన్నీ ఇందులో భాగం. బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలోని బ్రాండ్‌లలో ఏరియల్, డెట్టాల్, దావత్ బాస్మతి రైస్, స్లీక్ కిచెన్ లాంటివి ఉన్నాయి. ప్రతి బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం రూ. 30 రూ. 40 లక్షలు చార్జ్ చేస్తాడు. దీనితోపాటు సంజీవ్ కపూర్ ముంబైలోని జుహు ప్రాంతంలో ఒక సంపన్నమైన ఇంటిలో నివసిస్తున్నారు. 1500 చదరపు అడుగులు డ్యూప్లెక్స్‌లో ఉంటారు. స్టాటిస్కా రిపోర్ట్ ప్రకారం 2019లో 24.8 కోట్ల ఆదాయంతో కపూర్ భారతదేశంలో అత్యంత ధనిక చెఫ్‌గా నిలిచారు. (వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో)
ప్రేమ వివాహం
1992లో సంజీవ్ కపూర్ తన ప్రేయసి అలియోనాను వివాహమాడాడు. సంజీవ్, వందన కలిసి ఢిల్లీ ఐటీడీసీ హోటల్‌లో పనిచేసేవారు. కానీ ఎపుడూ కలుసుకోలేదు. అయితే అనుకోకుండా ఒకసారి రైలులో జరిగిన వీరి పరిచయం ప్రేమగా మారింది. నాలుగేళ్ల డేటింగ్ తరువాత పెళ్లి చేసుకున్న జంటకు ఇద్దరు కుమార్తెలు న్నారు. పెద్ద కూతురు రచిత. చిన్న కూతురు కృతి. (టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?)
అవార్డులు
2017లో భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు
న్యూ ఢిల్లీలోని వరల్డ్ ఫుడ్ ఇండియాలో 918 కిలోల ఖిచ్డీని వండి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (2017)
హార్వర్డ్ అసోసియేషన్ ప్రచురించిన సంజీవ్ కపూర్‌పై కేస్ స్టడీ
ఐటీఏ అవార్డు - పాపులర్ చెఫ్ & ఎంటర్‌ప్రెన్యూర్ (జైకా-ఇ-హింద్) (2015)
ఐటీఏ అవార్డు ఉత్తమ వంట (ఖానా ఖజానా) (2010, 2004, 2002)
భారత ప్రభుత్వ 'బెస్ట్ చెఫ్ ఆఫ్ ఇండియా' జాతీయ అవార్డు
ఇండియా అత్యంత విశ్వసనీయ వ్యక్తులలో 100 మంది రీడర్స్ డైజెస్ట్ జాబితాలో 31వ స్థానం
ఫోర్బ్స్ 'టాప్ 100 భారతీయ ప్రముఖుల జాబితాలో 34వ స్థానం
Comments
Please login to add a commentAdd a comment