ప్రతిభావంతులైన, ఔత్సాహికులైన యువతకు ప్రస్తుతం భారత్‌కు మించిన మెరుగైన ప్రదేశం మరొకటి లేదు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు.. యూట్యూబ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఇషాన్ ఛటర్జీ.
ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి అయిన ఇషాన్ ఛటర్జీ గత సంవత్సరం యూఎస్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు. హెచ్‌పీఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇటీవల హైదరాబాద్ వచ్చారు. ఎన్‌డీటీవీతో పలు విషయాలు వెల్లడించారు. భారత్‌లో రాబోయే 10 సంవత్సరాలు అద్భుతంగా ఉండబోతున్నాయన్నారు. భారత్ అత్యంత వైవిధ్యమైన, డైనమిక్ ఉత్తేజకరమైన మార్కెట్ అని పేర్కొన్నారు. భాషతో సంబంధం లేకుండా దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన కంటెంట్ క్రియేటర్లకు సైతం యూట్యూబ్ వేదికను కల్పించిందన్నారు.
ఇషాన్ ఛటర్జీ పాఠశాల విద్యాభ్యాసం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో సాగింది. ఢిల్లీలోని సెయింట్ స్టీపెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ చేసిన ఆయన అమెరికాలోని వార్టన్ స్కూల్ యూనివర్సిటీ నంచి ఎంబీఏ పూర్తి చేశారు. యూట్యూబ్‌కు ముందు ఇషాన్ ఛటర్జీ గూగుల్, మెకెన్సీ కంపెనీల్లో పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment