యూట్యూబ్! వీడియో విభాగంలో ఓ సెన్సేషన్. 2005 ప్రారంభమై ఎంటర్‌టైన్మెంట్ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతోంది. డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌లో గేమ్‌ఛేంజర్‌గా మారిన యూట్యూబ్ లక్షలాది కంటెంట్ క్రియేటర్లకు ఆదాయ వనరుగా మారింది. వారి ఎదుగుదలకూ తోడ్పడుతోంది.
సబ్‌స్క్రైబర్లు, లైక్స్, వ్యూస్ ఆధారంగా డిజిటల్ వరల్డ్‌లో ఏ యూట్యూబ్ ఛానల్ అగ్రస్థానంలో ఉందో గుర్తించవచ్చు. అయితే ఎప్పటిలాగే తొలి టాప్‌టెన్ యూట్యూబ్ ఛానల్స్ వివరాల్ని ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ప్రపంచంలో మిగిలిన దేశాల యూట్యూబ్ ఛానల్స్‌తో పోలిస్తే భారత్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్స్ యూజర్లను ఆకట్టుకోవడంతో సబ్‌స్క్రైబర్ లాయల్టీ పరంగా అగ్రస్థానాన్ని సంపాదించాయి.
ఫోర్బ్స్ ఇండియా ప్రకారం..భారత్‌లోని మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ టీ సిరీస్ అగస్థానాన్ని సంపాదించుకుంది. శ్రోతల్ని ఆకట్టుకునే సంగీతంతో పాటు, ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడంతో ప్రపంచంలో అత్యధికంగా సబ్‌స్క్రయిబ్ చేసుకున్న టాప్ 10 యూట్యూబ్ ఛానెల్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. టీ సిరీస్ తర్వాత మిగిలిన ఛానల్స్ ఉన్నాయి.
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబ్ ఛానెల్స్ జాబితా ప్రకారం..
టీ-సిరీస్: ప్రపంచంలోనే నంబర్ వన్ యూట్యూబ్ ఛానెల్ 257 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది. భారతదేశంలోని అతిపెద్ద మ్యూజిక్ లేబుల్, మూవీ స్టూడియో యాజమాన్యంలో వారి ఛానెల్‌లో మ్యూజిక్ వీడియోలు, సినిమాలు, ట్రైలర్‌లతో సహా ఇతర ఎంటర్ టైన్‌మెంట్ వీడియోల్ని ఇందులో వీక్షించవచ్చు.
మిస్టర్ బీస్ట్: జిమ్మీ డొనాల్డ్‌సన్ అమెరికన్ యూట్యూబర్. మిస్టర్‌బీస్ట్‌గా ప్రసిద్ధి చెందారు. సాహసాలూ, వింత స్టంట్లూ చేస్తూ నడుపుతున్న ఈ ఛానల్‌కు సబ్‌స్క్రైబర్ల సంఖ్య సుమారు 232 మిలియన్లకు పైగా.. ఆదాయం వందల కోట్లే
కోకోమెలన్ : ఈ అత్యంత ప్రజాదరణ పొందిన ఛానెల్ 3డీ యానిమేటెడ్ నర్సరీ రైమ్‌లు, పిల్లల పాటల వీడియో కంటెంట్‌ను అందిస్తుంది. ఈ ఛానెల్‌కు 170 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.
సెట్ ఇండియా (సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్): భారతదేశంలో సెట్ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్ ఉంది. హిందీలో కంటెంట్‌ను అందిస్తుంది. ఈ ఛానెల్‌కు 167 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.
కిడ్స్ డయానా షో: ఆన్‌లైన్‌లో కిడ్స్ డయానా షో అని పిలువబడే ఎవా డయానా కిడిస్యుక్. ఆమె, అమె కుటుంబ సభ్యులు కలిసి ఈ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. 118 మిలియన్ల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు.
ప్యూడైపీ : స్వీడిష్ యూట్యూబర్ ఫెలిక్స్ కెజెల్‌బర్గ్ నిర్వహించే ప్యూడైపీ అత్యంత ప్రజాదరణ పొందిన ఛానెల్‌లలో ఒకటి. ఇందులో 111 మిలియన్ల మంది సబ్‌స్కైబర్లు ఉండగా.. 4,747 వీడియోల్ని అప్‌లోడ్ చేశారు.
లైక్ నాస్త్య: ది లైక్ నాస్త్య యూట్యూబ్ ఛానెల్ అనేది నాస్త్య అనే యువతి, ఆమె కుటుంబ సభ్యులతో పిల్లలకు ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోల్ని అందిస్తుంటుంది. దీనికి 112 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.
వ్లాడ్ అండ్ నికి: ఈ అత్యంత ప్రజాదరణ పొందిన ఛానెల్ ఇద్దరు అన్నదమ్ములు నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్‌కు 108 మిలియన్ల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు.
జీ మ్యూజిక్ కంపెనీ: ప్రధానంగా హిందీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఆఫర్‌లతో, జీ మ్యూజిక్ కంపెనీ యూట్యూబ్ ఛానెల్ 104 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది.
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్: డబ్ల్యూడబ్ల్యూఈ యూట్యూబ్ ఛానెల్‌కు 99 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు, 73 వేల వీడియోలు ఉన్నాయి. ఇందులో రెజ్లింగ్ వీడియోల్ని వీక్షించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment