
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్‌లో శుక్రవారం సజ్జనార్ ఎండీగా బాధ్యతలు చేపట్టారు.
సజ్జనార్ అంతకుముందు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. మూడేళ్ల పాటు సైబరాబాద్ సీపీగా పని చేసి నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నారు. 2009లో దేశంలోనే సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసులో సజ్జనార్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సజ్జనార్ గతంలో సీఐడీ, ఇంటిలిజెన్స్ విభాగాల్లో పని చేశారు.
చదవండి: లవ్ మ్యారేజ్ జంట మూడు నెలలకే తట్టుకోలేక..
చదవండి: కలెక్టరేట్‌లో గన్‌మెన్‌గా భర్త.. రోడ్డుపై విగతజీవిగా భార్య
Comments
Please login to add a commentAdd a comment