డాక్టర్ శశికుమార్ సోదరుడు రవి
సిటీబ్యూరో: తన సోదరుడు డాక్టర్ శశికుమార్ ఇప్పటికే రెండు ఆస్పత్రుల్లో ఉన్నత పదవుల్లో ఉన్నాడని... అలాంటప్పుడు లారెల్ హాస్పిటల్స్‌లో ఎమ్‌డీ కావాలని ఎందుకు గొడవ పడతాడని మృతుడి సోదరుడు, ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ పైలట్ రవి అన్నారు. ఈ గొడవకు మరేదో కారణం ఉండొచ్చని... కేసు వెనుక ఉన్న మిస్టరీని పోలీసులు ఛేదించాల్సిన అవసరముందన్నారు. చైతన్యపురి ప్రభాత్‌నగర్‌లోని నివాసంలో ‘సాక్షి ’ మీడియాతో గురువారం మాట్లాడారు. ముగ్గురు మంచి మిత్రుల మధ్య ఇటువంటి గొడవ జరుగుతుందని ఎన్నడూ ఊహించలేదన్నారు. ఇప్పటి వరకు అటువైపు కుటుంబాల నుంచి తమకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదని తెలిపారు.
హిమాయత్‌నగర్‌లో గలాటా జరిగిన వెంటనే చంద్రకళ వద్దకు శశికుమార్ వెళ్లడం... ఆమె మెయినాబాద్‌లోని నక్కలగుట్ట ఫాంహౌస్‌లో దింపడం... ఇంటికి వచ్చి టీవీలో వార్తలు చూశాక పంజగుట్ట పోలీసుల వద్దకు వెళ్లడం... ఇదంతా చూస్తుంటే ఏదో జరిగిందన్న అనుమానం ఉందన్నారు. పదేళ్లుగా చంద్రకళ స్నేహితురాలిగ తెలుసని...వృత్తిపరంగా ఎలాంటి లావాదేవీలు లేవన్నారు. శశికుమార్ పేరుమీద ఆ ఫామ్‌హౌస్ ఉందని వస్తున్న వదంతులు వాస్తవం కాదన్నారు. గురువారం ఉదయం నారాయణగూడ పోలీసులు పిలిస్తే... వెళ్లి కారు, బ్రీఫ్‌కేసు తీసుకొచ్చామన్నారు. బ్లాక్ కలర్ షర్ట్ లేదు. పోస్టుమార్టం నివేదిక ఇప్పటివరకు అందలేదన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి తమ కుటుంబానికి న్యాయం చేస్తారని అనుకుంటున్నామని తెలిపారు.
ఎమ్‌డీ కోసం గలాటా కాదు...
Published Fri, Feb 12 2016 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM