
సాక్షి, ముంబై: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఇండియా ఎట్టకేలకు ఇండియా హెడ్‌నునియమించింది. హాట్‌స్టార్ వ్యవప్థాపకుడు అజిత్ మోహన్‌ను ఎండీ, వైస్ ప్రెసిడెంట్‌గా నియమించినట్టు ఫేస్‌బుక్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఆరంభంలో మోహన్ ఫేస్‌బుక్ ఇండియాలో కొత్త బాధ్యతలను చేపట్టనున్నారు. ఉమాంగ్ బేడీ ఫేస్‌బుక్‌ను వీడిన సంవత్సరం తరువాత ఈ నియామకాన్ని చేపట్టింది.
కాగా నకిలీ వార్తలు, డేటా చోరీపై ఎదుర్కొంటున్న ఆరోపణలు, ఒత్తిడి నేపథ్యంతో అజిత్ మోహన్ బాధ్యతలు కీలకంగా మారనున్నాయి. ఏప్రిల్ 2016 నుండి, స్టార్ ఇండియాకు చెందిన ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫాంకు హాట్‌స్టార్‌కు అజిత్ సీఈవోగా పనిచేశారు.