సాక్షి న్యూఢిల్లీ: భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా (ఎండీ) అన్షులా కంత్ నియమితులయ్యారు. ఆమె నియామకాన్ని ప్రభుత్వం శుక్రవారం ఖరారు చేసింది. ఐడీబీఐ సీఎండీగా అదనపు బాధ్యతల నేపథ్యంలో బి.శ్రీరామ్ జూన్30న రాజీనామా చేసారు. ఆయన స్థానంలో అన్షులా బాధ్యతలను చేపట్టనున్నారు. 2020 వరకు సెప్టెంబరువరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారని క్యాబినెట్ నియామకాల కమిటీ ఒక ప్రకటనలో తెలియ జేసింది.
కాగా అన్షులా కంత్ ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టరు, సీఎఫ్‌వోగా సేవందిస్తున్నారు. ఢిల్లీ లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ వుమెన్ నుంచి అర్ధశాస్త్రంలో పీజీ చేసిన ఆమె 1983లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్‌బీఐలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. రిటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ క్రెడిట్, క్రాస్-బోర్డర్ ట్రేడింగ్ మరియు అభివృద్ధి చెందిన మార్కెట్లలో బ్యాంకింగ్ (రీటైల్ అండ్ హోల్‌సేల్) రంగాల్లో విస్తృతమైన అనుభవం ఉన్న అన్షులా మూడు దశాబ్దాల పాటు ఎస్‌బీఐలో అనేక కీలక బాధ్యతలను సమర్ధవంతంగా నిర‍్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment