Sandeep Bakshi
-
ఐసీఐసీఐ బ్యాంక్ పగ్గాలు మళ్ళీ అతనికే - ఆర్బీఐ ఆమోదం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఐసీఐసీఐ బ్యాంక్ ఎండి అండ్ సీఈఓ 'సందీప్ భక్షి' (Sandeep Bakhshi)ని మరో మూడేళ్లపాటు కొనసాగడానికి ఆమోదం తెలిపింది. దీంతో ఈయన 2023 అక్టోబర్ 04 నుంచి 2026 అక్టోబర్ 03 వరకు ఆ పదవిలో ఉంటారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, 2023 ఆగష్టు 30న జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో షేర్హోల్డర్లు ఆమోదించినట్లు తెలిసింది. 2018లో చందా కొచ్చర్ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత సందీప్ భక్షి సీఈఓగా నియమితుడయ్యాడు. అప్పటి నుంచి బక్షి బ్యాంకుని అగ్రస్థానంలో నిలపడానికి అహర్నిశలు కృషి చేసాడు. ఇదీ చదవండి: సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్! ధర రూ. 3.47 లక్షలు - ఇది కదా కావాల్సింది! సందీప్ భక్షి నాయకత్వంలో ఐసీఐసీఐ బ్యాంక్ గొప్ప విజయాలను సాధించగలిగింది. 1986 నుంచి ఐసీఐసీఐ గ్రూపుతో మంచి సంబంధాలున్న భక్షి 2022లో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సురెన్స్ ఎండి అండ్ సీఈఓ పదవిని, 2010 నుంచి 2018 వరకు ఐసీఐసీఐ ఫ్రడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండి, సీఈఓ పదవిని చేపట్టాడు. కాగా 2018 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఎండి అండ్ సీఈఓగా కొనసాగుతున్నాడు. -
ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా?
ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో సందీప్ భక్షి దేశంలో అత్యధికంగా వేతనాలు పొందే బ్యాంకర్లలో ఒకరు. ఐసీఐసీఐ బ్యాంకును సంక్షోభాల నుంచి బయటకు తీసిన ఘనత ఆయనది. ఆయనకు ముందున్న చందా కొచ్చర్ ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలతో రాజీనామా చేయడం తెలిసిందే. 2018లో బ్యాంకు పగ్గాలు చేపట్టిన సందీప్ భక్షి.. ఐదేళ్లలోనే మళ్లీ వృద్ధి పథంలోకి తీసుకొచ్చారు. ఇదీ చదవండి: ఆఫీస్‌కు రావద్దు.. ఇంట్లో హాయిగా నిద్రపోండి.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్! సందీప్ భక్షి బాధ్యతలు స్వీకరించినప్పుడు బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు విలువ రూ. 313.35. అది మార్చి 16 నాడు రూ. 825 వద్ద ముగిసింది. దీంతో ఇన్వెస్టర్లు బ్యాంక్ మేనేజ్మెంట్పై విశ్వాసం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన హయాంలో ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 5.74 లక్షల కోట్లకు పెరిగింది. కంపెనీ పబ్లిక్‌గా ట్రేడ్ చేసిన అన్ని షేర్ల మొత్తం మార్కెట్ విలువను మార్కెట్ క్యాప్‌గా వర్ణిస్తారు. ఇంజినీర్ నుంచి బ్యాంకర్ సందీప్‌కు దాదాపు నాలుగు దశాబ్దాల కార్పొరేట్ అనుభవం ఉంది. చండీగఢ్ పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన ఆయన జంషెడ్‌పూర్‌లోని ప్రతిష్టాత్మక జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. 1986లో ఐసీఐసీఐలో చేరిన సందీప్‌భక్షి 2018లో ఆ బ్యాంకుకు ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన బ్యాంక్ హోల్‌టైమ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఎనిమిదేళ్లపాటు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌కు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పనిచేశారు. దానికి ముందు ఐసీఐసీఐ లాంబార్డ్‌కు ఆయన టాప్ ఎగ్జిక్యూటివ్. సంవత్సర జీతాన్ని వదులుకున్నారు.. 2022 ఆర్థిక సంవత్సరంలో సందీప్ భక్షి వార్షిక వేతనం రూ. 7.98 కోట్లు. అంటే నెలకు దాదాపు రూ. 65 లక్షలు. అయితే సందీప్‌లోని మరో కోణం అందరినీ ఆకట్టుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో ఆయన 2021 వార్షిక జీతాన్ని ఆయన వదులుకున్నారు. ఆర్భాటాలకు దూరంగా ఉండే ఆయన చాలా లోప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. -
సందీప్ బక్షి నియామకాన్ని ఆమోదించిన ఆర్బీఐ
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకుల సీఈఓ ఎంపిక విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ఎట్టకేలకు ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పదవికి ప్రతిపాదిత సందీప్ బక్షి నియామకాన్ని ఆమోదించింది. అయితే, బ్యాంకు బోర్డ్ ప్రతిపాదించిన 5 ఏళ్ల పదవీకాలాన్ని పక్కన పెట్టి.. వచ్చే మూడేళ్లు ఈయన బ్యాంకు ఎండీ, సీఈఓగా కొనసాగే విధంగా నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 15 (సోమవారం) నుంచి 3 ఏళ్లు పదవీకాలంతో ఈయన నియామకాన్ని ఆర్బీఐ ఆమోదించినట్లు బొంబే స్టాక్ ఎక్సే్ఛంజీకి అందించిన సమాచారంలో బ్యాంక్ వెల్లడించింది. అక్టోబర్ 3, 2023 వరకు ఈయన పదవీకాలంగా తెలియజేసింది. క్విడ్‌ప్రోకో ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచర్ స్థానంలో.. బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా బాధ్యతలు నిర్వహించిన సందీప్ బక్షిని ఎండీగా బోర్డు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. 1986లో సీఓఓగా బాధ్యతలు చేపట్టిన ఈయన.. అక్టోబర్ 4న చందా కొచర్ రాజీనామాతో నూతన పదవికి ఎంపికయ్యారు. తాజా నియామకం అనంతరం ఐసీఐసీఐ బ్యాంక్ షేరు మంగళవారం బీఎస్ఈలో 2.5 శాతం పెరిగి రూ.321 వద్ద ముగిసింది. -
చందా కొచర్ షాకింగ్ నిర్ణయం
ముంబై : ఐసీఐసీఐ బ్యాంక్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీ పదవికి చందా కొచర్ హఠాత్తుగా రాజీనామా చేశారు. వీడియోకాన్ రుణ వివాద కేసులో స్వతంత్ర విచారణ జరుగుతున్న నేపథ్యంలో అకస్మాత్తుగా ఆమె తన రాజీనామా లేఖను బ్యాంక్ మేనేజ్మెంట్కు పంపించారు. ఆమె అభ్యర్థనను బ్యాంక్ సైతం అంగీకరించింది. వీడియోకాన్ రుణాల కేసుల్లో చందా కొచర్‌పై తీవ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐసీఐసీఐ నుంచి రూ.3250 కోట్ల భారీ రుణాన్ని పొందిన వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్.. చందాకొచర్ భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్ రెన్యువబుల్స్ కంపెనీకి అనుచిత లబ్థి చేకూరేలా వ్యవహరించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన కంపెనీకి భారీ ఎత్తున రుణాన్ని మంజూరు చేసిన దానికి ప్రతిగా.. చందాకొచర్ భర్త కంపెనీలో రూ.64 కోట్ల మొత్తాన్ని ధూత్ పెట్టుబడిగా పెట్టినట్టు తెలుస్తోంది. దీన్ని క్విడ్ ప్రోగా సెబీ సైతం అభివర్ణిస్తోంది. ఈ ఉదంతంపై బోర్డు సైతం స్వతంత్ర విచారణకు ఆదేశించింది. ఈ విచారణ జరిగేంత వరకు ఆమెకు సెలవులు కూడా మంజూరు చేసింది. మరోవైపు ఆమె రాజీనామా చేయాలంటూ డిమాండ్లు కూడా వెల్లువెత్తాయి. దీంతో అకస్మాత్తుగా చందా కొచరే ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. చందా కొచర్ స్థానంలో సందీప్ భక్షిని సీఈవో, ఎండీగా ఐసీఐసీఐ బ్యాంక్ నియమించింది. ఆయన ఐదేళ్ల పాటు అంటే 2023 అక్టోబర్ 3 వరకు ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీ కొనసాగనున్నట్టు పేర్కొంది. అయితే కొచర్‌పై జరుగుతున్న ఈ విచారణకు ఈ రాజీనామా ప్రభావం చూపదని బ్యాంక్ పేర్కొంది. 1984లో కొచర్ ఐసీఐసీఐ బ్యాంక్‌లో చేరారు. మేనేజ్మెంట్ ట్రైనీగా చేరిన కొచర్, సీఈవో స్థాయికి ఎదిగారు. ఐసీఐసీఐ బ్యాంక్ అంటే అందరికి తొలుత గుర్తొచేది చందా కొచర్ పేరే. ప్రైవేట్ రంగంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఆమె అగ్రస్థానంలో నిలబెట్టారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ స్టాక్ 5.23 శాతం పెరగడం విశేషం. -
ఇంత జాప్యమా?
అవకతవకల్లో, అసమర్ధతలో, అనేక రకాల ఇతర జాడ్యాల్లో మన దేశంలోని ప్రైవేటు బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏమాత్రం తీసిపోవని ఏణ్ణర్ధంనుంచి రుజువవుతుండగా ఇన్నాళ్లూ తమ బ్యాంకు సీఈఓ, ఎండీ చందా కొచర్‌ను వెనకేసుకొస్తున్న ఐసీఐసీఐ బ్యాంకు ఎట్టకేలకు ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించి సందీప్ బక్షికి పగ్గాలు అప్పగించింది. అన్నిటినీ ప్రైవే టీకరిస్తూ పోతే తప్ప ఈ దేశం బాగుపడదని తెగ వాదించే ఆర్థిక రంగ నిపుణులు అందుకు ఐసీఐసీఐ పనితనాన్ని తరచు ఉదహరిస్తూ పరవశించేవారు. కానీ ఇప్పుడు బయటపడిందంతా అందుకు విరుద్ధం. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అసమర్థత వగైరాలు వెల్లడైనప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లపై కనీసం వెనువెంటనే చర్యలు తీసుకోవడం ఆనవాయితీ. కానీ ఐసీఐసీఐ బ్యాంకు ఆ పని చేయలేదు. వీడియోకాన్ గ్రూపునకు రుణం మంజూరులో అవకతవకలు చోటు చేసుకున్నాయని రెండేళ్లక్రితం ఒక మదుపుదారు ఫిర్యాదు చేసినప్పుడు ఆ సంస్థ మిన్నకుండి పోయింది. మొన్న మార్చిలో ఆ ఆరోపణలే వెల్లువెత్తడం మొదలయ్యాక ఆమెను సమర్థిస్తూ ప్రక టన విడుదల చేసింది. వాటిల్లో నిజానిజాలేమిటన్న సంగతలా ఉంచి తన వంతుగా వెను వెంటనే అంతర్గత విచారణ లేదా బయటివారితో విచారణ జరిపించి, నిజానిజాలు వెల్లడించి ‘అంతా సవ్యంగానే ఉన్నద’ని బ్యాంకు చెప్పగలిగితే, కొచర్ నిజాయితీ వెల్లడికావడంతోపాటు సంస్థ ప్రతిష్ట ఇంతకింతా పెరిగేది. కానీ కొచర్‌పై తమ సంస్థకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నాయని అది ప్రక టించి ఊరుకుంది. వచ్చిన ఆరోపణలన్నీ దురుద్దేశపూర్వకమైన, నిరాధారమైన వదంతులు మాత్రమేనని చెప్పింది. సంస్థలో 34 ఏళ్లక్రితం మేనేజ్మెంట్ ట్రైనీగా చేరి, తన ప్రతిభాపాటవా లతో ఎదిగి, బ్యాంకు రూపకల్పనలో పాలుపంచుకుని, దాన్ని ఉన్నత స్థాయికి చేర్చడంలో కొచర్ కృషి అసాధారణమైనది. ఆ విషయంలో ఆమెపై బ్యాంకుకు విశ్వాసం, నమ్మకం ఉండటం తప్పేం కాదు. అలా ఉండబట్టే ఆమెకు బ్యాంకు సారథ్య బాధ్య తలు కూడా అప్పగించారనడంలో ఎవరికీ సందేహం లేదు. కానీ వచ్చిన ఆరోపణలపై ఆడిటింగ్ జరిపించి బ్యాంకు మదుపుదార్లలోనూ, ఖాతాదార్లలోనూ ఉన్న సందేహాలను తొలగించడానికి అవి అడ్డు రావలసిన అవసరం లేదు. 2012లో వీడియోకాన్ గ్రూపునకు రూ. 3,250 కోట్ల రుణం మంజూరు చేయడంలో అవక తవకలు చోటు చేసుకున్నాయన్నది ప్రధాన ఆరోపణ. వీడియోకాన్ గ్రూపు అధినేత వేణుగోపాల్ ధూత్కూ, చందా కొచర్ భర్త దీపక్ కొచర్కూ మధ్య వ్యాపార లావాదేవీలున్నాయని వాటి పర్యవ సానంగానే రుణం లభించిందని ఈ ఆరోపణ చేసినవారు తెలిపారు. రుణం మంజూరయ్యాక దీపక్ కొచర్కూ, మరో బంధువుకూ లబ్ధి చేకూరిందని సాక్ష్యాధారాలతో చూపారు. తీసుకున్న రుణాన్ని వీడియోకాన్ సక్రమంగా చెల్లించి ఉంటే ఈ వ్యవహారం బయటికొచ్చేది కాదు. వచ్చినా దాన్నెవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ అప్పుగా తీసుకున్న రూ. 3,250 కోట్లలో రూ. 2,810 కోట్లను అది ఎగేసింది. దాంతో ఆ మొత్తాన్ని గత ఏడాది నిరర్థక ఆస్తిగా ప్రకటించాల్సి వచ్చింది. ఈ విషయంలో ఐసీఐసీఐ వివరణ సమర్ధనీయంగా లేదు. వీడియోకాన్‌కు రుణాలిచ్చిన కన్సార్షి యంలో తమది లీడ్ బ్యాంక్ కాదని, ఆ సంస్థకు కన్సార్షియం నుంచి వెళ్లిన మొత్తం రుణంలో తాము ఇచ్చింది 10 శాతం కన్నా తక్కువేనని బ్యాంకు చెప్పింది. అలాగే రుణమివ్వాలన్న నిర్ణయం బ్యాంకు క్రెడిట్ కమిటీదేనని, కమిటీలో ఆమె ఒక సభ్యురాలే తప్ప దానికి చైర్పర్సన్ కారని కూడా వివరించింది. ఇవన్నీ నిజమే కావొచ్చు. కానీ క్రెడిట్ కమిటీ వీడియోకాన్ గ్రూపునకు రుణం మంజూరు చేసిన సందర్భంలో తన భర్తకు వీడియోకాన్ గ్రూపు అధినేతతో వ్యాపార సంబంధా లున్నాయని చందా కొచర్ వెల్లడించారా లేదా అన్నది తేల్చాలి. అలాగే రుణం మంజూరయ్యాక ధూత్ నుంచి ఆమె కుటుంబీలకు లబ్ధి చేకూరిందో లేదో ఆరా తీయాలి. రుణం మంజూరైన సమ యంలో ధూత్‌తో తమ కుటుంబీకుల వ్యాపార వ్యవహారాలను చెప్పకపోయి ఉంటే చందా కొచర్ అనౌచిత్యానికీ పాల్పడినట్టే లెక్క. అధిక ఈక్విటీ గల ప్రధాన ప్రమోటర్ నేతృత్వంలో నడిచే హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్ర వంటి బ్యాంకులకూ, ఐసీఐసీఐకీ మధ్య వ్యత్యాసం ఉంది. ఐసీఐసీఐ పూర్తిగా వృత్తి నిపుణులుండే బోర్డు కార్యనిర్వహణలో నడుస్తోంది. సంస్థ అధిపతిగా ప్రధాన ప్రమోటర్ మార్కెట్ స్థితిగతులను అంచనా వేసుకుని, లాభనష్టాలను బేరీజు వేసుకుని ఎలాంటి నిర్ణయానికైనా రాగలుగుతారు. కానీ వృత్తి నిపుణులతో కూడిన బోర్డులు పనితీరు వేరేగా ఉంటుంది. అక్కడ బోర్డులోని నిపుణులంతా ఏ అంశం విషయంలోనైనా అన్ని కోణాల్లోనూ చర్చించుకుని ఒక నిర్ణయానికొస్తారు. ఏ ఒక్కరో బోర్డు నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం తక్కువ. కానీ ఐసీఐసీఐలో జరిగిందంతా అందుకు విరుద్ధమని జరిగిన వ్యవహారాన్ని గమనిస్తే అర్ధమవుతుంది. అలా చూస్తే ఇందులో కొచర్‌కు మాత్రమే కాదు... బోర్డు సమష్టి బాధ్యత కూడా ఉంది. ఐసీఐసీఐ వ్యవహారంపై ఫిబ్రవరిలో సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించగా, ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెబి కూడా రంగంలోకి దిగాయి. బ్యాంకు తనకు తానుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైన జస్టిస్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించింది. కొచర్‌ను వెనకేసుకురావడానికి బదులు ఈ పని ముందే చేసి ఉంటే ఐసీఐసీఐ ప్రతిష్ట ఇనుమడించేది. అయితే విచారకరమైన విషయమేమంటే కొచర్‌ను సెలవుపై వెళ్లాలని బోర్డు కోరలేదు. ఆమె తనంత తానుగా వెళ్లారు. ఇప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ విచారణ పూర్తయ్యేవరకూ సెలవు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. తీవ్ర ఆరోపణలొచ్చిన ప్పుడైనా నిర్ణయాత్మకంగా, దృఢంగా వ్యవహరించలేకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని బోర్డుకు తెలియపోవడం ఆశ్చర్యకరం. ఈ విషయంలో తన విధానాలు సవరించుకోవాలి. -
ఐసీఐసీఐ సీవోవోగా సందీప్ భక్షి
-
కొచర్‌కు ‘సెలవు’... కొత్త బాస్‌గా సందీప్ బక్షి
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూపునకు రుణాల మంజూరు వెనుక ఆర్థిక ప్రయోజనాలు ముట్టాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచర్... ఈ అంశంపై బ్యాంకు స్వతంత్రంగా చేపట్టిన విచారణ పూర్తయ్యే వరకు సెలవుపైనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా పనిచేస్తున్న సందీప్ భక్షి ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో)గా రంగ ప్రవేశం చేయనున్నారు. ఆయన్ను సీవోవోగా ఎంపిక చేస్తూ సోమవారం సమావేశమైన ఐసీఐసీఐ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19నే (మంగళవారం) సీవోవోగా సందీప్ భక్షి బాధ్యతలు చేపడతారని బ్యాంకు తెలిపింది. ఈ నియామకం వివిధ అనుమతులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ‘‘ఐసీఐసీఐ బ్యాంకు అన్ని వ్యాపారాలను భక్షి పర్యవేక్షించనున్నారు. అలాగే, బ్యాంకు కార్పొరేట్ కార్యకలాపాలను కూడా ఆయనే చూస్తారు. ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు అందరూ, ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ సైతం ఆయనకే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది’’ అని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. బ్యాంకు ఎండీ, సీఈవో అయిన చందా కొచర్‌కు భక్షి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని, అయితే, కొచర్ సెలవు కాలంలో భక్షి బ్యాంకు బోర్డుకు రిపోర్ట్ చేస్తారని తెలియజేసింది. ఇక భక్షి స్థానంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా ఎన్ఎస్ కన్నన్ నియామకానికి బ్యాంకు బోర్డు సిఫారసు చేసింది. వీడియోకాన్ గ్రూపునకు రుణం మంజూరులో చందాకొచర్ కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలు ముట్టాయంటూ ఆరోపణలు రావడంతో ఐసీఐసీఐ బ్యాంకు గత నెలలోనే దీనిపై స్వతంత్ర విచారణ నిర్వహించనున్నట్టు ప్రకటించడం తెలిసిందే. -
బీటెక్ విద్యార్థులపై వీసీ సెక్యూరిటీ కాల్పులు
జైపూర్: జైపూర్ జాతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ సందీప్ భక్షి ఫాం హౌస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి కొందరు ప్రైవేటు బీటెక్ కాలేజీ విద్యార్థులు వీసీ రెసిడెన్సీ ముందు సెల్ఫీలు దిగుతుండగా.. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నాడు. వెళ్లిపోవాలని ఎంత వారించినా వినకపోవడంతో విద్యార్థులపై సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపాడు. దీంతో ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వీసీ నివాసానికి చేరుకుని కాల్పులకు పాల్పడ్డ సెక్యూరిటీ గార్డుని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. విద్యార్థులను రోహిత్ కుమావత్, శైలేంద్ర కుమార్, దేవేంద్ర కుమార్ అని వీరు వివేకానంద ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారని గుర్తించినట్లు ఎస్ఐ నరేంద్ర తెలిపాడు. ముగ్గురిపై కాల్పులు జరిపినట్లు మరో ఇద్దరు విద్యార్థులు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించాడు. రోహిత్ పరిస్థితి విషమంగా ఉందని, దేవేంద్రకు కంటి భాగంలో తీవ్ర గాయమైంది. ఈ విషయమై వీసీ సందీప్ భక్షిని సంప్రదించగా.. విద్యార్థులు ఫాంహౌస్ లో ప్రవేశించి రెండు కార్లను చోరీ చేసేందుకు యత్నించారని, ప్రమాదవశాత్తూ విద్యార్థులకు గాయాలయ్యాయని చెప్పారు.