Pre-Release Event: Hero Darshan Invites Fan To Mysuru Farm House With Goat Gift - Sakshi
Sakshi News home page

కన్నడ స్టార్‌ హీరోకు మేకను బహుకరించిన ఫ్యాన్‌

Published Wed, Mar 3 2021 6:54 PM | Last Updated on Wed, Mar 3 2021 7:29 PM

Fan Gifts Goat To Darshan, Hero Invites Him To Farm House - Sakshi

అభిమాన హీరోను కలవాలని తహతహలాడేవారు ఎందరో! కానీ ఆ కల నెరవేరేది కొందరికే. హీరోను కలిసినప్పుడు అతడికి నచ్చిన బహుమతులను ఇచ్చి వారి మీద ప్రేమను అభివ్యక్తీకరిస్తుంటారు. ఈ క్రమంలో కన్నడ స్టార్‌ హీరోకు ఓ అభిమాని తను ప్రేమగా పెంచుకుంటున్న గొర్రెను బహుకరించాడు. అతడి ప్రేమకు సంతోషించిన హీరో అభిమానికి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. ఆ ఆఫర్‌ వివరాలేంటో కింది స్టోరీలో చదివేయండి..

కన్నడ స్టార్‌ దర్శన్‌ హీరోగా నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం "రాబర్ట్"‌. తెలుగులోనూ ఇదే పేరుతో రిలీజవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కర్ణాటకలోని హుబ్బలిలో జరిగింది. తన అభిమానులను కలవాలన్న దర్శన్‌ కోరిక మేరకు ప్రత్యేకంగా హుబ్బలిలోనే ఈ ఈవెంట్‌ను ప్లాన్‌ చేసినట్లు నిర్మాత వెల్లడించాడు. ఇక హుబ్బలిలో ప్రీ రిలీజ్‌ కార్యక్రమం ముగిసిన తర్వాత దర్శన్‌ తన కారులో బెంగుళూరు పయనమవగా ఎందరో అభిమానులు ఆయన వాహనాన్ని చుట్టుముట్టారు.

దీంతో అతడు కారులో నుంచి దిగి వారికి ఆటోగ్రాఫులు ఇస్తూ ఫొటోలు దిగాడు. ఈ క్రమంలో ఎంతో దూరం నుంచి ఈ ఈవెంట్‌కు చేరుకున్న శంబు గడగి అనే వ్యక్తి హీరోకు తను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఓ మేకను బహుమతిగా ఇచ్చాడు. అయితే వర్క్‌ బిజీలో ఉన్న హీరో దాన్ని స్వీకరించలేదు. కానీ మైసూర్‌లోని తన ఫామ్‌ హౌస్‌కు దీన్ని తీసుకొని రమ్మని అభిమానికి సూచించాడు. అంతేకాకుండా అతడి ఫోన్‌ నెంబర్‌ సైతం తీసుకున్నాడు. ఫామ్‌ హౌస్‌కు వచ్చేందుకు అభిమాని ఇంటికి తనే స్వయంగా కారు పంపుతానని మాటిచ్చాడు. ఈ ఆహ్వానానికి అభిమాని ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు.

చదవండి: రష్మిక జడలో మల్లెపూలు పెట్టిన అభిమాని!

5 కోట్ల లగ్జరీ కారు కొన్న ఎన్టీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement