
సెలబ్రిటీలను నేరుగా చూడాలనుకోవడం, సెల్ఫీ తీసుకోవడం తప్పు లేదు. కానీ సందు దొరికింది కదా అని వారితో అతి చనువుగా ప్రవర్తిస్తూ, అసౌకర్యం కలిగేలా తాకితే మాత్రం ముమ్మాటికీ తప్పే అవుతుంది. ఇలా ఇబ్బందిపెట్టేవారిని చూసీ చూడనట్లుగా వదిలేయొద్దని, గుణపాఠం చెప్పి తీరాలంటోంది హీరోయిన్ రాగిణి ద్వివేది (Ragini Dwivedi). ఇటీవల ఆమె తన కొత్త పాటను లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఆమె కాస్త ముందుకు రాగానే ఓ వ్యక్తి ఆమె చేయి పట్టుకుని లాగే ప్రయత్నం చేశాడు.

అలాంటివారిని వదిలిపెట్టొద్దు
దీంతో తిక్క రేగిన ఆమె అతడి చెంప చెళ్లుమనిపించింది. నటి రియాక్షన్‌తో ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన గురించి రాగిణి మాట్లాడుతూ.. అభిమానులు హద్దు మీరిన సందర్భాలు చాలా ఉన్నాయి. నటీమణుల విషయంలోనే కాదు నటుల విషయంలోనూ అలాగే ప్రవర్తిస్తున్నారు. ఒకరిని ఇబ్బందిపెట్టాలనుకోవడం, గాయం చేయాలనుకోవడం చాలా తప్పు. ఇలా చేస్తే ఏదో హైలైట్ అయిపోతామనుకుంటారు. అలాంటివారిని కొట్టినా తప్పు లేదు.
పారిపోయాడు.. లేదంటేనా!
నన్ను ఇబ్బందిపెట్టిన వ్యక్తిని కొట్టకుండా నేనెందుకు ఊరుకుంటాను. అతడు వెంటనే అక్కడినుంచి పారిపోయాడు కానీ లేదంటే స్టేజీ దిగి మరో రెండు దెబ్బలు వేసేదాన్ని. అలాంటివారికి గుణపాఠం చెప్పాల్సిందే! అలా అయితేనే వారికి బుద్ధి వస్తుంది అని చెప్పుకొచ్చింది. ఎక్కువగా కన్నడ సినిమాలు చేసే రాగిణి ద్వివేది తెలుగులో జెండాపై కపిరాజు అనే సినిమాలో కనిపించింది. తమిళ, మలయాళంలోనూ మురిపించిన రాగిణి ప్రస్తుతం వృషభ, సారీ: కర్మ రిటర్న్స్ సినిమాలు చేస్తోంది.
చదవండి: హనీరోజ్ అమాయకురాలేం కాదు.. దేనికైనా లిమిట్ ఉంటుంది: నటి ఫైర్
Comments
Please login to add a commentAdd a comment