Sandalwood Drug Case: డ్రగ్స్ కేసులో నిందితురాలైన సంజనా గల్రాని అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆమె తల్లీ రేష్మా గల్రాని ఈ విషయం తెలిపారు. అన్నింటికీ తలరాత బాగుండాలి. అయితే మేం ఎలాంటి తప్పు చేయలేదు. పేదలకు రోజూ అన్నదానం చేస్తున్నాం అని చెప్పారు. సంజన అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు.
తాము డ్రగ్స్ సేవించినట్లు సీసీబీ పోలీసులు చార్జిషీటులో పేర్కొనడంపై శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో నిందితురాలు, అందాల నటి రాగిణి ద్వివేది స్పందించారు. దేవుడు వేసిన ప్లాన్‌పై మనకు భరోసా ఉండాలి. అనుకున్నట్లు నడవకపోయినా కోపం ఉండకూడదు. ఆత్మవిశ్వాసం ఉంటేనే గెలవడం సాధ్యం అని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఇంటికే పరిమితమైన రాగిణి మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. ఈ కేసులో ఏం చేయాలనేదానిపై లాయర్‌తో సంప్రదిస్తున్నారు.
డ్రగ్స్‌పై కఠిన చర్యలు: హోంమంత్రి
రాష్ట్రంలో మత్తు దందాను నియంత్రిస్తామని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. బుధవారం కోరమంగళ్‌లోని కేఎస్‌ఆర్‌పీ మైదానంలో పోలీసు పబ్లిక్ స్కూలును ప్రారంభించి విలేకర్లతో మాట్లాడారు. మత్తు పదార్థాలతో యువత జీవనం నాశనమవుతోందన్నారు. పోలీసుల పిల్లలకు ఉత్తమ విద్యను అందించడానికి పబ్లిక్ పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐపీఎస్ రజనీశ్ గోయల్, డీజీపీ ప్రవీణ్ సూద్ పాల్గొన్నారు.
చదవండి : Drugs Case: శాండల్‌వుడ్ నటీమణులు రాగిణి, సంజనకు షాక్
నటుడిగా 12ఏళ్లుగా కష్టపడుతున్నా: సందీప్ కిషన్
Comments
Please login to add a commentAdd a comment