క్రేజీ ఆఫర్‌ కొట్టేసిన కల్యాణి ప్రియదర్శన్‌..! | Kalyani Priyadarshan Gets Offers From Sandalwood | Sakshi
Sakshi News home page

Kalyani Priyadarshan: క్రేజీ ఆఫర్‌ కొట్టేసిన కల్యాణి ప్రియదర్శన్‌..! త్వరలో శాండవుడ్‌కి..

Published Thu, Dec 29 2022 8:43 AM | Last Updated on Thu, Dec 29 2022 9:06 AM

Kalyani Priyadarshan Gets Offers From Sandalwood - Sakshi

ఏ రంగంలోనైనా వారసత్వం అన్నది ఎంట్రీ కార్డు మాత్రమే. ఆ తరువాత ప్రతిభ, అదృష్టంపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇక సినీ హీరోయిన్ల విషయానికి వస్తే దక్షిణాదిలో ముఖ్యంగా కోలీవుడ్‌లో నటి శృతిహాసన్, వరలక్ష్మి శరత్‌కుమార్, కీర్తి సురేశ్‌, కల్యాణి ప్రియదర్శన్‌ తదితరులు సెలబ్రిటీల వారసురాళ్లే. ప్రతిభకు అదృష్టం తోడవడంతో ప్రముఖ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. నటి కల్యాణి ప్రియదర్శన్‌ విషయానికి వస్తే దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీ (వీరు చాలా కాలం క్రితమే విడిపోయారు) దంపతుల వారసురాలు అన్న విషయం తెలిసిందే. కథానాయకిగా రంగప్రవేశం చేసి తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటిస్తోంది.

తెలుగులో అఖిల్‌ అక్కినేనికి జంటగా హలో చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తరువాత మలయాళం, తమిళం భాషల్లో ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో శింబుతో మానాడు చిత్రంలో నటించి హిట్‌ను అందుకుంది. ఇటీవల ఈమె మలయాళంలో నటించిన హృదయం చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతోందని సమాచారం. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ మనవడు, నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ కొడుకు యువరాజ్‌ కుమార్‌ హీరోగా రంగ ప్రవేశం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఆయనకు జంటగా కల్యాణి ప్రియదర్శన్‌ నటించనున్నట్లు తాజా సమాచారం. దీంతో దక్షిణాదిలో ఈ బ్యూటీ ఒక రౌండ్‌ కొట్టేసినట్లే అవుతుంది.  

చదవండి: 
స్విట్జర్లాండ్‌కు మహేశ్‌బాబు ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో వైరల్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement