కొరియోగ్రాఫర్ తో పెళ్లివార్తలను ఖండించిన సినీ తార!
Published Sun, Jan 19 2014 4:41 PM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో పెళ్లైందంటూ వస్తున్న వార్తలను దివంగత నటి మంజుల, విజయ్ కుమార్ కూతురు వనిత విజయ్ కుమార్ ఖండించారు. తాను రాబర్ట్ ఇంకా పెళ్లి చేసుకోలేదని వనిత స్సష్టం చేశారు. తాము ఇద్దరం మంచి స్నేహితులం. ప్రస్తుతం ఓ ప్రొడక్షన్ హౌజ్ ను ఏర్పాటు చేయడంపైనే దృష్టిని కేంద్రీకరించాం అని వనిత వెల్లడించింది.
అధికారికంగా పెళ్లి చేసుకోలేదు. మా రిలేషన్ గురించి మా కుటుంబాలకు తెలుసు. త్వరలోనే పెళ్లి చేసుకుంటాం అని వనితా ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేస్తాం. మేం కెరీర్ పరంగా విజయం సాధిస్తాం అని అన్నారు.
ఇదిలా ఉండగా, వనితకు ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి వివాహం తమిళ నటుడు ఆకాశ్ తో, రెండవ వివాహం ఎన్నారై ఆనంద్ రాజ్ తో జరిగింది. ఇద్దరు భర్తల నుంచి విడాకులు పొందిన వనితకు శ్రీహరి అనే కుమారుడు ఉన్నాడు. తమిళంలో చంద్రలేఖ, మానిక్కం అనే రెండు చిత్రాల్లో నటించింది.
Advertisement
Advertisement