మరో పెళ్లి వైపు అడుగులేస్తున్న సీనియర్‌ నటి | Vanitha Vijayakumar Will Get Another Marriage | Sakshi
Sakshi News home page

మరో పెళ్లి వైపు అడుగులేస్తున్న సీనియర్‌ నటి

Published Wed, Jul 31 2024 1:23 PM | Last Updated on Wed, Jul 31 2024 2:49 PM

Vanitha Vijayakumar Will Get Another Marriage

నటి వనితా విజయకుమార్‌ మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యారనే ప్రచారం ఇప్పుడు కోలీవుడ్‌ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతుంది. సీనియర్‌ నటుడు విజయకుమార్, మంజుల దంపతుల పెద్ద కూతురు వనిత అని తెలిసిందే. 1995లో నటుడు విజయ్‌కు జంటగా చంద్రలేఖ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన వనిత ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించింది. కాగా 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. అయితే ఆకాష్‌తో మనస్పర్థల కారణంగా 2005లో విడిపోయి విడాకులు తీసుకున్నారు.

ఆ తరువాత 2007లో ఆనంద్‌ జయదర్షన్‌ అనే వ్యాపారవేత్తను రెండోపెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు పుట్టింది. ఆ తరువాత ఆనంద్‌తోనూ విడాకులు తీసుకుంది. కాగా నృత్య దర్శకుడు రాబర్ట్‌తో వనిత కొంత కాలం సహజీవనం సాగించిందనే ప్రచారం జరిగింది.తరువాత 2020లో ఫోటోగ్రాఫర్ పీటర్ పాల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి కూడా కేవలం నాలుగు నెలల్లోనే ముగిసిపోయింది. కానీ, ఆయనతో పెళ్లి జరగలేదని కేవలం ఎంగేజ్‌మెంట్‌ మాత్రమే జరిగిందని నటి వనిత వివరణ ఇచ్చింది.

వీటన్నింటి తర్వాత 43 ఏళ్ల వనిత 4వ సారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైందనే టాక్ తమిళ మీడియాలో వినిపిస్తోంది. అలాంటి వార్త బయటకు రాగానే ఆమెను పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరనేది అందరి ప్రశ్న. కానీ ఇప్పటి వరకు ఆమె నుంచి ఎలాంటి అధికారిక సమాధానం లేదు. ఇప్పుడు పెళ్లి గురించి అడిగిన ఓ అభిమానికి వనిత బదులిస్తూ.. ఊహించని ట్విస్ట్ కోసం ఆగండి! అంటూ ఒక ట్విస్ట్‌ ఇచ్చింది. దీంతో ఆమె అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. నిజంగానే త్వరలో గుడ్‌న్యూస్‌ చెబుతుందేమోనని కామెంట్లు చేస్తున్నారు.  వనిత మాత్రమే కాదు, ఆమె కూతురు జోవికా విజయ్ కుమార్ కూడా బిగ్ బాస్ తమిళ సీజన్ 7లో పోటీ పడింది. ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు పోటీ పడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement