కడుపు, పేవుల్లో ఏదైనా ఒక సమస్య వస్తే డాక్టర్ మందిస్తాడు. ఇలా కాకుండా, సమస్య వచ్చిందని తెలిసిన వెంటనే అక్కడికక్కడే కొన్ని మందులు విడుదలైపోతే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా! మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని త్వరలో ఈ అద్భుతం సాకారం కానుంది. పేవుల్లోకి చేరి నెలరోజులపాటు అక్కడే ఉంటూ క్రమక్రమంగా మందులు విడుదల చేసే సరికొత్త గాడ్జెట్ ఒకదాన్ని వీరు తయారు చేశారు.
అంతేకాదు, శరీరం లోపలి నుంచే ఈ గాడ్జెట్ బ్లూటూత్ టెక్నాలజీ సాయంతో సమాచారాన్ని బయటకు పంపుతూ ఉంటుంది కూడా! త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో ప్రత్యేకమైన ప్లాస్టిక్‌తో తయారైన ఈ గాడ్జెట్ నెల రోజుల తరువాత నిరపాయకరంగా శరీరం నుంచి బయటపడిపోతుంది. ఈ గాడ్జెట్‌ను ఇప్పటికే తాము పందుల్లో ఉపయోగించి పరీక్షించామని సానుకూల ఫలితాలు రాబట్టామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త రాబర్ట్ లాంగర్ తెలిపారు. బ్లూటూత్ సంకేతాల ద్వారా అవసరమైనప్పుడు మందులు విడుదల చేసేందుకూ అవకాశం ఉంటుందని చెప్పారు. పరిశోధన వివరాలు అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ టెక్నాలజీస్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment