పెళ్లికి ముందే పిల్లల గురించి శోభిత కామెంట్స్ | Sobhita Comments On Her Children Before Marriage | Sakshi
Sakshi News home page

Sobhita: వీళ్ల గురించి నా పిల్లలకు చెబుతా

Published Tue, Oct 1 2024 12:54 PM | Last Updated on Tue, Oct 1 2024 2:55 PM

Sobhita Comments On Her Children Before Marriage

అక్కినేని కాబోయే కోడలు శోభిత.. హిందీలో సినిమాలు చేస్తూ కాస్త బిజీగా ఉంది. కొన్నాళ్ల క్రితం హీరో నాగచైతన్యతో ఈమెకు నిశ్చితార్థం జరగ్గా.. త్వరలో డెస్టినేషన్ వెడ్డింగ్ ఉండొచ్చని అంటున్నారు. అయితే పెళ్లికి ముందే పిల్లల గురించి, వాళ్లకు ఏం చెప్పాలో శోభిత డిసైడ్ అయిపోయింది. ఇందుకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)

తెలుగులో 'మేజర్', 'గూఢచారి' సినిమాలు చేసిన శోభిత.. ఇతర భాషల్లో మాత్రం చాలా చిత్రాల్లో నటించింది. అలా తమిళంలో చేసిన మూవీ 'పొన్నియిన్ సెల్వన్'. మణిరత్నం తీసిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేశారు. తాజాగా ఐఫా వేడుకలో బోలెడన్ని అవార్డులు దక్కించుకుంది. తాజాగా ఈ చిత్రం రిలీజై రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సినిమాలోని యాక్టర్స్ అందరూ అవెంజర్స్ అని పొగిడేస్తూ పోస్ట్ పెట్టింది.

'వీళ్లందరూ అవెంజర్స్‌ అని నా పిల్లలకు చెబుతాను' అని శోభిత మూవీ టీమ్‌తో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఇదలా ఉంచితే తమిళనాడులో అత్యంత ప్రజాదరణ పొందిన నవల 'పొన్నియిన్ సెల్వన్'. ఇదే పేరుతో సినిమా తీశారు. ఇందులో త్రిషకి తోడుగా ఉండే పాత్రలో శోభిత నటించింది.

(ఇదీ చదవండి: దేవర అభిమానులకు అదిరిపోయే శుభవార్త)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement