ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'దేవర'. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లు రాబడుతుంది. మొదటి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 304 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమాను ఇంతటి విజయవంతం చేసిన అభిమానుల కోసం ఒక కానుకను ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక భారీ సక్సెస్ మీట్‌ను అభిమానుల సమక్షంలో జరపాలని వారు ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వస్తుంది.
ఇదీ చదవండి: 25 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
దేవర సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసేందుకు మేకర్స్ కార్యచరణ ప్రారంభించారట. ఈ క్రమంలో లొకేషన్ కోసం వారు సెర్చింగ్ కూడా మొదలుపెట్టేశారట. అయితే, ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోనే ఒక భారీ బహిరంగ ప్రదేశంలో ఈ ఈవెంట్‌ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ కార్యక్రమానికి ఫ్యాన్స్ భారీగా రానున్నారని అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ అంశంపై మేకర్స్ నుంచి త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.
ఎన్టీఆర్ నుంచి సింగిల్ సినిమా వచ్చి సుమారు ఆరేళ్లు అయింది. దీంతో ఆయన్ను ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు భావించారు. దీంతో మేకర్స్ కూడా సెప్టెంబర్ 22న హైదరాబాద్ నోవాటెల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే పరిమితికి మించి అభిమానులు రావడంతో వేదిక ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఆ సమయంలో తమ దేవరను చూడలేకపోయామే అనే తీవ్ర నిరుత్సాహంతో అభిమానులు వెనుదిరిగారు. అందుకుగాను వారిలో సంతోషం నింపేందుకు దేవర టీమ్ ఇలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment