మహారాణి రుక్మిణీదేవిగా రీతు వర్మ | Actress Ritu Varma To Play As Maharani Rukmini Devi In Swag Movie, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

మహారాణి రుక్మిణీదేవిగా రీతు వర్మ

Published Sun, Sep 29 2024 1:27 PM | Last Updated on Sun, Sep 29 2024 2:36 PM

Actress Ritu Varma Play As Maharani Rukmini Devi In Swag Movie

అందం, ప్రతిభ గల అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్స్ లో ఒకరు రీతు వర్మ. పెళ్లి చూపులు, టక్ జగదీశ్, వరుడు కావలెను, కనులు కనులను దోచాయంటే వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతు వర్మ.  ఫిలింమేకర్స్ లో ప్రామిసింగ్ యంగ్ యాక్ట్రెస్ గా పేరు సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది రీతు వర్మ. ఆమె అప్ కమింగ్ రిలీజ్ స్వాగ్ తో మరోసారి ప్రేక్షకుల్ని అలరించబోతోంది.

స్వాగ్ సినిమాలో వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి పాత్రలో రీతు వర్మ కనిపించనుంది. మహారాణి రుక్మిణీదేవి పాత్రతో ఆమె అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. స్వాగ్ లో రీతు వర్మ క్యారెక్టర్ హైలైట్ కానుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేసేందుకు ఇష్టపడే రీతు వర్మ..మహారాణి రుక్మిణీదేవి పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్దమైంది. ఆమె ఎఫర్ట్ స్క్రీన్ మీద కనిపించబోతోంది.

ప్రస్తుతం రీతు వర్మ తెలుగుతో పాటు తమిళంలోనూ పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. హాట్ స్టార్ కోసం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. రీతు వర్మకు ఈ సిరీస్ డిజిటల్ డెబ్యూ కానుంది. శ్రీ విష్ణు హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో దర్శకుడు హసిత్ గోలి రూపొందించిన స్వాగ్ మూవీ అక్టోబర్ 4న థియేటర్స్ లోకి రానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement