స్టేట్ ఆర్కైవ్స్ ఉద్యోగితో కలిసి నకిలీ పత్రాలు సృష్టి
వీటి ఆధారంగా రాయదుర్గంలో ఖరీదైన భూమి కబ్జా
కేసు నమోదు చేసి ఈ నెల 17న అరెస్టు చేసిన పోలీసులు
మరుసటి రోజే బెయిల్, రద్దు చేయాలని పోలీసుల పిటిషన్
ఆమోదించిన న్యాయస్థానం,మళ్లీ జైలుకు వెళ్లిన నిర్మాత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని రెండు ప్రాంత్లాలో ఉన్న ఖరీదైన భూములపై కన్నేసి, నకిలీ పత్రాలతో కబ్జా చేసే ప్రయత్నం చేసిన టాలీవుడ్ నిర్మాత, రియల్డర్ బూరుగుపల్లి శివరామకృష్ణ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అరెస్టు అయిన మరుసటి రోజే బెయిల్‌పై బయటకు వచ్చిన ఈయన గురువారం మళ్లీ కటకటాల్లోకి వెళ్లారు. బెయిల్ రద్దు చేయడంతో పట్టుకున్న ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శివరామకృష్ణతో పాటు బెయిల్ పొందిన మరో నిందితుడు లింగమయ్య ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. శివరామకృష్ణ శ్రీవెంకటేశ్వర ఎస్టేట్స్ సంస్థకు మేనేజింగ్ పార్టనర్‌గా ఉన్నారు.
రాయదుర్గం పైగా విలేజ్‌లోని సర్వే నం.46లో ఉన్న 83 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు యాచారంలోని మరో 10 ఎకరాల ప్రైవేట్ భూమిపై కన్నేశారు. వీటిపై నకిలీ పత్రాలు సృష్టించిన శివరామకృష్ణ తార్నాకలో ఉన్న స్టేట్ ఆరై్కవ్స్‌లో రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్న కె.చంద్రశేఖర్‌ను సంప్రదించారు. అతడి సహాయంతో వీటికి మద్దతుగా స్టేట్ ఆరై్కవ్స్ నుంచి ఓ నకిలీ పహాణీ, సేత్వార్ రూపొందించి, అటెస్టేషన్ చేయించి తీసుకున్నారు. వీటి ఆధారంగా సైదాబాద్‌కు చెందిన రియల్టర్ ఎం.లింగమయ్యతో కలిసి రంగంలోకి దిగిన శివరామకృష్ణ రాయదుర్గంలోని భూమి తనదే అంటూ అందులో పాగా వేశారు. యాచారంలో ఉన్న ప్రైవేట్ భూమి మీద వివాదం సృష్టించారు.
శివరాకృష్ణ సమరి్పంచినవి నకిలీ పత్రాలని తేలి్చన న్యాయస్థానం అది ప్రభుత్వ భూమిగా ప్రకటించింది. దీనిపై నమోదైన కేసును దర్యాప్తు చేసిన ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు ఈ నెల 17న శివరామకృష్ణ, చంద్రశేఖర్, లింగమయ్యలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే అనారోగ్య కారణాలు చూపిన శివరామకృష్ణ, లింగమయ్య ఆ మరుసటి రోజే బెయిల్ పొందారు. వీటిని రద్దు చేయాలని కోరుతూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఇరువురికీ మంజూరు చేసిన బెయిల్ రద్దు చేసింది. దీంతో గురువారం శివరామకృష్ణను పట్టుకున్న పోలీసులు వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలించారు. స్టేట్ ఆరై్కవ్స్ ఉద్యోగి చంద్రశేఖర్ ఇప్పటికీ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment