Land Kabbja
-
టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ బెయిల్ రద్దు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని రెండు ప్రాంత్లాలో ఉన్న ఖరీదైన భూములపై కన్నేసి, నకిలీ పత్రాలతో కబ్జా చేసే ప్రయత్నం చేసిన టాలీవుడ్ నిర్మాత, రియల్డర్ బూరుగుపల్లి శివరామకృష్ణ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అరెస్టు అయిన మరుసటి రోజే బెయిల్‌పై బయటకు వచ్చిన ఈయన గురువారం మళ్లీ కటకటాల్లోకి వెళ్లారు. బెయిల్ రద్దు చేయడంతో పట్టుకున్న ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శివరామకృష్ణతో పాటు బెయిల్ పొందిన మరో నిందితుడు లింగమయ్య ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. శివరామకృష్ణ శ్రీవెంకటేశ్వర ఎస్టేట్స్ సంస్థకు మేనేజింగ్ పార్టనర్‌గా ఉన్నారు. రాయదుర్గం పైగా విలేజ్‌లోని సర్వే నం.46లో ఉన్న 83 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు యాచారంలోని మరో 10 ఎకరాల ప్రైవేట్ భూమిపై కన్నేశారు. వీటిపై నకిలీ పత్రాలు సృష్టించిన శివరామకృష్ణ తార్నాకలో ఉన్న స్టేట్ ఆరై్కవ్స్లో రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్న కె.చంద్రశేఖర్‌ను సంప్రదించారు. అతడి సహాయంతో వీటికి మద్దతుగా స్టేట్ ఆరై్కవ్స్ నుంచి ఓ నకిలీ పహాణీ, సేత్వార్ రూపొందించి, అటెస్టేషన్ చేయించి తీసుకున్నారు. వీటి ఆధారంగా సైదాబాద్‌కు చెందిన రియల్టర్ ఎం.లింగమయ్యతో కలిసి రంగంలోకి దిగిన శివరామకృష్ణ రాయదుర్గంలోని భూమి తనదే అంటూ అందులో పాగా వేశారు. యాచారంలో ఉన్న ప్రైవేట్ భూమి మీద వివాదం సృష్టించారు. శివరాకృష్ణ సమరి్పంచినవి నకిలీ పత్రాలని తేలి్చన న్యాయస్థానం అది ప్రభుత్వ భూమిగా ప్రకటించింది. దీనిపై నమోదైన కేసును దర్యాప్తు చేసిన ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు ఈ నెల 17న శివరామకృష్ణ, చంద్రశేఖర్, లింగమయ్యలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే అనారోగ్య కారణాలు చూపిన శివరామకృష్ణ, లింగమయ్య ఆ మరుసటి రోజే బెయిల్ పొందారు. వీటిని రద్దు చేయాలని కోరుతూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఇరువురికీ మంజూరు చేసిన బెయిల్ రద్దు చేసింది. దీంతో గురువారం శివరామకృష్ణను పట్టుకున్న పోలీసులు వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలించారు. స్టేట్ ఆరై్కవ్స్ ఉద్యోగి చంద్రశేఖర్ ఇప్పటికీ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. -
చంద్రబాబు ఆశీస్సులతో రెచ్చిపోయిన చింతమనేని
-
భూదందాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ వెంకట అప్పలనాయుడు
-
మంత్రి అండతో కోనేరు ఆక్రమణకు యత్నం
సూళ్లూరుపేట (నెల్లూరు): మండలంలో డేగావారికండ్రిగలో సుమారు 1.36 ఎకరాల కోనేరు, ఆర్అండ్బీ రోడ్డు స్థలాన్ని జిల్లాకు చెందిన మంత్రి సిఫార్సులతో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన డేగా అనే ఇంటిపేరు కలిగిన జమీందార్లుగా ఉండేవారు. వారి ఇంటిపేరుతోనే ఆ గ్రామానికి కూడా డేగావారికండ్రిగ అనే వచ్చిందని ›గ్రామపెద్దలు చెబుతున్నారు. జమీందార్లకు సంబంధించి భూములను అంతా అమ్ముకుని వెళ్లారని, ప్రస్తుతం గంగమ్మ, వినాయకుడి గుడికి వెళ్లే రోడ్డు ఈ ఆలయాల ముందున్న కోనేరు కూడా తమదేనని డేగా కరుణాకర్‌రెడ్డి అనే వ్యక్తి దీన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సర్వే చేశారు గతంలో కూడా కోనేరు స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసినపుడు సర్వే కూడా జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. సర్వే నంబర్ 157, 157–2ఏ, 157–2బీ, 157–2సీలో సుమారు 1.36 ఎకరాల భూమి దాకా కోనేరు, ఆర్అండ్బీ రహదారి అని రెవెన్యూ రికార్డులో ఉంది. తన వద్ద రికార్డు ఉందని ఈ భూమి తమది అని కరుణాకర్‌రెడ్డి జిల్లాకు చెందిన మంత్రి ద్వారా ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని, అధికారపార్టీ నేతల అండదండలతో మా భూమిని ఆక్రమించే ప్రయత్నాలు చేయడం మానుకోవాలని వారు కోరుతున్నారు. ఈ వివాదం చాలాకాలంగా జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం మంత్రి సిఫార్సులతో రెవెన్యూ «అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఎలాగైనా ఆక్రమించుకోవాలనే ఆలోచనలో కరుణాకర్‌రెడ్డి ఉన్నారు. ఈ భూమి డేగా వారిది కాదని, కోనేరు, ఆర్అండ్బీ రహదారికి రికార్డులో నమోదై ఉందని, పైపెచ్చు ఈ ప్రాంతంలో గంగమ్మ ఆలయం, వినాయకుడి గుడి ఉండటంతో ఈ రెండు ఆలయాలకు వెళ్లేందుకు దారి అవసరానికి, అలాగే కోనేరుకు మరమ్మతులు చేయించి బాగుచేస్తే పదిమందికి ఉపయోగపడేలా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆ స్థలం గ్రామానిదే కోనేరు, రోడ్డు స్థలం గ్రామానికి సంబంధించినదే. డేగా వాళ్లు ఈ గ్రామంలో జమీందార్లుగా ఉన్నమాట వాస్తవమే. వాళ్లు ఉన్న ఆస్తులన్నింటినీ ఒక్కొక్కటిగా అమ్ముకుని వెళ్లారు. ఈ పొలం తమది అని జమీందార్లు అన్నపుడు దీనిపై సర్వే చేయించాం. అది పూర్తిగా ఆర్అండ్బీ రోడ్డు, కోనేరుకు చెందిన స్థలం అని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఇప్పుడు స్థలం తనది అని కరుణాకర్‌డ్డి రావడం సమంజసం కాదు. మంత్రి సిఫార్సులతో ఆక్రమించే ప్రయత్నాలు మానుకోవాలి. –ఎల్.రమ్మణయ్య, మాజీ సర్పంచ్, డేగావారి కండ్రిగ స్థలాన్ని కాపాడుతూ వచ్చాం చిన్నప్పటినుంచి కోనేరు పక్కనే ఉన్న చెట్టుకు నీళ్లుపోసి కాపాడుతూ వచ్చాం. ఈ పొలం ఏ మాత్రం డేగా వారిది కాదు. వినాయకుడి గుడికి, గంగమ్మ గుడికి వెళ్లే దారి కావడం, దీనికి పక్కనే కోనేరు ఉండటం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కోనేరు గురించి ఆలనా పాలనా చూసుకోకపోవడంతో అది పూడిపోయింది. ప్రస్తుతం దీన్ని స్థలంగా చూపించి అక్రమించుకోవాలనే ఆలోచన మంచిది కాదు. –పుట్టు వెంకటాద్రి, డేగావారి కండ్రిగ -
భూ కబ్జాలపై సీబీఐ విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రభుత్వ భూదాన్, కాందిశీకుల భూముల అన్యాక్రాంతంపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని సీపీఐ రాష్ట్ర నాయకులు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం గురువారం గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిసింది. ఈ మూడు జిల్లాల్లో మొత్తం పదహారు ప్రాంతాల్లో వందల ఎకరాల్లో అన్యాక్రాంతమైన భూముల వివరాలను వారు గవర్నర్‌కు అందజేశారు. గవర్నర్‌ను కలసిన అనంతరం సీపీఐ నాయకులు మీడియాతో మాట్లాడారు. భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని చాడ అన్నారు. అన్యాక్రాంతమైన భూముల వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసి, పెద్ద చేపలను వదిలేస్తున్నారని చాడ ఆరోపించారు.