
శ్రీవిష్ణు హీరోగా రూపొందుతోన్న సినిమా '#సింగిల్'. 'నిను వీడని నీడను నేనే' మూవీ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకుడు. ఈ చిత్రంలో ఇవానా, కేతికా శర్మ హీరోయిన్లు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్‌పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మే 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి పోస్టర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: కాలమే సమాధానమిస్తుంది.. పోలీసు విచారణ తర్వాత విష్ణుప్రియ)
యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని అలరించే చిత్రంగా ‘సింగిల్’ ఉంటుంది. ఈ వేసవిలో శ్రీవిష్ణు తన నవ్వులతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఆయన పాత్రలోని రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి అని చిత్రయూనిట్ పేర్కొంది. వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతమందిస్తున్నారు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 9 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment