Bhala Thandanana Movie New Released Out | May 6th Sree Vishnu's Movie Released - Sakshi
Sakshi News home page

Sri Vishnu Movie Release Date: వాయిదా పడ్డ భళా తందనాన మూవీ, కోత్త రిలీజ్‌ డేట్‌ ఇదే

Published Fri, Apr 29 2022 4:15 PM | Last Updated on Fri, Apr 29 2022 4:40 PM

Bhala Thandanana Movie Makers Announce New Release Date On May 6th - Sakshi

యంగ్ హీరో శ్రీ విష్ణు ఎంచుకునే క‌థ‌లే కాదు, ఆయ‌న న‌టించే సినిమాల టైటిల్స్ కూడా విభిన్నంగా ఉంటాయి. మ‌రీ ముఖ్యంగా తెలుగులో టైటిల్స్ పెట్టేందుకు ఆయ‌న ఎక్కువ‌గా మొగ్గు చూపుతుంటాడు. దానివ‌ల్ల ఈ త‌రం వాళ్ల‌లో కొంత‌మందికైనా కొన్ని మంచి ప‌దాలు తెలుస్తాయంటాడీ హీరో. తాజాగా ఆయ‌న న‌టించిన చిత్రం ‘భ‌ళా తంద‌నాన‌’. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్‌, పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త రిలీజ్‌ డేట్‌ను కూడా వెల్లడించారు. మే 6వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర యూనిట్‌. కాగా ఈ సినిమాలో  శ్రీ విష్ణు సరసన కేథరిన్‌ థ్రెసా నటించింది. ‘బాణం’ సినిమా ఫేమ్‌ చైతన్య దంతులూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement